అన్వేషించండి

Naga Panchami Serial Today March 9th: 'నాగ పంచమి' సీరియల్: మేఘనే కరాళి అని తేల్చేసిన పంచమి.. రెండు రోజుల్లో మోక్ష, మేఘనల పెళ్లి!

Naga Panchami Serial Today Episode మేఘనను కరాళి స్థావరంలో చూసిన పంచమి నిలదీయడంతో మేఘన కత్తితో తల నరుక్కుంటాను అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode  పంచమి, ఫణేంద్రలు కరాళి స్థావరం దగ్గరకు వస్తారు. ఇక మేఘన కూడా మహాంకాళి విగ్రహంతో మాట్లాడుతుంది. త్వరలోనే మోక్షని బలిస్తాను అని ఈసారి వేరే పరీక్షలు పెట్టి మోసం చేయొద్దని అంటుంది. ఒకవేళ మోసం చేస్తే కత్తితో తన తల నరుక్కుంటాను అని అంటుంది. అప్పుడే పంచమి వచ్చి మేఘనా అని గట్టిగా అరుస్తుంది. మేఘన షాక్ అవుతుంది. 

పంచమి: మేఘన నువ్విక్కడ..
మేఘన: మనసులో పంచమికి అనుమానం వస్తే మోక్షకి చెప్పకుండా ఇక్కడే పంచమిని చంపేయాలి. ఈ కత్తితోనే పంచమి తల నరికేయాలి.
ఫణేంద్ర: మనసులో.. మేఘనే కరాళి అని తెలిసిపోతుంది. ఈ విషయం నాకు ముందే తెలుసు అని తెలిస్తే పంచమి నన్ను క్షమించదు.. మేఘన నువ్విక్కడ ఎందుకు ఉన్నావు. చేతిలో కత్తి ఏంటి మళ్లీ చావబోతున్నావా. 
మేఘన: ఆ కరాళి మనసు కరుగుతుందేమో అని నేను ప్రయత్నిస్తున్నాను ఫణేంద్ర. ఎంత మొత్తుకున్నా కరాళి రావడం లేదు. చస్తాను అని బెదిరిస్తే వస్తుందేమో అని ఇలా చేస్తున్నాను.
పంచమి: ఒక పక్క పెళ్లి పెట్టుకొని ఇప్పుడు నీకు కరాళితో ఏం పని పడింది. నాకు చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలీడం లేదు. 
మేఘన:  నువ్వు ఉన్న పరిస్థితి అలాంటిది. ఎవరిమీద అయినా అనుమానాలే కలుగుతాయి పంచమి. నా తల్లిదండ్రులకు నేను ఏకైక సంతానం. నా పెళ్లిని నా తల్లిదండ్రులు కళ్లారా చూడాలి అని ఆశపడుతున్నాను.
ఫణేంద్ర: మనసులో.. ఏదో ఒకటి చెప్పి తప్పించుకో మేఘన ఈ పెళ్లి ఆగిపోతే పంచమి నాతో నాగలోకం రాదు. 
మేఘన: నా తల్లిదండ్రులను చూపించు కరాళి వాళ్లు ఎక్కడున్నారో చూపించు.. ఎంత బతిమాలుతున్నా.. కరాళి నాకు కనిపించడం లేదు. 
