ఉసిరిలో విటమిన్ సి పుష్కలం. ఇది నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఉసిరిలో పీచు పదార్థం ఎక్కువ. పరగడుపునే ఉసిరి తింటే జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని నివారిస్తాయి. ఉసిరిలో ఐరన్ ఎక్కువ. జుట్టు పెరిగేందుకు, రక్త వృద్ధికి చాలా మేలు చేస్తుంది. ఉసిరి డయాబెటిస్ తో బాధపడే వారికి షుగర్ తగ్గిస్తుంది. Representational image:Pexels