ఈ మధ్య అన్నం తినడం బరువు పెరిగేందుకు కారణం అవుతోందన్న ఒక వాదన చాలా ప్రాచూర్యంలో ఉంది.

బరువు తగ్గేందుకు అన్నాన్ని పూర్తిగా దూరం పెట్టే పనిలేదని నిపుణులు చెబుతున్నారు.

అన్నం మనకు సంస్కృతిలో భాగం. మన ఆహారానికి గుర్తింపు. అందుకే అన్నం తింటేనే కడుపునిండిన భావన కలుగుతుంది.

అన్నం పూర్తిగా మానేస్తే చర్మం, జుట్టు, జీర్ణవ్యవస్థ దెబ్బతింటాయి.

స్థానికంగా దొరికే ఏ బియ్యం అయినా అక్కడి వారి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కేరళ వారికి నవారా, బీహారీలకు మార్చా రైస్, మహారాష్ట్రీయులకు వాడా కోలం బియ్యం ఏదైనా స్థానిక బియ్యం మంచివి.

పూర్వీకుల నుంచి ఎలాంటి ఆహారపు అలవాట్లు మనకు వచ్చాయో అవే మనకు మేలు చేసేవి అని నిపుణుల సలహా.

Representational image:Pexels