Naga Panchami Serial Today February 3rd: కరాళి తనని కిడ్నాప్ చేసిందన్న మేఘన.. పంచమి, ఫణేంద్ర నమ్మేస్తారా!
Naga Panchami Serial Today Episode: మోక్ష, మేఘనల పెళ్లిని దగ్గరుండి చేస్తా అని జ్వాలలో నంబూద్రీ ఆత్మ దూరి అందరికీ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode భార్గవ్, వరుణ్‌లో మోక్షని పెళ్లి చేసుకోవద్దు అని.. పెళ్లి జరగడానికి మేం ఒప్పుకోం అని చెప్తారు. ఇక జ్వాలలోకి కరాళి అన్న నంబూద్రీ ఆత్మ ప్రవేశించి మేఘనకు సపోర్ట్ చేస్తుంది. అందరూ షాక్ అవుతారు.
జ్వాల: నన్ను మీ అక్కని అనుకోమా.. నేను దగ్గరుండి నీ పెళ్లికి పెట్టిపోతలన్నీ జరిపిస్తాను. నీకు ఏ లోటు రానివ్వను.
చిత్ర: ఏంటిది..
జ్వాల: నీకు అండగా ఈ అక్క ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటి రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. మీకు ఒక చెల్లి ఉండి పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఎవరైనా పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తే ఏం చేసుంటావ్.. ముఖం పచ్చడి చేస్తా జాగ్రత్త. అత్తయ్య మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. మేఘనను నేను రోజూ చూస్తున్నాను కదా చాలా మంచి అమ్మాయి. మోక్ష నిజంగా అదృష్టవంతుడు.
చిత్ర: అయ్యో ఏం మాట్లాడుతుంది.
వైదేహి: పోనీలే జ్వాల ఇనాళ్లకు అయినా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావ్..
జ్వాల: అత్తయ్య ఈ పెళ్లి విషయంలో మీ ధైర్యం నాకు బాగా నచ్చింది. మేఘనకు ఎవరూ లేరు అనుకోవద్దు. నేను తనకి అక్కలా ఉండి అన్ని జరిపిస్తాను.
చిత్ర: ఏయ్..
జ్వాల: ఏంటి మోక్ష జ్వాల ఇలా మాట్లాడటం ఏంటి అని చూస్తున్నావా.. మంచి పనికి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. నీది వెరీ గుడ్ సెలక్షన్.. మీ జంట సూపర్‌గా ఉంటుంది.
శబరి: ఛీ..ఛీ.. ఇళ్లు మొత్తం సర్కస్ కొంపలా తయారైంది. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు నడుచుకుంటున్నారు. దరిద్రం.. దరిద్రం..
మేఘన: అంటీ కొంచెం గుడికి వెళ్లి వస్తాను.. నాకు ఆ దేవుడు తప్ప ఎవరూ లేరు కదా.. నా కష్టం సుఖం చెప్పుకొని వస్తాను.
జ్వాల: ఈరోజు నుంచి నీకు అండగా నేను ఉంటాను మేఘన. చెవి దగ్గరకు వెళ్లిన నంబూద్రీ..త్వరగా వెళ్లు కరాళి..
చిత్ర: అక్కా నీకు ఏదో అయింది అక్క. నీకు దండం పెడతా నన్ను మాత్రం ఏం చేయకు అక్క..
మరోవైపు భార్గవ్, వరుణ్, చిత్రలు జ్వాల బిహేవియర్ గురించి మాట్లాడుకుంటారు. అక్కకి ఏదో పిశాచి పట్టిందని చిత్ర అంటుంది. వరుణ్, భార్గవ్‌లు జ్వాల దగ్గరకు వస్తారు. చేయి పట్టుకొని ఏమైందని అడుగుతారు. జ్వాల ఇద్దరినీ చేయి వదలండిరా అని సీరియస్ అవుతుంది. ఇక వరుణ్ కొడదామని చేయి ఎత్తితే చేయి పట్టి తిప్పేస్తుంది. వరుణ్ నొప్పితో విలవిల్లాడిపోతాడు. ఇక మోక్ష, మేఘన పెళ్లి జరిగేలా చేయాలి అని పెళ్లి పనులు అన్నీ మేమే దగ్గరుండి చేస్తామని వైదేహితో చెప్పమని వరుణ్, భార్గవ్, చిత్రలను బెదిరిస్తుంది. వాళ్లు సరే అని వెళ్లగానే నంబూద్రీ జ్వాల ఆత్మని వదిలి వెళ్లిపోతుంది. తర్వాత చిత్ర వాళ్లు గదికి వచ్చి చూసేసరికి జ్వాల కింద పడుకొని ఉంటుంది. అప్పుటి వరకు జరిగింది అంతా వరుణ్ వాళ్లు చెప్తే నేను అలా చేయను అని జ్వాల అంటుంది. మరోవైపు పంచమి, ఫణేంద్రలు కరాళి ఆశ్రమానికి వస్తారు.
