Naga Panchami Serial Today January 13th: 'నాగ పంచమి' సీరియల్: ఫణేంద్రను హెచ్చరించిన సుబ్బు - నాగ చంద్రకాంత మొక్క తీసుకురమ్మన్న నాగసాధువు!
Naga Panchami Serial Today Episode సుబ్బు ఐదుతలల పాముగా కనిపించి ఫణేంద్రను హెచ్చరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode: పంచమి, మోక్ష ఓ చోట కూర్చొని ఉంటే అక్కడికి నాగసాధువు వస్తారు. తాను చెప్పిన విషయం గురించి ఏ నిర్ణయం తీసుకున్నారని అడుగుతారు. నాగమణి కంటే నాగ చంద్రకాంత మొక్క తీసుకురావడమే సరైన నిర్ణయమని సాధువు చెప్తారు. దీంతో మోక్ష ఏది తీసుకురావడానికి అయినా మన చేతుల్లో ఏం లేదు స్వామి అని ఆ ఫణేంద్ర నిర్ణయించాలి అని అంటాడు.
నాగసాధువు: అవును మనం ఆ ఫణేంద్రని ఒప్పించాలి. ఇంతకీ ఆయన ఎక్కడ. నాగకన్యలైన నాగరాజులైన ఇష్టరూప జాతులు పట్టుపడితే ఇక వదిలిపెట్టరు. అంతకు ముందు నాగేశ్వరి అన్న నాగకన్య నిన్ను పాముగా మార్చి తన కార్యం నెరవేర్చుకోవడానికి మీ నాన్న గారిని వేడుకుంది. పాపం సాంబయ్య గారిని ఆ నాగేశ్వరి బెదిరించి, భయపెట్టి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఏదో ఒక స్వప్రయోజనం లేకుండా మీకు సాయం చేయడానికి ఫణేంద్ర ఒప్పుకున్నాడు అంటే నాకు అంత నమ్మసక్యంగా అనిపించడం లేదు.
పంచమి: మనసులో.. శాశ్వతంగా నేను నాగలోకంలో ఉండిపోతాను అన్న షరుతు మీదే తను ఒప్పుకున్నాడు. కానీ ఆ విషయం నేను మీకు చెప్పలేను.
నాగసాధువు: ఫణేంద్ర మాటకు కట్టుబడి నాగమణి విషయంలో సాయం చేయొచ్చు. కానీ బేషరుతగా అందుకు ఒప్పుకున్నాడు అంటే సందేహించక తప్పదు.
పంచమి: నాగదేవత తనకు అప్పగించిన కార్యం నెరవేర్చడానికే స్వామి. నేను పాముగా మారి మోక్ష బాబుని కాటేస్తే అంతటితో తన బాధ్యత తీరిపోతుంది. నేను అలా చేయడానికి ఒప్పుకున్నందుకే ఫణేంద్ర మాకు ఈ సాయం చేయడానికి ముందుకు వచ్చాడు.
నాగసాధువు: ఒకరి కోసం మరొకరు మీరు పడే తాపత్రయం నాకు తెలుసు. నిజంగా ఆ ఫణేంద్ర మోసం చేయకుండా.. మనస్ఫూర్తిగా తను మీకు సాయం చేయాలి అని భావిస్తే మాత్రం నాగలోకం నుంచి నాగ చంద్రకాంత మొక్క తీసుకొచ్చి మిమల్ని కాపాడటం పెద్ద విషయమేమి కాదు. కానీ అతను మోసం చేయాలి అనుకుంటే మాత్రం మనం ఏంచేయలేము.
పంచమి: ఫణేంద్ర మోసం చేస్తాడే అనుకుందాం స్వామి అప్పుడు నేను మోక్షాబాబుని రక్షించుకోవడానికి నాకు మరోమార్గం ఏముంది స్వామి.
నాగసాధువు: ఏం చేయాలి అనేది ఆ ఫణేంద్ర వచ్చిన తర్వాత ఆలోచిద్దాం.
మరోవైపు ఫణేంద్రకు ఐదు తలల పెద్ద పాము బుసలు కొడుతూ భయపెడుతుంది. భయంతో ఫణేంద్ర దండం పెట్టగానే ఆ పాము సుబ్బుగా మారిపోతుంది. సుబ్బుకి ఫణేంద్ర దండం పెట్టి తాను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని అడుగుతాడు.
సుబ్బు: నమ్మకద్రోహం క్షమించరాని నేరం అని తెలీదా యువరాజా.. నమ్మకం ఓ వరం. నమ్మకం లేకపోతే సృష్టే లేదు. ఎంతో పవిత్రం అయిన నమ్మకాన్ని నువ్వు అపవిత్రం చేయబోతున్నావు. అది ఇష్టరూప జాతికి తగని పని. పంచమి నిన్ను పూర్తిగా నమ్మింది. తన ప్రాణమైన భర్తను వదిలి కూడా శాశ్వతంగా నాగలోకంలో ఉండిపోవడానికి సిద్ధమైంది. కానీ నువ్వు అందుకు ప్రతిఫలంగా తన భర్తను బతికిస్తాను అని మాట ఇచ్చావు. నాగమణిని తీసుకురావడానికి సాయం చేస్తానని నమ్మించావు. కానీ మనసులో మోక్ష ప్రాణాలను గాలికి వదిలేసి మోసం చేసి పంచమిని తీసుకెళ్లిపోవాలి అని నిర్ణయించుకున్నావు.
ఫణేంద్ర: అలా ఆలోచించడం తప్పే స్వామి. కానీ మరోమార్గం లేదు. ఎలా అయినా మా యువరాణిని తీసుకెళ్లకపోతే నాకు మరణ శిక్ష తప్పదు.
సుబ్బు: నువ్వు మీ యువరాణిని న్యాయబద్ధంగా నాగలోకం తీసుకెళ్లాలి అదే నీ బాధ్యత. పంచమిలా ఉన్న నా భక్తురాలిని మోసం చేయాలి అని నీవు అనుకుంటే అది నీకు శాపం అవుతుంది.
ఫణేంద్ర: క్షమించండి స్వామి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా మోసం చేయను.
మరోవైపు ఫణేంద్ర ఇంకా రాలేదు అని పంచమి వాళ్లు టెన్షన్ పడతారు. ఇక అందరికీ దూరంగా వెళ్లిపోదాం ఏం జరిగితే అది జరుగుతుంది అని మోక్ష అంటే దానికి నాగసాధువు ఒప్పుకోరు. ఇంతలో ఫణేంద్ర అక్కడికి వస్తాడు.
ఫణేంద్ర: నేను నాగదేవత ఆదేశం మేరకే ఇక్కడ ఉంటున్నాను. ఈ రాత్రిలోగా మోక్షని కాటేయించి యువరాణిని నాగలోకం తీసుకెళ్లిపోవాలి. అలా జరగలేదు అంటే నేను మోక్షని కాటేసి చంపి నాగలోకం వెళ్లిపోవాలి. కానీ ఏదో ఒకటి మాత్రం ఈ రాత్రికే జరిగిపోవాలి.
నాగసాధువు: మరి మోక్షని బతికించడానికి సాయం చేస్తాను అన్న మాట అబద్ధమా..
ఫణేంద్ర: కాదు. నేను ఆ మాట మీదే ఉన్నాను. యువరాణి మోక్షని కాటేసి నాతో వస్తే అప్పుడు అక్కడ నుంచి నాగమణిని తీసుకురావడానికి నేను సాయం చేస్తా. ఈ విషయంలో మీరు నన్ను అనుమానించాల్సిన అవసరం లేదు. నేను మాట తప్పను. మీరు నన్ను నమ్మను. అయితే అంతా ఈ రాత్రికే జరిగిపోవాలి. ఆ తర్వాత నా చేతుల్లో ఏం ఉండదు. తెల్లవారితే నేను మీ ఎవ్వరికీ కనిపించను. అలాగే మోక్ష ప్రాణాలను కూడా మీరు కాపాడుకోలేరు. ఏం నిర్ణయించుకుంటారో మీ ఇష్టం.
మరోవైపు మేఘన వాళ్ల దగ్గరకు బయల్దేరి వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసుకొని అక్కడికి వెళ్లాలి అని తన మంత్ర శక్తితో అక్కడ ఏం జరుగుతుందో చూస్తుంది.
నాగసాధువు: మీరు చెప్పింది అంతా సమ్మతంగానే ఉంది ఫణేంద్ర కానీ నన్ను ఓ అనుమానం పీడిస్తుంది. మీరు ఎంత నమ్మకంగా చెప్పినా నాగమణిని తీసుకురావడం నాకు అసాధ్యంగానే అనిపిస్తుంది. నాగచంద్రకాంత మొక్క తీసుకురావడమే శ్రేయస్కరంగా అనిపిస్తోంది.
ఫణేంద్ర: నాగచంద్రకాంత మొక్క తీసుకురావడానికి నాకు ఏం అభ్యంతరం లేదు. నేను యువరాణి వెళ్లి ఆ మొక్క తీసుకురానవసరం లేదు.
పంచమి: ఆ మొక్క కోసం అయితే నేను రానవసరం లేదు కదా.
ఫణేంద్ర: అంటే మీరు నన్ను ఇంకా అనుమానిస్తున్నారా.. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.