అన్వేషించండి

Leader 2: దాదాపు 15 ఏళ్ల తర్వాత రానా 'లీడర్‌ 2'? - పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న సీక్వెల్‌!

Leader 2: దగ్గుబాటి వారసుడు రానా హీరోగా పరిచయమైన మూవీ 'లీడర్‌'. 15 ఏళ్ల క్రితం డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  ఘన విజయం సాధించింది.

Shekar Kammula-Rana Leader 2: దగ్గుబాటి వారసుడు రానా హీరోగా పరిచయమైన మూవీ 'లీడర్‌'. 15 ఏళ్ల క్రితం డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  ఘన విజయం సాధించింది. ఫస్ట్‌ మూవీతోనే రానాకు పర్పామెన్స్‌ పరంగా వందకు వంద మార్కులు పడ్డాయి. స్టార్ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇస్తున్న రానా ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకుని సాహసం చేశాడనే చెప్పాలి. చాక్లెట్‌ బాయ్‌ లుక్‌ ఉన్న రానా పొలిటికల్‌ డ్రామా చేయడమేంటని మూవీ రిలీజ్‌కు ముందు అంతా సందేహించారు. కానీ రిలీజ్‌ అనంతరం తన యాక్టింగ్‌తో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు రానా. తొలి సినిమాతోనే స్టార్‌ హీరో జాబితాలో చేరిపోయాడు.

అంతగా రానాకు గుర్తింపు తెచ్చిన ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో సీక్వెల్‌ ట్రెండ్‌ అంతగా లేకపోవడం ఈ ప్రాజెక్ట్‌పై పెద్దగా ఫోకస్‌ పెట్టలేదు మేకర్స్. కానీ సినీ ప్రియులు మాత్రం ఇప్పటికీ లీడర్‌ పార్ట్ 2 కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. పొలిటికల్‌ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో అప్పటి సమకాలీన రాజకీయ వ్యవస్థలను చూపించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అందులో యంగ్‌ సీఎంగా రానా లుక్‌, పర్ఫామెన్స్‌ తెలుగు ప్రజలను, యూత్‌ను బాగా ఆకట్టుకుంది. దాంతో దీనికి పార్ట్‌ 2 కూడా వస్తే బాగుండని దగ్గుబాటి ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ ఆశపడ్డారు. ఈ నేపథ్యంలో దగ్గుబాటి ఫ్యాన్స్‌ను ఖుషి చేసే ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కుర్లు కొడుతుంది. లీడర్‌ 2 త్వరలోనే రాబోతుందంటున్నారు.

Also Read: బాలీవుడ్ సీనియర్ హీరోను లైన్‌లో పెట్టిన సందీప్ - డార్క్ యాక్షన్ క్రైమ్ థిల్లర్ కథతో సినిమా

ఈ తాజా బజ్‌ ప్రకారం లీడర్‌ సీక్వెల్‌పై మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారట. ఎందుకంటే రీసెంట్‌గా శేఖర్‌ కమ్ముల ఎషియన్‌ మూవీస్‌లో మరో సినిమా ప్రకటించారు. కానీ హీరో, జానర్‌, కాస్ట్‌ ఎవరన్నది క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఇది 'లీడర్‌ 2' అయ్యింటుందనే గుసగుసలు మొదలయ్యాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత లీడర్‌ 2పై చర్చలు జరుగుతున్నాయని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌ నడుస్తుంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ ప్రాజెక్ట్‌ ఉండనుందట. ఆంధ్రప్రదేశ్‌ విభజన, ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్ట్‌ 2ను ప్లాన్‌ చేస్తున్నారని వినికిడి. కాగా ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల తమిళ స్టార్‌ ధనుష్‌ మూవీతో బిజీగా ఉన్నాడు. ధనుష్‌-నాగార్జునతో మల్టీస్టారర్‌ తీస్తున్నాడు శేఖర్‌ కమ్ముల.

దీని తర్వాత లీడర్‌ 2పై ఫోకస్ పెట్టే అవకాశం ఉందట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి, నేటి రాజకీయల నేపథ్యంలో మంచి స్క్రిప్ట్‌ రెడీ చేయమని మేకర్స్‌ శేఖర్‌ కమ్ములతో చెప్పినట్టు తెలుస్తోంది. ధనుష్‌-నాగార్జున మూవీ తర్వాత 'లీడర్‌2' స్క్రిప్ట్‌పై ఈ క్లాసిక్‌ డైరెక్టర్‌ పని చేయనున్నాడట. అయితే ఈసినిమా రానాతో పాటు మరో ఇద్దరు స్టార్‌ హీరోలను కూడా పరిశీలిస్తున్నారట శేఖర్‌ కమ్ముల. వారు గెస్ట్‌ రోల్లో కనిపించనున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న లీడర్‌ 2పై త్వరలోనే ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చే అవకాశం ఉందంటున్నారు సనీ వర్గాలు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mouni Roy Divorce: డబ్బు వాడుకున్నాడు... మోసం చేశాడు... మౌనీ రాయ్ విడాకుల వెనుక కారణాలు అవేనా?
డబ్బు వాడుకున్నాడు... మోసం చేశాడు... మౌనీ రాయ్ విడాకుల వెనుక కారణాలు అవేనా?
Actor Ali: అలీ విశ్వరూపం... చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో కొత్త మూవీ షురూ
అలీ విశ్వరూపం... చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో కొత్త మూవీ షురూ
Nani Paradise: పుకార్లకు చెక్ పెట్టిన ప్యారడైజ్ టీమ్... గట్టిగా ఇచ్చిపడేసిన నాని & కో
పుకార్లకు చెక్ పెట్టిన ప్యారడైజ్ టీమ్... గట్టిగా ఇచ్చిపడేసిన నాని & కో
Sandigdham Movie: 'సందిగ్ధం'లో ఎంత మంది ఆర్టిస్టులున్నారో చూశారా? జబర్దస్త్ నుంచి ఎవరెవరున్నారంటే?
'సందిగ్ధం'లో ఎంత మంది ఆర్టిస్టులున్నారో చూశారా? జబర్దస్త్ నుంచి ఎవరెవరున్నారంటే?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget