అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today June 5th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ముకుంద తండ్రి శ్రీనివాస్‌ని నిలదీసిన కృష్ణ.. కుమిలిపోతున్న మురారి!

Krishna Mukunda Murari Serial Today Episode : ముకుంద రూపం మార్చుకున్నా విషయం గురించి కృష్ణ శ్రీనివాస్‌ని నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Today Episode : మీరాని నమ్మొద్దు కృష్ణనే నమ్మాలి అని మధు అంటాడు. భవాని మీరా మీద అనుమానంతోనే తను ఉండే ఇంటికి వెళ్లాను అని భవాని అంటుంది. అక్కడ అందరూ మీరా గురించి మంచిగానే మాట్లాడుతున్నారు అని అంటుంది. ఇక ఆదర్శ్‌ వచ్చి మీరాని ప్రెగ్నెంట్‌ చేసి మురారి పారిపోయాడు అని కృష్ణ అబద్ధం చెప్పిందని ఆదర్శ్ అంటాడు. భవాని తనకు కృష్ణ మీద అనుమానం లేదు అని మీరా మీదే అనుమానం ఉండి తన కోసం ఎంక్వైరీ చేశాను అని అంటుంది. 

భవాని: ఎలాంటి పరిస్థితుల్లోనూ మురారి తప్పు చేయడు. కృష్ణ అబద్ధం చెప్పదని నాకు నమ్మకం ఉంది. మరి అలాంటప్పుడు ముకుంద తప్పు చేసిందని అనుకోవచ్చు అంటారు. కానీ ముకుంద వైపు అన్నీ నిజాలే కనిపిస్తున్నాయి. ఓవైపు నమ్మకం మరోవైపు నిజం  రెండింటి మధ్య సంఘర్షణలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాను. ఏది నిజమో ఏది అబద్ధమో తెలీదు కానీ మీరా కడుపులో పెరుగుతున్నది మాత్రం ఈ ఇంటి వారసుడు అనేది మాత్రం నిజం. అందుకే కృష్ణ చెప్పేది నిజం అని తెలిసినా ఓ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. అసలు మీరా ఏది పిలవండి.

ఆదర్శ్‌: తను ఎక్కడికో వెళ్లింది. ఇంట్లో లేదు.

కృష్ణ శ్రీనివాస్ ఇంటికి వస్తుంది. దండ వేసున్న ముకుంద ఫొటోని కింద విసిరి పగలగొడుతుంది. ఎందుకు ఇలా చేశావ్ చనిపోయినా ఇంకా నీకు నా కూతురు మీద పగ చల్లారలేదా కృష్ణ అని శ్రీనివాస్ అంటాడు. మీ కూతురు చనిపోయిందా అని కృష్ణ రెట్టించి అడుగుతుంది. శ్రీనివాస్ షాక్ అయిపోతాడు. చనిపోయిందని మీ కూతురు మీద ఒట్టు వేసి చెప్పమని అడుతుంది. 

శ్రీనివాస్: మనసులో.. తెలిసిపోయినట్లు ఉంది. అప్పటికీ ముకుందకు చెప్తూనే ఉన్నాను తెలిసిపోతే ప్రాబ్లమ్ అవుతుంది అని నా మాట వింటే కదా. 

కృష్ణ: చూస్తున్నావ్ ఏంటి బాబాయ్ ఒట్టు వేయ్. అంటే నీ కూతురు బతికే ఉంది కదా. నువ్వు నీ కూతురితో కలిసి నాటకం ఆడుతున్నావ్. నువ్వు కూడా నా జీవితంతో ఆడుకుంటున్నావ్ కదా బాబాయ్. 

శ్రీనివాస్: అలా అనకు కృష్ణ నా కూతురితో పాటే నిన్ను చూశాను.

కృష్ణ: నేను అలాగే అనుకున్నాను బాబాయ్. కన్నతండ్రి లేని నాకు నువ్వే తండ్రివి అనుకున్నా. కానీ అదంతా అబద్ధం. 

శ్రీనివాస్: పొరపాటు పడుతున్నావ్ కృష్ణ. అందుకే నా కూతురు నిన్ను జైలులో పెట్టాలి అంటే నేను మురారిని పెట్టాను. 

కృష్ణ: నా భర్త జైలుకి వెళ్తే ఏంటి నేను వెళ్తే ఏంటి. నీ కూతురు తప్పు చేస్తే దానికి బుద్ధి చెప్పాల్సింది పోయి నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు. ఎక్కడికి వెళ్లిందో తెలుసు.. ఎందుకు వెళ్లిందో తెలిసి కూడా ఆపలేదు అంటే నీకు ఇష్టమే కదా. అసలు నీ కూతురు ఎంతకి తెగించిందో తెలుసా.. నా బిడ్డని దాని కడుపులో మోస్తూ పరాయి మగాడితో బిడ్డను కన్నాను అని బరి తెగించి చెప్తే అంత దిగజారింది. నువ్వు మంచి తండ్రివి కాదు బాబాయ్. స్వార్థపరుడివి. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. 

శ్రీనివాస్: తప్పు లేదమ్మా నువ్వు తిట్టడంలో కూతురు పుట్టిందని మురిసి పోయాను. తన రూపాన్నే మార్చేసుకుంది. అలాంటప్పుడు ఎలా నా మాట వింటుందమ్మా. 

కృష్ణ: మాట వినదు అని వదిలేస్తావా బాబాయ్. ముకుంద రూపం మార్చుకొని వస్తుందని ఒక్క మాట నాతో చెప్పి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదు కదా బాబాయ్. నా బిడ్డ తనకు దక్కాలి అని లేనిపోని నిందలు వేస్తుంది. ఏసీపీ సార్ ఏమయ్యారో కూడా తెలీదు. నాతో రా బాబాయ్. నిజం చెప్పు బాబాయ్. 

శ్రీనివాస్: నేను చెప్పను అమ్మ. అసలు మురారి మీద ప్రేమ నీకు ఎక్కువ ఉందా. తనకు ఉందా. మీరు అగ్రిమెంట్ అని పెళ్లి చేసుకున్నారు. మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఇంటిళ్లపాది నిన్ను ప్రేమించినా ఇళ్లు వదిలి వెళ్లిపోయావు. నా కూతురు మాత్రం నీ కంటే ఎక్కవ మురారిని ప్రేమించింది. ఇంట్లో అందరూ చీ కొట్టినా ఇళ్లు వదిలి పోలేదు. రూపం మార్చుకుంది మురారి ద్వారా బిడ్డను కనాలి అని సరోగసీకి ఒప్పుకుంది. నేను నా కూతురు ప్రేమను కాదు అనలేను. నీకు సాయం చేయలేను. 

మరోవైపు మురారి ముకుంద మాటలు తలచుకొని బాధ పడతాడు. కృష్ణ ఇంట్లో ఎన్ని పాట్లు పడుతుందో అందరినీ ఎలా ఎదుర్కొంటుందో అని బాధ పడతాడు. ఇక ముకుంద మురారి దగ్గరకు వస్తుంది. కృష్ణని మర్చిపోమని చెప్తుంది. యాక్సిడెంట్ కంటే నువ్వే నన్ను ఎక్కువ బాధిస్తుందని అంటాడు. మురారి కృష్ణని చూపించమని అడుగుతాడు. దానికి ముకుంద ఆఖరి చూపు అని మర్చిపోతావా అని అంటుంది. ముకుంద చూపించను అంటుంది. ముకుంద అంతా పకడ్భందీగా ప్లాన్ చేశాను అని నిన్ను వదలను అని అంటుంది. మురారి మనసు మారే వరకు బెడ్ మీద ఉండాల్సిందే అని తను అలాగే ప్లాన్ చేశాను అని ముకుంద అంటుంది. ఇంట్లో అందరూ నన్ను తల్లిని చేసి ఎక్కడికో పారిపోయారు అని అనుకుంటున్నారు అని చెప్తుంది. అందర్నీ మర్చిపోవాలి అని నువ్వు నేను మన బిడ్డ ఇదే మన ప్రపంచం కావాలి అని ముకుంద అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అచ్చం ఒకేలా ఉన్న మిత్ర, జున్నుల అలవాట్లు.. అరవిందలో మొదలైన అనుమానం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?ఆదిలాబాద్‌ని గజగజ వణికిస్తున్న చలిగాలులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
Crime News:  ఇది ఓ కొడుకు తీర్పు - లవర్‌కు ఫోన్ కొనివ్వడానికి డబ్బులివ్వలేదని తల్లి హత్య !
ఇది ఓ కొడుకు తీర్పు - లవర్‌కు ఫోన్ కొనివ్వడానికి డబ్బులివ్వలేదని తల్లి హత్య !
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
Embed widget