News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Guppedanta Manasu September 6th: సీరియల్ ని మలుపుతిప్పనున్న రిషి సమాధానం, మరింత విజృంభించిన శైలేంద్ర!

ఏంజెల్ పెళ్లిగోల ఓ వైపు...అటు కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు మరోవైపు...ఇదే స్టోరీ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

గుప్పెడంతమనసు సెప్టెంబరు 6th ఎపిసోడ్ (Guppedanta Manasu September 6th Written Update)

ఏంజెల్ ఎవర్ని పెళ్లిచేసుకోవాలి అనుకుంటుందో తెలుసుకునేందుకు విశ్వనాథం..వసుధార ఇంటికి వెళతాడు. చాలాసేపు ఏంజెల్ గురించి మాట్లాడిన తర్వాత..తను మనసులో ఉన్నదెవరో నీకు తెలుసు అంటాడు. చెప్పమ్మా అని వసుధార తండ్రి చక్రపాణి కూడా అడుగుతాడు. రిషి అనే పేరు వసునోటి వెంట విని విశ్వనాథం సంతోషపడితే...చక్రపాణి షాక్ అవుతాడు. అల్లుడుగారా అని అనేసి ఆ తర్వాత కవర్ చేసుకుంటాడు. ఏంజెల్ మనసులో ఉన్నది రిషి అని తెలిసిన విశ్వనాథం..ఆ బాధ్యత చక్రపాణికి అప్పగిస్తాడు. అప్పటికే షాక్ లో ఉన్న వసుధార తండ్రి ఆపని నేను చేయలేనని చెప్పేస్తాడు. సరే అని విశ్వనాథం వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏమోషన్లో ఉన్న చక్రపాణిని ఓదార్చుతుంది వసుధార..

Also Read: నిజం తెలుసుకోండి సార్ అంటూ వసు ఆవేదన, చెలరేగిపోతున్న శైలేంద్ర!

మిషన్ ఎడ్యుకేషన్ గురించి జూమ్ మీటింగ్ పెట్టుకుంటారు. జగతి-మహేంద్ర, వసు-రిషి, పాండ్యన్ బ్యాచ్ అందరూ కలసి గ్రూప్ కాల్ లో మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటారు. గతంలో వసు-రిషి చేసిన సర్వీస్ గురించి జగతి ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతుంది. ఆ ఇద్దరు లెక్చరర్లు లేకపోవడంతో మూడేళ్లుగా మిషన్ ఎడ్యుకేషన్ అలాగే ఉండిపోయింది...ఆ లెక్చరర్లు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ అలాంటి లెక్చరర్లు దొరకలేదు. మీరు అంత సమర్థులని భావించి మీకు ఈ ప్రెజెక్ట్ అప్పగిస్తున్నాం అని చెబుతుంది. అంతా విన్న రిషి..మీరు రీసెంట్ గా పంపిన ప్రతిపాదనలు గురించి వివరిస్తారా అని టాపిక్ డైవర్ట్ చేస్తారు. ఓ వైపు గ్రూప్ కాల్ నడుస్తుండగా..దేవయాని-శైలేంద్ర చూస్తారు.  అటు కాల్ లో ఉన్న వసుధార విశ్వనాథం మాటలు ( ఏంజెల్ రిషిని కోరుకుంటే అంతకన్నా కావాల్సింది ఏముంది) గుర్తుచేసుకుని బాధపడుతుంది. అది గమనించిన రిషి.. మీటింగ్ క్లోజ్ చేయించేస్తాడు. వసుధారకి ఏమైంది ఎందుకు డల్ గా ఉంది అనుకుంటూ వసుకి కాల్ చేసి కాన్ఫరెన్స్ రూమ్ కి రమ్మని పిలుస్తాడు.

