డెలివరీ అయ్యాక కొత్త తండ్రులకు డిప్రెషన్



డెలివరీ అయ్యేది తల్లికి. వారిలో ప్రసవం తరువాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వస్తుంది.



ఒక అధ్యయనంలో తల్లులకే కాదు తండ్రులకు కూడా డిప్రెషన్ ఛాయలు కనిపిస్తున్నాయని తేలింది.



సరిగా మాట్లాడక పోవడం, నిద్ర పోక పోవడం, తినకపోవడం వంటి లక్షణాలు వారిలో కనిపిస్తున్నాయి.



బిడ్డ పుట్టాక ఇంట్లో వాతావరణ మారడం, భార్యకు ఆరోగ్యం బాగోక పోవడం, ఆర్ధిక ఇబ్బందులు వంటివి వీరి డిప్రెషన్ కు కారణం కావచ్చు.



భార్య పూర్తిగా చంటి పిల్లలతోనే ఉండడం, పనులు చేసుకోలేకపోవడం వంటివి కూడా తండ్రిపై ప్రభావం చూపిస్తాయి.



ఈ సమయంలో వారికి కుటుంబ సభ్యుల తోడ్పాటు అవసరం.



మరీ కష్టంగా అనిపిస్తే మానసికవైద్యుల సాయాన్ని తీసుకోవాలి.