పంచమి: నీకు మోక్షాబాబుకి పెళ్లి జరుగుతుంది అన్న విషయం కరాళికి తెలీకూడదు అన్న విషయం నీకు బాగా తెలుసు. అయినా నువ్వు కరాళి దగ్గరకు వచ్చావు అంటే నాకు అనుమానంగా ఉంది. నిజం చెప్పు కరాళి దగ్గరకు ఎందుకు వచ్చావ్. నీకు కరాళికి మధ్య ఉన్న సంబంధం ఏంటి. నీ తల్లిదండ్రులను నిజంగా కరాళి దాచిపెట్టిందా.. అసలు నువ్వే కరాళివా.. మోక్షాబాబుని బలి ఇవ్వాలి అని కరాళి చూస్తూ ఉంది. మీ పెళ్లి జరిగితే మోక్షాబాబు కరాళికి పనికిరాడు ఈ విషయాలు అన్నీ నీకు తెలుసు. అయినా నువ్వు కరాళిని వెతుక్కుంటూ వచ్చావు అంటే నాకు నీ మీద అనుమానం కలుగుతుంది. నీ వేషాలు అన్నీ నాకు తెలుసు కరాళి. ధైర్యంగా కరాళివే అని ఒప్పుకో. నువ్వో నేనో తేల్చుకుందా..
మేఘన: మనసులో.. దీనికి నేను కరాళి అని తెలిసిపోయింది. ఇక దీన్ని ప్రాణాలతో ఉంచకూడదు. అని మేఘన కత్తి తీస్తుంది.
ఫణేంద్ర: మేఘన ఏం చేస్తున్నావ్ పంచమి అనుమానించింది అని తల నరుక్కుంటావా. 
మేఘన: నీకు అంత అనుమానం ఉంటే నీ చేతులతోనే ఆ కత్తితో నన్ను నరికేయ్ పంచమి. నా పెళ్లి విషయం కరాళికి తెలియాలి అని నేను ఇక్కడికి రాలేదు. కరాళిని ఒప్పించి నా తల్లిదండ్రులను తీసుకెళ్లాలి అని వచ్చాను. వాళ్ల చేతుల మీద నా పెళ్లి జరిపించుకోవాలి అని వచ్చాను. నాకు ఆ పెళ్లి అవసరం లేదు పంచమి. నాకు నా పెళ్లి కంటే తల్లిదండ్రులే ముఖ్యం.
ఫణేంద్ర: అలా అనకు మేఘన నీకు నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఇలా అంటే మోక్షఇక ఎప్పటికీ పెళ్లి చేసుకోడు. 
మేఘన: ఫణేంద్ర పంచమికి నా మీద ఇంకా అనుమానం పోలేదు అలాంటప్పుడు మా పెళ్లి ఎలా జరుగుతుంది. 
ఫణేంద్ర: పంచమి అసలు నీ అనుమానానికి అర్థమే లేదు. పోయిన సారి నంబూద్రీ ఆశ్రమంలో నీ కంటే ముందు నేను మేఘనని అనుమానించాను. 
మేఘన: చాలా కాలం మీతోపాటు ప్రయాణించాను. నన్ను మీ సొంత మనిషిలా ఆదరించారు. ఇక మిమల్ని ఇబ్బంది పెట్టను నా బాధలు నేను పడతాను. ఇక నేను ఎప్పటికీ మీకు నా ముఖం చూపించను. 
పంచమి: ఆగు మేఘన.. నన్ను క్షమించు మేఘన కరాళి చాలా శక్తులున్న పెద్ద మంత్రగత్తే ఏ రూపం అయినా మార్చుకుంటుంది. అందుకే అనుమానించాల్సి వచ్చింది.  మీ పెళ్లి ఆగితే కరాళి పంతం నెగ్గినట్లే మీ పెళ్లి జరగాలి.. 
ఫణేంద్ర: పంచమి ఇక్కడ ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదు కరాళికి పెళ్లి  విషయం తెలిసిపోతుంది. పదండి.. 

మరోవైపు మోక్ష సైన్‌టిస్ట్ దగ్గరకు వెళ్తాడు. పంచమి బ్లడ్ షాంపిల్స్ టెస్ట్ చేయాలి అని చెప్తారు. అన్నీ చెక్ చేసి జంతువుల మీద పని చేస్తే తర్వాత మనుషుల మీద ప్రయోగం చేస్తామని అంటారు. 

ఫణేంద్ర: అదృష్టం కొద్ది నువ్వు తప్పించుకున్నావ్.. నువ్వే కరాళి అని తెలిసిపోతే నీ కోరిక నెరవేరుండేది కాదు. మీ పెళ్లి కాకపోతే పంచమి నాతో రాదు. నా పరిస్థితి కూడా నీలా అయిపోయిండేది. 
మేఘన: ఇక అలా జరగకూడదు ఫణేంద్ర. ఇక ఎప్పటికీ పంచమికి తెలీకుండా ఉంటాను. 
ఫణేంద్ర: ఏ నిజం అయినా ఎక్కువ కాలం దాయలేం మేఘన. నువ్వే కరాళి అని నాకు ముందే తెలుసు అని పంచమికి తెలిస్తే నన్ను క్షమించదు. ఇక నా పని అయిపోయినట్లే..
మేఘన: భయపడకు ఫణేంద్ర. నీ గురించి నేను చెప్తేనే కదా.. పంచమికి తెలుస్తుంది. మోక్ష కారణంగా నా పెళ్లి ఆలస్యం అవుతుంది. మోక్ష పంచమిని వదులుకునేలా కనిపించడం లేదు. 

మేఘన వైదేహి దగ్గరకు వెళ్లి అత్తయ్య ఈ పెళ్లి ఆపేయండి అని అంటుంది. ఎందుకు ఇప్పుడు ఇలా ఏం మాట్లాడుతున్నావని వైదేహి, రఘురాం అడుగుతారు. దానికి మేఘన పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోతే తర్వాత నన్ను ఎవరూ చేసుకోరు అని మేఘన అంటుంది. పంచమి, మోక్ష కలిసే తిరుగుతున్నారు. కలిసే ఉంటున్నారు అని చివరి నిమిషంలో వాళ్ల మనసు మారితే నేనేం చేయాలి అని అంటుంది. ఇక అప్పుడే మోక్ష ఇంటికి వస్తాడు. వైదేహి మోక్షని పిలిచి రేపే నీ పెళ్లి అని చెప్తుంది. శబరి కలుగజేసుకొని అమావాస్య, శివరాత్రి పెట్టుకొని పెళ్లి ఏంటని ప్రశ్నిస్తుంది. దీంతో వైదేహి అమావాస్య తర్వాత రోజే పెళ్లి అని చెప్తుంది. నాగులావరంలో శివరాత్రి వేడుకలు చేస్తే మంచిది అని శబరి చేద్దామని అంటే వైదేహి ఓకే చెప్పి పెళ్లి కూడా అక్కడే చేద్దామని అంటుంది. 

మోక్ష: మీరు ఇంత హడావుడి చేస్తే అసలు నేను ఈ పెళ్లే చేసుకోను. 
వైదేహి: నిశ్చితార్థంతో సగం పెళ్లి అయిపోయింది. ఇక తాళి కట్టడమే ఉంది మోక్ష. మనం ఎల్లుండి ఆ గ్రామం వెళ్తున్నాం. శివరాత్రి పూజలు తర్వాత రోజు పెళ్లి చేస్తాం ఇదే చివరి మాట.
శబరి: పంచమి ఆ శివయ్య వరపుత్రిక. ఏం చేయాలో ఆ శివయ్యే చూసుకుంటారు. 

ఇక ఈ పెళ్లి జరుగుతుందా అని చిత్ర జ్వాలని అడిగుతుంది. దీంతో జ్వాల ఈ పెళ్లితో పంచమి అయినా మోక్ష అయినా ఎవరో ఒకరు చావడం ఖాయం అని అంటుంది. మరోవైపు మోక్ష డాక్టర్ మాటలు తలచుకుంటాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read:  పద్ధతిగా అందాల ఆరబోస్తున్న ‘కల్కీ’ బ్యూటీ, ఈ ఫొటోలు చూస్తే ఔరా అంటారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరెస్ట్ చేసే టైమ్‌లో కాఫీ తాగుతూ కూల్‌గా అల్లు అర్జున్అల్లు అర్జున్‌కి పదేళ్ల జైలు తప్పదా..?అల్లు అర్జున్ అరెస్ట్, FIR కాపీలో ఏముంది?అల్లు అర్జున్‌ కేసు FIRలో అసలేముంది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
CM Chandrababu: వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Miss You Movie Review - మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
One Nation One Election: జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినెట్ ఓకే.. పార్ల‌మెంటులోనే అస‌లు ఫైట్‌- ఏం జ‌రుగుతుంది?
జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినెట్ ఓకే.. పార్ల‌మెంటులోనే అస‌లు ఫైట్‌- ఏం జ‌రుగుతుంది?
Embed widget