Trinayani Serial Today January 13th: నాగులాపురం నుంచి వచ్చిన మరో కొరియర్.. అక్కలు ప్రెగ్నెంట్స్ కాదని సుమన ఫుల్ ఖుషీ!
Trinayani Serial Today Episode నాగులాపురం నుంచి విశాల్‌కు కొరియర్‌లో మరో క్యాసెట్ రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode: నయని, హాసినిలు ప్రెగ్నెంట్స్ అని నిర్థారించిన డాక్టర్ నెల క్రితమే అమెరికా వెళ్లిపోయింది అని అలాంటప్పుడు వీళ్లు చెప్పింది అబద్ధం కాదా అని వల్లభ నిలదీస్తాడు. దీంతో ఇంట్లో వాళ్లు అందరూ షాక్ అవుతారు. ఇక సుమన అయితే ఏంటి అక్కలు మీ కడుపులో పిల్లకాయలు ఉన్నారు అనుకుంటే పల్లికాయలు కూడా లేవా అని వెటకారంగా నవ్వుతుంది. ఇక నయని అంత ఆనందంగా ఉందా చెల్లి అని అడుగుతుంది.
సుమన: ఎందుకు ఉండదు అక్క ఏప్రిల్ 1న ఫూల్ చేస్తారు అంటే మీరు నాలుగు నెలల ముందే ఫూల్ చేసి నవ్విస్తే ఎవరూ నవ్వరా..
హాసిని: వీళ్ల మాటలు నమ్మితే అంతే సంగతులు..
విశాల్: వదిన ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధాలను నిజం చేయాలి అని చూస్తున్నారో తెలీయడం లేదు. పిల్లల విషయంలో నవ్వుల పాలు కాకూడదు.
విక్రాంత్: డాక్టర్ చెప్పకపోతే ఏంటి శివభక్తురాలు డమ్మక్క చెప్పింది కదా..
తిలోత్తమ: ఈ నాటకానికి మూల సూత్రధారే డమ్మక్క రా. డమ్మూ ఇలా ముందుకు రామ్మా.. ఎలా వచ్చిందే నీకు ఇంత గొప్ప ఆలోచన.
నయని: అత్తయ్య పాపం తనని ఎందుకు ఇబ్బంది పెడతారు.
ధురందర: అంటే కాళీ కడుపేనా నయని.
విశాల్: డమ్మక్క ఎందుకు అసలు ఇలా నాటకం ఆడాల్సి ఉండాల్సి వచ్చింది.
హాసిని: ఇది నాటకం కాదు అబద్ధం కాదు అందర్ని ఇలా ఇబ్బంది పెట్టకండి.
తిలోత్తమ: ఏయ్ నువ్వు ఇంకా బుకాయించకు. డమ్మక్క నోరు విప్పే ముందు అప్పుడప్పుడు వచ్చిపోయే మీ అమ్మ అదే విశాలాక్షి మీద ఒట్టేసి చెప్పు నా కోడళ్లు నిజంగా గర్భవతులా కాదా..
డమ్మక్క: నాటకం ఆడమని నేనే చెప్పాను.
విశాల్: అయినా నాటకం ఆడాల్సిన అవసరం ఏం వచ్చింది.
డమ్మక్క: నా నోరు లేచినట్లే అందరికి అనుమానం రేకెత్తే అవకాశం ఉంది.
నయని: అదెలా అయినా వాళ్లు అడగకుండానే నువ్వేందుకు నాటకం ఆడించావో చెప్పు డమ్మక్క.
డమ్మక్క: నూతన సంవత్సరానికి స్వాగతం పలికేటప్పుడు నయని తప్ప అందరూ సురాపానం తీసుకున్నారు. మరి మద్యం తాగిన వారికి రాని కడుపు నొప్పి నయని, హాసినిలకు మాత్రమే ఎందుకు వచ్చింది అంట.
విశాల్: అవును అప్పుడు అదే డౌట్ వచ్చింది కానీ వీళ్లు ప్రెగ్నెంట్స్ అని నువ్వు చెప్పగానే కన్విన్స్ అయ్యాం.
డమ్మక్క: నాటకమే అయితే కడుపులు పట్టుకొని ఎందుకు విలవిల్లాడుతారు విశాల్ బాబు.
విక్రాంత్: అంటే ఆ జ్యూస్‌లోనే ప్రాబ్లమ్ ఉండొచ్చు.
హాసిని: సీసీ టీపీ ఫుటేజ్ తీస్తే తప్ప ఏం జరిగిందో తెలీదు.
తిలోత్తమ: కంగారుగా.. చిన్న దానికి అంతలా ఆలోచించాలా.. కడుపు నొప్పి పోయింది.. గాయత్రీ అక్కయ్యని మళ్లీ కనబోయినట్లు ఏదో నాటకం ఆడబోయారు అని కూడా తెలిసింది. అక్కయ్య ఎక్కడో బతుకుతున్నారు అని మేం కూడా నమ్ముతున్నప్పుడు ఏదేదో మాట్లాడి అందర్ని అయోమయంలోకి నెట్టకండి. రేయ్ పదరా..
విశాల్: నయని ఎవరైనా నీకు ప్రాణ హాని తలపెట్టాలి అని చూశారు.
