రోజుకో పదినిమిషాలు నవ్వండి చాలు నవ్వు నాలుగు విధాలా చేటు కాదు నలభై విధాల ఆరోగ్యం . తాజా అధ్యయనం ప్రకారం రోజుకు పదినిమిషాలు మనస్పూర్తిగా, గట్టిగా నవ్వితే చాలు... ఎంతో ఆరోగ్యం. నవ్వు మంచి హీలింగ్ పవర్ ఉంది. మానసిక ఆరోగ్యం చాలా మెరుగు పడుతుంది. గుండె జబ్బులను అరికట్టడంలో నవ్వు గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. నవ్వడం వల్ల ఆక్సిజన్ శరీరమంతా సవ్యంగా ప్రసారం అవుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. శరీరంలోని నొప్పిని తగ్గించేందుకు నవ్వు మంచి మందులా పనిచేస్తుంది. అందుకే రోజూ ఓ పదినిమిషాలు నవ్వుకు కేటాయించండి.