అన్వేషించండి

Guppedanta Manasu September 5th: నిజం తెలుసుకోండి సార్ అంటూ వసు ఆవేదన, చెలరేగిపోతున్న శైలేంద్ర!

Guppedantha Manasu September 5th: వసుధార-రిషి ఇద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటుంటే... మధ్యలో వచ్చి చేరింది ఏంజెల్. అదే స్టోరీ సాగుతోంది....

గుప్పెడంతమనసు సెప్టెంబరు 5th ఎపిసోడ్ (Guppedanta Manasu September 5th Written Update)

DBST కాలేజీ బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేసి జ‌గ‌తి, మ‌హేంద్ర‌ల‌ను ఇరికించిన శైలేంద్ర...ఆ సమస్య నుంచి బయటపడేసేందుకు తానే డబ్బు తీసుకొస్తాడు. ఆ డ‌బ్బుల‌ను తానే అరెంజ్ చేసి తండ్రి ద‌గ్గ‌ర మంచి మార్కులు కొట్టేస్తాడు. ఇదే అదనుగా దేవయాని కూడా మరింత పొగిడేస్తుంది. ఫారిన్‌ను వ‌చ్చిన త‌ర్వాత తెలిసి తెలియ‌క కొన్ని త‌ప్పులు చేశాడ‌ని, నెమ్మ‌దిగా త‌న న‌డ‌వ‌డిక మార్చుకున్నాడ‌ని స‌మ‌ర్థిస్తుంది. ఇంట్లో అంద‌రి క‌న్నీళ్ల‌కు శైలేంద్ర‌నే కార‌ణ‌మ‌ని మ‌న‌సులో అనుకుంటుంది జగతి. మీ అంద‌రి కోసం నా ప్రాణాలు ఇవ్వ‌డానికైనా సిద్ధ‌మ‌ని సెంటిమెంట్ డైలాగ్‌లు కొట్టి శైలేంద్రని మరింత మంచి చేసుకుంటాడు. కొడుకు మాయలో పడిపోయిన ఫణీంద్ర పూర్తిగా సపోర్ట్ చేస్తాడు.  ఈ విషయం డాడీతో ఎందుకు చెప్పలేదని శైలేంద్ర అడిగితే...బ్యాంకుకి వెళ్లింది నువ్వేకదా నువ్వెందుకు చెప్పలేదని రివర్స్ క్వశ్చన్ చేస్తాడు. తానే ఇరుక్కున్నానని తెలుసుకున్న శైలేంద్ర టాపిక్ మార్చేస్తాడు. ఇంకా ఏమైనా దాచారా అని కావాలని నిలదీస్తాడు. ఏదైనా విష‌యం దాచిపెడితే ముందే చెప్ప‌మ‌ని, ఆ త‌ర్వాత ఎవ‌రైనా చెబితే తెలిసిన‌ప్పుడు నేను బాధ‌ప‌డ‌తానంటాడు ఫణీంద్ర. అదేం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు జగతి-మహేంద్ర.
శలైంద్ర: ఇక‌పై నాట‌కం ఆడించేది నేను. ఆడేది మీరు. మీకు మీరుగా డీబీఎస్‌టీ కాలేజీ నాకు అప్ప‌గించేలా చేసుకుంటాన‌ని మ‌న‌సులోనే ఛాలెంజ్ చేస్తాడు శైలేంద్ర‌

Also Read: ఇగో మాస్టర్ దగ్గర అడ్డంగా బుక్కైన వసు- రిషి మనసులో ఉన్నది ఎవరో ఏంజెల్ కి తెలిసిపోతుందా?

ఏంజెల్-వసు

రిషి గురించే వ‌సుధార ఆలోచనలో ఉండగా  ఏంజెల్ కాల్ చేస్తుంది. రిషి మ‌న‌సులో ఓ అమ్మాయి ఉంద‌ని, ఆమె ఎవ‌రో తెలుసుకోమ‌ని వ‌సుధార‌ను  కోరుతుంది. రిషి గీసిన క‌ళ్ల బొమ్మ‌ను వ‌సుధార‌కు పంపిస్తుంది. రిషి గ‌దిలో ఈ పెయింటింగ్ దొరికింద‌ని, ఆ పెయింటింగ్ చూస్తుంటే రిషికి గ‌తంలో ప్రేమ ఉంద‌ని అనిపిస్తోందని అడుదుతుంది ఏంజెల్‌. నేను అడిగితే చెప్ప‌డు కాబ‌ట్టి నువ్వే ఆ అమ్మాయి ఎవ‌రో తెలుసుకోమ‌ని వ‌సుధార‌ను కోరుతుంది ఏంజెల్‌. క‌ళ్లు ఎవ‌రివో క‌నిపెట్ట‌డం నీ బాధ్య‌త అని వ‌సుధార‌తో చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఏంజెల్‌.

వసు-రిషి

ఏంజెల్ పంపించిన ఆ క‌ళ్ల పెయింటింగ్‌ను రిషికి పంపిస్తుంది వ‌సుధార‌. ఆ ఫొటో చూసి రిషి షాక్ అవుతాడు. ఆ పెయింటింగ్‌ను మీరు ఎప్పుడూ ఫొటో తీశారు మేడ‌మ్‌ అని ఫైర్ అవుతాడు. నేను తీయ‌లేద‌ని వ‌సుధార చెబుతున్నా కానీ  మీరు ఫొటో తీయ‌క‌పోతే మీ ఫోన్‌లోకి ఎలా వ‌చ్చింద‌ని రిషి అడిగిన ప్ర‌శ్న‌కు...ఏంజెల్ త‌న‌కు పంపించింద‌ని, ఈ క‌ళ్లు ఎవ‌రివో క‌నిపెట్ట‌మ‌ని ఆర్డ‌ర్ వేసింద‌ని చెబుతుంది. ఏంజెల్‌కు ఏం స‌మాధానం ఇవ్వాలో చెప్ప‌మ‌ని రిషిని అడుగుతుంది వ‌సుధార‌. ఫోన్‌లా కాకుండా డైరెక్ట్‌గా ఈ విష‌యం మాట్లాడుదామ‌ని వ‌సుధార‌ను ర‌మ్మంటాడు రిషి.