జగతి-మహేంద్ర
కొడుకుని గ్రూప్ కాల్ లో చూసుకుని సంతోషపడాల్సి వచ్చింది, ఈ వైపు ఉచ్చు బిగుస్తోంది, మనం ఏదో ఒకటి చేసి రిషిని ఇక్కడకు తీసుకురావాలి, బావగారికి నిజం చెప్పాలి అనుకున్న టైమ్ లో శైలేంద్ర బాగారికి మనపై అనుమానం రేకెత్తించాడు, ఓ చిన్న విషయం చెప్పలేదంటేనే బావగారు అంత బాదపడ్డారు, ఇక రిషి విషయం దాచిపెట్టాం అని తెలిస్తే ఇంకెత బాధపడతారో, మనం ఇరుక్కుపోయాం అని బాధపడుతుంది. కాస్త ఓపిక పడదాం జగతి...నువ్వు బాధపడితే నాకేం తోచదంటాడు మహేంద్ర. శైలేంద్ర దుర్మార్గుడు, మోసగాడు తన కుట్రలు మనం పసిగట్టలేకపోతున్నాం, మనం తనలా దుర్మార్గంగా ఆలోచించలేం కాబట్టి... శైలేంద్ర తాత్కాలికంగా సాధించినా అంతిమంగా విజయం రిషిదే అంటాడు... ఇదంతా బయటి నుంచి విన్న శైలేంద్ర మరింత రగిలిపోతాడు...

Also Read: ఇగో మాస్టర్ దగ్గర అడ్డంగా బుక్కైన వసు- రిషి మనసులో ఉన్నది ఎవరో ఏంజెల్ కి తెలిసిపోతుందా?

రిషి-వసు
మీటింగ్ జరుగుతుంటే తదేకంగా నన్నే చూస్తున్నారెందుకని వసుధారని క్వశ్చన్ చేస్తాడు రిషి... ఏం చెప్పాలి,నేనేం చేశాను అనగానే ఫైర్ అవుతాడు రిషి. ఏంజెల్ తరపున రాయబారం నడుపుతున్నారు, ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను, కనీసం ఇక్కడైనా మీరు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా, నన్ను క్షోభపెట్టడమే పనిగా పెట్టుకున్నారా, ఏం అడిగినా నోరువిప్పి చెప్పరు, అంతా జరిగాక పరిస్థితుల ప్రభావం వల్ల చెప్పలేదంటారు అంతేనా...నా పాటికి నేను అరుస్తున్నా కానీ మీ మనసు కరగడం లేదు..ఇంకా మీతో మాటలు అనవసరం అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.... ఇప్పుడు నేను ఏం చెప్పాలి సార్ అని విశ్వనాథం మాటలు తల్చుకుని మరింత బాధపడుతుంది.

రిషి-విశ్వనాథం
ఇంటికి వచ్చిన రిషిని పిలిచిన విశ్వానాథం..ఏంజెల్ పెళ్లిగురించి మాట్లాడతాడు. తన మనసులో ఉన్నది నువ్వేనని తెలిసింది..నువ్వేమంటావ్ రిషి అని అడుగుతాడు. రిషి షాక్ లో ఉండిపోతాడు...

Published at : 06 Sep 2023 08:41 AM (IST) Tags: Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedanta Manasu Serial September 6th Episode

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

బెదరగొట్టిన ‘యానిమల్’, రామ్ ‘స్కంద’.. ‘చంద్రముఖి-2’ ఎలా ఉన్నాయ్? ఇవీ ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలు

బెదరగొట్టిన ‘యానిమల్’, రామ్ ‘స్కంద’.. ‘చంద్రముఖి-2’ ఎలా ఉన్నాయ్? ఇవీ ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలు

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ గౌతమ్ మెడపై గాయాలు - తేజను తిట్టిపోస్తున్న ప్రేక్షకులు

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ గౌతమ్ మెడపై గాయాలు - తేజను తిట్టిపోస్తున్న ప్రేక్షకులు

Bigg Boss Season 7 Latest Promo: ఓరి వీరి వేషాలో, చూస్తుంటునే డోకు వస్తోందిగా - వింత అవతారాల్లో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు, దెయ్యం పిల్లగా ప్రియాంక!

Bigg Boss Season 7 Latest Promo: ఓరి వీరి వేషాలో, చూస్తుంటునే డోకు వస్తోందిగా - వింత అవతారాల్లో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు, దెయ్యం పిల్లగా ప్రియాంక!

Bigg Boss Updates: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!

Bigg Boss Updates: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది