తరచుగా చల్లని నీళ్లు తాగేవారికి ఎక్కువ చెమట వస్తుంది.

చల్లని నీళ్లు ఎక్కువగా తాగేవారిలో తలలో రక్తనాళాలు సంకోచించి తలనొప్పి తరచుగా వస్తుంది.

మింగేందుకు ఇబ్బంది ఏర్పడే స్థితి అచాల్సియా. చల్లని నీళ్లు తాగితే ఈ సమస్య ఎక్కువ అవుతుంది.

చల్లని నీళ్లు తాగితే శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేందుకు శరీరం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.

చల్లని నీళ్ల వల్ల గొంతులో, ముక్కులో మ్యూకస్ మరింత చిక్కబడి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగవచ్చు.

సెన్సిటివ్ దంతాలు ఉన్న వారికి చల్లని నీళ్ల వల్ల దంతాల్లో ఒక రకమైన అసౌకర్యం ఏర్పడుతుంది.

వర్కవుట్ చేస్తున్నపుడు చల్లని నీళ్లు తాగితే మజిల్ క్రాంప్స్ రావచ్చు.

చన్నీళ్ల వల్ల డీహైడ్రేషన్ కావచ్చు. చల్లని నీళ్లను వెచ్చగా మార్చేందుకు శరీరం ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది.

చల్లని నీళ్లు రోగ నిరోధక వ్యవస్థను కూడా బలహీన పరుస్తాయి. దానివల్ల త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడవచ్చు.

Representational image:Pexels