Also Read: హెల్ప్ అడిగిన రిషి - మాటిచ్చిన వసు, శైలేంద్ర అరాచకాన్ని సపోర్ట్ చేసిన ఫణీంద్ర!

వ‌సుధార వ‌చ్చి రాగానే ఫైర్ అవుతాడు రిషి. మీరు జాగ్ర‌త్త‌గా ఉండ‌క న‌న్ను అంటారేంటని రివర్సవుతుంది వసుధార.
వసు: మీ మ‌న‌సులో ఉన్న క‌ళ్ల‌ను మ‌న‌సులో పెట్టుకోకుండా పేప‌ర్ మీద ఎందుకు పెట్టార‌ు. మీ మ‌న‌సులో ఉన్న ఆ అమ్మాయి ఎవ‌రు 
రిషి: అంత అమాయ‌కంగా అడ‌గ‌కండి మేడ‌మ్ ఏం తెలియ‌న‌ట్లుగా...మీరు చేసేవ‌న్నీ చేస్తున్నారు. ఆ త‌ర్వాత న‌న్నే నిల‌దీస్తున్నారు. అస‌లు మిమ్మ‌ల్ని అంటూ...ఆగిపోయి.. మిమ్మ‌ల్ని అన‌డానికి నాకేం హ‌క్కు ఉంది
వసు: ఏ హ‌క్కు ఉంద‌ని న‌న్ను పిలిచారు. నాతో మాట్లాడుతున్నారు
నీతో మాట‌లు అన‌వ‌స‌రం అంటూ రిషి అక్క‌డి నుంచి వెళ్లిపోవ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు...ఆపేస్తుంది వసుధార  
వసు: మీకు తెలియాల్సిన విష‌యాలు చాలా ఉన్నాయి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వాటిని తెలుసుకోవ‌డం అవ‌స‌రం
రిషి: ఎవ‌రికి ముఖ్య‌ం
వసు: మ‌న‌కు. 
రిషి: ఇప్పుడు మీరు, నేను వేరు. నాకు తెలియాల్సిన విష‌యాలు నాకు తెలుస్తాయి. మీరు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పిఅక్క‌డి నుంచి వెళ్లిపోతాడు రిషి.
సొంత మ‌నుషులైనా శైలేంద్ర‌, దేవ‌యానికి మీకు అన్యాయం చేస్తున్నార‌ని చెబితే మీరు న‌మ్మ‌రు. ఆ నిజాన్ని మీరే తెలుసుకోవాల‌ని మౌనంగా ఉంటున్నామ‌ని, ఇంకా ఎంత కాలం ఇలా ఉండాల‌ని వ‌సుధార మ‌న‌సులోనే బాధపడుతుంది వసుధార.

ఏంజెల్ ప్రయత్నం

రిషి వేసిన పెయింటింగ్‌ క‌ళ్లు ఎవ‌రివో వ‌సుధార క‌నిపెట్టిందో లేదో అని ఏంజెల్ టెన్ష‌న్ ప‌డుతుంది. వ‌సుధార‌కు ఫోన్ చేస్తుంది. క‌ళ్లు ఎవ‌రివో క‌నిపెట్టావా అని అడుగుతుంది. రిషిని ఎంత అడిగినా చెప్ప‌డం లేద‌ని ఏంజెల్‌కు వ‌సుధార బ‌దులిస్తుంది. రిషిని పెళ్లి చేసుకోవాల‌నే విష‌యం విశ్వ‌నాథానికి చెప్పాల‌ని అనుకుంటున్నాన‌ని, కానీ రిషి మాత్రం పెళ్లి టాపిక్ ఎత్తొద్ద‌ని అంటున్నాడ‌ని బాధ‌ప‌డుతుంది ఏంజెల్‌. కానీ ఏంజెల్ మాట‌ల‌ను చాటా నుంచి విశ్వ‌నాథం వింటాడు. రిషి అనే పేరు వినలేదు కానీ వసుధారని అడిగి ఆ వ్య‌క్తి ఎవ‌రో తెలుసుకోవాల‌ని ఫిక్స్ అవుతాడు.

మ‌హేంద్ర-జగతి మరో స్టెప్

మిష‌న్ ఎడ్యుకేష‌న్ బాధ్య‌త‌ల్ని రిషి, వ‌సుధార‌ల‌కు అప్ప‌గించిన విష‌యం ఫ‌ణీంద్ర‌కు చెప్పడమే మంచిదంటాడు మ‌హేంద్ర . నిజమే అంటుంది జగతి. అదే సమయంలో శైలేంద్ర నిజం స్వ‌రూపం కూడా బ‌య‌ట‌పెట్టాల‌ని ఫిక్స్ అవుతారు. ఆ తర్వాత ఫ‌ణీంద్ర రూమ్‌లోకి మ‌హేంద్ర వెళుతుండ‌టం చూసిన దేవయాని..ఫ‌ణీంద్ర నిద్ర‌పోయాడ‌ని అబ‌ద్ధం చెప్పి మ‌హేంద్ర‌ను క‌ల‌వ‌కుండా చేస్తుంది.
ఎపిసోడ్ ముగిసింది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
Embed widget