ఉల్లిపాయ రసం తలకు రాస్తే చాలు జుట్టు సమస్యలు అధికంగా ఉన్నాయి. జుట్టు రాలిపోవడం, చివర్లు చిట్లిపోవడం వంటివి. జుట్టు బాగా పెరగాలంటే ఉల్లిరసాన్ని మాడుకు పట్టిస్తే చాలు. ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. ఉల్లిరసం జుట్టును బలంగా చేస్తుంది. అయితే ఉల్లిపాయల అలెర్జీ ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఉల్లిపాయల అలెర్జీ ఉంటే వారికి దురద, దద్దుర్లు త్వరగా వస్తాయి. అలెర్జీ ఉన్న వారు ఉల్లిరసంలో కలబంద రసం లేదా కొబ్బరి నూనె వేసి కలిపి మాడుకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల మాడుకు మరింతగా క్లీన్ అవుతుంది. జుట్టు కూడా పెరుగుతుంది. ఉల్లిపాయ రసంలో రెండు స్పూన్ల పటిక పంచదార పొడి కలిపి తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు చక్కగా పెరుగుతుంది. చుండ్రు కూడా తగ్గుతుంది.