పంచమి: కరాళి అచూకి తెలుసుకోవాలి అంటే మేఘన ద్వారే సాధ్యమవుతుంది ఫణేంద్ర. తనని అనుసరిస్తూ కనిపెట్టాలి. మనమీద మేఘనకు అనుమానం వచ్చిన వెంటనే ఆ విషయం కరాళికి తెలిసిపోతుంది.
ఫణేంద్ర: నువ్వు ఇక్కడే ఉండు పంచమి.. నేను వెళ్లి ఆ మేఘన నీడలా ఉండి అన్ని విషయాలు రాబడతాను. ఇంతలో మేఘన ఏడుస్తూ ఉరి వేసుకుంటున్నట్లు నటిస్తుంది.
మేఘన: వదలండి నేను చచ్చిపోవాలి.. నన్ను వదలండి.. మేఘనను పంచమి ఒకటి కొడుతుంది. మేఘన గట్టిగా ఏడుస్తూ బయటకు పారిపోతుంది.
పంచమి: మేఘన ఏమైంది నీకు.
మేఘన: నన్ను ఏమడగొద్దు.. ఆ కరాళి నన్ను బతకనివ్వదు. మా అమ్మానాన్నలని కూడా చంపేస్తుంది. వాళ్లు లేకుండా నేను బతకలేను.
పంచమి: మేఘన నువ్వు నాగకన్యవి కాదా..
మేఘన: కాదు..
ఫణేంద్ర: నిజం చెప్పు మేఘన నీ మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. మా గురించి అన్ని తెలిసినట్లుగా మాతో కలిసి తిరిగి ఇప్పుడు ఉన్నట్టుండి నాగకన్య కాదు అంటే మేం నమ్మలేకపోతున్నాం.
మేఘన: మీరు నమ్మాల్సిన పని లేదు. నన్ను చనిపోనిస్తే చాలు. ఆ కరాళి చేతిలో మా అమ్మనాన్న చనిపోవడం నేను చూడలేను. నా కళ్ల ముందే వాళ్లని చంపేస్తాను అని బెదిరిస్తుంది.
పంచమి: ఇప్పుడు కరాళి ఎక్కడ ఉంది.
మేఘన: తనకు చాలా మాయలు మంత్రాలు తెలుసు. ఉన్నట్టుండి నా పక్కనే కనిపించి అలానే మాయమైపోతుంది. మనసులో.. సగం నమ్మేశారు ఏదో ఒకటి చెప్పి పూర్తిగా నమ్మించాలి.
పంచమి: అసలు ఏం జరిగిందో చెప్పు మేఘన. కరాళికి నువ్వు ఎలా కనిపించావు.
మేఘన: నాకు చిన్నప్పటి నుంచి మాయలు మంత్రాలు అంటే చాలా ఇష్టం. అందుకే నేను వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నించాను. ఒకరోజు నేను ఒకదగ్గర మంత్ర శక్తులు ప్రాక్టీస్ చేస్తుంటే ఈ కరాళి వచ్చి నన్ను పరిచయం చేసుకొని నాకు చాలా మంత్రాలు మాయలు వచ్చు అని నీకు కూడా నేర్పిస్తాను అని ఇక్కడ ఆశ్రమానికి తీసుకొని వచ్చింది. తర్వాత తెలిసింది తను నన్ను కిడ్నాప్ చేసింది అని. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: లీడర్ 2: దాదాపు 15 ఏళ్ల తర్వాత రానా 'లీడర్ 2'? - పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న సీక్వెల్!