నయని: ఎవరై ఉంటారు అనుకుంటున్నారు.
విశాల్: తిలోత్తమ అమ్మనా అని అడిగితే లేని పోని సమస్యలు లేవనెత్తినట్లు అవుతుంది నయని ఆవేశాన్ని కూడా అర్థం చేసుకోవాలి.
నయని: మిమల్ని పెంచిన తల్లి ఆయుష్షును మీ మౌనమే పెంచుతుంది బాబుగారు. ఆలోచిస్తున్నారా బాబుగారు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకు అలా నాటకం ఆడావని నిలదీస్తారు అనుకున్నా.
విశాల్: అడగను నయని ఎందుకంటే నువ్వు ఏం చేసినా దానికి ఓ అర్థం ఉంటుంది. ప్రాణం నిలబెట్టేదే అయితే నువ్వు అబద్ధం ఆడినా గౌరవించాలి.
నయని: నేను క్షేమంగా ఉండాలి అని మీరు కోరినట్లే నేను కన్న గాయత్రీ అమ్మగారు కూడా క్షేమంగా ఉండాలి అని నేను అలా డమ్మక్క చెప్పినట్లు నాటకం ఆడాల్సి వచ్చింది బాబుగారు.
సుమన పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటుంది అప్పుడు విక్రాంత్ వచ్చి ఫోన్లో పాటలు ఆపేస్తాడు. దీంతో సుమన మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు ఇలా పాటలు వినడం నాకు అలవాటు అంటుంది. దాంతో విక్రాంత్ సుమనకు చీవాట్లు పెడతాడు.
సుమన: మా అక్క ఇంకా గాయత్రీ అక్కయ్య రాకకోసం ఎదురు చూడటంలో అర్థం లేదు. తనే ఉండుంటే మొదటి పుట్టిన రోజుకైనా వచ్చుండేసుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే.. దత్తత తీసుకున్న గాయత్రీ పాప పేరిట పాతిక కోట్ల ఆస్తి రాశారు కదా అందులో సగం ఉలూచి పేరు మీద రాస్తే మన దగ్గర కూడా ఆస్తి, నగలు ఉన్నట్లే. అనవసరంగా శాస్త్రిగారి మనవరాలిని కోటీశ్వరురాల్ని చేయడం ఎందుకు. ఇన్నాళ్లు మీరు మా అక్క, బావగారికి ఊడిగం చేసినందుకు ఆ మాత్రం ప్రతిఫలం కోరుకోవాలి కదా.. చెల్లెలి బిడ్డకి ఇవ్వడానికి ఆలోచించకు అని మా అక్కని బతిమాలుతాను.
విక్రాంత్: అర్జెంటుగా నేను ఇన్సూరెన్స్ ఆఫీస్‌కు వెళ్లాలి. ఇన్సూరెన్స్ ఆఫీస్‌కు వెళ్లి నీ పేరు మీద లక్ష, రెండు లక్షలు ఎంత వీలైతే అంత కట్టేస్తాను. నువ్వు చావగానే కనీసం కోటి రూపాయలు అయినా వస్తాయి కదా.. ఆ డబ్బులు నాకు వద్దు ఉలూచికే ఇచ్చేస్తాను నీ మీద ఒట్టు.
సుమన: నన్ను చంపి ఉలూచిని కోటీశ్వరురాల్ని చేస్తారా..
తిలోత్తమ: రేయ్ వల్లభ నయని కడుపు కాళీగా ఉంది అంటే పునర్జన్మ ఎత్తిన గాయత్రీ అక్కయ్య ఎక్కడో క్షేమంగా ఉందనే కదా అర్థం. గాయత్రీ అక్కయ్య వాయిస్ ఉన్న ఆ క్యాసిట్లో నేను పాల్పడిన అవకతవకలు అన్నీ ఉన్నాయి అనిపిస్తోందిరా. గాయత్రీ అక్కయ్యకు అప్పట్లోనే నా మీద అనుమానం వచ్చి క్యాసెట్ రికాడ్డ్ చేసి పెట్టింది. ఇప్పుడు మనం ఆవిడ స్వరాన్ని అనుసరించి మిమిక్రీ ఆర్టిస్ట్‌ని కలిసి నేను గాయత్రీ అక్కయ్య సెక్రటరీగా ఉంటడం వల్ల చాలా మంచే జరిగింది అని ఆవిడ పొగిడినట్లు రికార్డ్ చేయిద్దాం.
వల్లభ: అర్థమైంది అమ్మ ఆ క్యాసెట్‌ని ఎవరో పంపినట్టు మన ఇంటికి పోస్ట్ చేద్దాం అంతే కదా మమ్మీ.
ఇక అందరూ హాల్‌లో ఉండగా నాగులావరం నుంచి విశాల్‌కు మరో కొరియర్ వస్తుంది. నాగులావరం నుంచి వచ్చింది అంటే అది ముఖ్యమైనదే అయింటుంది అని నయని అంటుంది. విశాల్ ఓపెన్ చేసి చూస్తే అందులో మరో క్యాసెట్ ఉంటుంది. ఇక అందులో ఏముందో విందామని నయని వాక్ మేట్ తీసుకురావడానికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.