అన్వేషించండి

Naga Panchami Serial Today June 6th: 'నాగ పంచమి' సీరియల్: వైశాలిని నాగలోకం పంపేయమన్న నాగసాధువు.. వైశాలికి సంపూర్ణ నాగ లక్షణాలు ఇస్తానన్న నాగదేవత!

Naga Panchami Serial Today Episode : వైశాలినే నాగాంశ అని తెలుసుకున్న నాగేశ్వరితో పంచమి సవాలు విసరడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode  నాగేశ్వరి నాగ వశీకరణ మంత్రం చదువుతుంది. దీంతో వైశాలి నన్ను ఎవరు పిలుస్తున్నారు అనుకుంటూ బయటకు వస్తుంది. వైశాలిని నాగేశ్వరి చూస్తుంది. పాముగా మారిన విశాలాక్షిని చూసి వైశాలి నవ్వుకుంటూ పాము దగ్గర కూర్చొని పగడను తాకుతుంది. ఇక పంచమి గదిలో వైశాలి లేకపోవడంతో ఇళ్లంతా వెతుకుతుంది. ఇక పంచమి బయటకు వచ్చే సరికి విశాలాక్షి నాగేశ్వరి పాము వెళ్లిపోతుంది. పంచమి వచ్చి వైశాలిని లోపలికి తీసుకెళ్తుంది. 

నాగేశ్వరి: విశాలాక్షి అంశ ఎవరో తెలిసిపోయింది. నా మంత్రం పని చేసింది. ఆ పాపకు నాగ లక్షణాలు మొదలయ్యాయి. ఎలా అయినా పాపను తీసుకెళ్లిపోవాలి. పంచమి రావడంతో.. నీ పిల్లల్లో నీ తల్లి ఎవరో తెలిసి పోయింది. ఆ పాపని నాతో నాగలోకం పంపేస్తే నువ్వు నాగలోకం రుణం తీర్చుకున్నదానివి అవుతాయి.
పంచమి: మాట్లాడకు నాగేశ్వరి నాలో ప్రాణం ఉన్నంత వరకు ఎవరూ నా బిడ్డల్ని తాకలేరు. నాకు నాగలోకానికి బంధం తెగిపోయింది. నా బిడ్డలు పూర్తిగా మానవ కన్యలు. వాళ్లని ఎవరూ తీసుకెళ్లలేరు.
నాగేశ్వరి: నీకు అంతా తెలుసు పంచమి. మీ అమ్మ నాగలోకానికి రాణి లేని లోటు తీర్చడానికి నీ కడుపున పుట్టింది. ఆ పాపకు నాగలక్షణాలు మొదలయ్యాయి. నా కర్తవ్యం నాకు బాగా తెలుసు. నీ విషయంలో నాగలోకం ఏం చేయలేకపోయింది అనుకుంటున్నావ్ ఏమో. కానీ నీ బిడ్డను మాత్రం తీసుకెళ్లిపోతా. నేను తిరిగి నాగలోకం వెళ్లాలి అంటే అది పాపని నాగలోకం తీసుకెళ్తేనే వెళ్తాను.
పంచమి: అది జరగదు. మన కలవడం ఇదే చివరి సారి అవ్వాలి. మరోసారి కలిస్తే మన ఇద్దరిలో ఒకరు చనిపోతారు. 

మోక్ష నాగసాధువు దగ్గరకు వెళ్తాడు. తన కష్టాల నుంచి గట్టెక్కించాలి అని అడుగుతాడు. పంచమి పుట్టుక చాలా విశేషమని అది పరమాత్మకే తెలుసని అంటాడు. మోక్ష తన ఇద్దరు పిల్లలలో ఒకరు నాగలోకం పంపాలి అంటే మేం ప్రాణాలతో వెళ్లలేమని అంటాడు. ఇక నాగసాధువు పంచమినే నాగలోకం వెళ్లాల్సింది అని కానీ నీ ప్రేమ కోసం పోరాడి వెళ్లలేదు అని నాగలోకానికి కూడా న్యాయం జరగాలి అని అందుకే మీకు కవల పిల్లలను దేవుడు ఇచ్చాడని నాగసాధువు చెప్తారు. దేవుడి ఆజ్ఞ అదే అయితే మీరు ఎదురించి పోరాడిన లాభం ఉండదని చెప్తాడు. నాగలోకానికి న్యాయం చేయాల్సిన బాధ్యత పంచమికి ఉంటుందని పంచమి వెళ్లలేకపోయింది కాబట్టి తన బిడ్డ ద్వారా నాగలోకం రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. మీ  ఇద్దరూ దాన్ని దైవ కార్యంగా భావించి అదృష్టం అనుకొని నెరవేర్చడం ధర్మం అని నాగసాధువు చెప్తాడు. మేం ఆ పని చేయలేం అని మోక్ష అంటాడు. మీరు నన్ను నిరాశ పరిచారు స్వామి అని అంటాడు. వైశాలికి నాగశక్తి రాకుండా ఆపాలి అంటే ఒక్క దైవమే దానికి సాయం చేయగలదు అని సుబ్రహ్మణ్య స్వామి వల్లే అది సాధ్యమవుతుందని చెప్తారు. పంచమి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం పంచమికి దొరుకుతుందని వెంటనే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించమని మీ బాధని చెప్పుకోమని చెప్తారు.

మరోవైపు కరాళి నంబూద్రీ ఆత్మతో మాట్లాడుతుంది. నంబూద్రీ ఇకపై ఆత్మగా కనిపించను అని కరాళితో చెప్తాడు. వేరుతో ఒక మంచి పని చేశాను అని అంటుంది. ఇక నంబూద్రీ ఇదే తన చివరి సలహా అని ఇకపై కనిపించను అని చెప్తూ ఆ వేరుతో పంచమి బిడ్డను ఆకర్షించి జ్వాల కొడుకుని ఆధీనంలోకి తీసుకోమని అంటాడు. ఆ ఇద్దరి శక్తులతో నువ్వు కోరుకున్న నాగమణి సాధించుకో అని అంటాడు. 

నాగేశ్వరి నాగదేవతను ప్రసన్నం చేసుకుంటుంది. నాగాంశతో పుట్టిన పాపని గుర్తించాను అని చెప్తుంది. ఇక పంచమి శపథం కూడా చెప్తుంది. జాగ్రత్తగా మన పని ముగించుకోవాలి అని నాగదేవత చెప్తుంది. ఇక నాగేశ్వరి నాగలక్షణాలు వెంటనే రావాలి అని అప్పుడే ఆ పాపని తీసుకురావాలి అని నాగేశ్వరి అంటుంది. పంచమికి ఏం జరగబోతుందో తెలిసేలోపే పాపని తీసుకురావాలి అని నాగదేవత అంటుంది. ఇక వైశాలికి వెంటనే సంపూర్ణ నాగ శక్తి వచ్చేలా చేస్తాను అని అప్పుడే తను మన వెంట వచ్చేస్తుందని నాగదేవత అంటుంది. మోక్ష ఇంటికి వస్తాడు. వైదేహి మోక్షని ఆపి ఏమైందని అడుగుతుంది. ఎందుకు భయపడుతున్నారని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.   

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ముకుంద తండ్రి శ్రీనివాస్‌ని నిలదీసిన కృష్ణ.. కుమిలిపోతున్న మురారి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Revanth Reddy: త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
Actor Ali: వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
Fire Accident: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India vs south Africa T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థులుగా పోటా పోటీ జట్లుRohit Sharma on Virat Kohli | T20 World Cup 2024 సెమీఫైనల్ లోనూ ఫెయిల్ అయిన కింగ్ విరాట్ కొహ్లీ |ABPAxar Patel MoM Award Ind vs Eng Semi Final | T20 World Cup 2024లో భారత్ ను ఫైనల్ కి చేర్చిన బాపు|ABPIndia vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Revanth Reddy: త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
Actor Ali: వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
Fire Accident: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
Chandrababu White Paper On Polavaram : రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
Chevella MLA: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
Harish Rao Meets Kavitha : తీహార్ జైల్లో కవితతో  హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
AP Government: ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
Embed widget