అన్వేషించండి

Naga Panchami December 2nd Episode నాగమణిని తీసుకొస్తే మోక్షని కాపాడుతా.. పంచమితో కరాళి!

Naga Panchami Today Episode మోక్షని తాను కాపాడుతానని.. నాగలోకం నుంచి నాగమణి తీసుకురమ్మని కరాళి పంచమికి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది

Naga Panchami serial Today Episode

కరాళి మోక్షను తన వశం చేసుకోవడంలో భాగంగా ఆయనకు ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే అక్కడికి పంచమి వచ్చి మోక్షను పిలిచినా తాను చూడడు. మోక్షను ముట్టుకోవాలని పంచమి ప్రయత్నిస్తే షాక్ కొట్టి ముట్టుకోలేకపోతుంది. ఇంతలో సుబ్బు మోక్షను కరాళి మాయ నుంచి విడిపిస్తాడు. ఇక కరాళి కూడా ముందుకు అడుగు వేయకుండా చేస్తాడు. 

మోక్ష: పంచమి అంత కోపంగా ఉన్నావేంటి
పంచమి: అందరూ ఒకేలా ఉండరు మోక్షబాబు మీరు మంచోళ్లు అని అందరూ అలాగే ఉండరు
మోక్ష: మోహిని గురించి చెప్తున్నావా.. తనతో నీకు ఏం పరిచయం ఉంది చెడ్డదానిలా ఊహించుకుంటున్నావ్ 
పంచమి: మనసులో.. తనో పెద్ద మహా మంత్రగత్తి మోక్షాబాబు ఒకప్పుడు మిమల్ని ముప్పుతిప్పలు పెట్టింది
మోక్ష: చెప్పు పంచమి నాకు అయితే తనలో ఎలాంటి చెడు కనిపించలేదు. చాలా తెలివైనది. పైగా తనకి మన విషయం చెప్పాను. ఇష్టజాతి నాగుల విషానికి తను ఆకుపసరులతో విరుగుడు కనిపెట్టగలదట. నాకు అయితే మోహిని మీద చాలా నమ్మకం ఉంది పంచమి. 
పంచమి: నాకు లేదు మోక్షాబాబు.. నాకు లేదు.. తను ఎవరో తెలీక అలా మాట్లాడుతున్నారు. తన నిజస్వరూపం తెలిస్తే ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉంచరు. దయచేసి తనకి దూరంగా ఉండండి మోక్షాబాబు. తన నిజస్వరూపం మంచిది కాదు. ఏదో కీడు తలపెట్టే తను ఈ ఇంటికి వచ్చింది. తన గురించి నాకు బాగా తెలుసు మోక్షాబాబు.
మోక్ష: అంత బాగా తెలిస్తే తను ఇంట్లో అడుగు పెట్టినప్పుడే చెప్పాలి కదా పంచమి. అప్పుడు ఎందుకు చెప్పలేదో నాకు బాగా తెలుసు పంచమి. మీ ఇద్దరి మధ్య ఏదో వ్యక్తిగత గొడవలు ఉన్నాయి. అదేంటో చెప్పు మోహిని మంచిదో కాదో నేను చెప్తా
పంచమి: నాకు ఈ ప్రపంచంలో ఎవరితో శత్రుత్వం లేదు మోక్షాబాబు.. మీ ప్రాణాలు కాపాడుకోవడం తప్పు నాకు వేరే ధ్యాస ఉండదు. 
మోక్ష: ఆ విషయం నాకు తెలుసు పంచమి. కానీ మోహిని గురించి నీకు ఏం తెలుసో అది చెప్పు
పంచమి: తను నంబూద్రీ చెల్లెలు. తనకి చాలా మంత్ర తంత్ర విద్యలు తెలుసు
మోక్ష: మంచి విషయం చెప్పావు పంచమి. తనకి ఎన్ని విద్యలు తెలిస్తే మనకు అంత మంచిది. మనకు ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు నాకు నంబూద్రీ గారి మీద చాలా కోపం ఉండేది. అతని పూజలు మంత్రాలు అంతా ఒట్టి మూర్ఖత్వం అనుకునే వాడిని. నువ్వు పాము అని తెలిసాక ప్రతీ ఒక్కర్ని ప్రతీ ఒక్క విషయాన్ని నమ్మి తీరాలి అనిపించింది. నిజానికి చెప్పాలి అంటే నంబూద్రీ గారు ఒక పౌర్ణమికి నీ నుంచి నన్ను కాపాడారు. అటువంటి నంబూద్రీ గారి చెల్లెలు అంటే కచ్చితంగా మోహిని దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి. దెయ్యాలు భూతాలు, మాయలు మంత్రాలు అంటే అస్సలు నమ్మేవాడిని కాదు. కానీ ఇప్పుడు నమ్ముతున్నాను పంచమి. మోహిని కచ్చితంగా మన విషయంలో బాగా ఉపయోగపడుతుంది.
పంచమి: మనసులో.. తను ఏదో మంత్ర ప్రయోగం చేసింది లేదంటే మోక్ష బాబు ఇలా మాట్లాడరు. ఇప్పుడు నేను తన గురించి ఏం చెప్పినా నన్ను అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది.
మోక్ష: ఏంటి పంచమి ఏం మాట్లాడవు.. మా అమ్మ మోహినిని తన ఫ్రెండ్ కూతురు అని పరిచయం చేసింది అంటే ఏందో ఉంటుంది. బహుశా నేను ఇంకా నంబూద్రీ గారిని ద్వేషిస్తున్నా అని మా మమ్మీ అనుకొనవచ్చు.
పంచమి: మనసులో.. ఎవరైనా తన మాయలో పడాల్సిందే మోక్షాబాబు
మోక్ష: ఇంకేం ఆలోచించకు పంచమి. ఇంతకు మించి మోహిని గురించి ఇంకా ఏమైనా తెలిస్తే చెప్పు
పంచమి: నేను మీకు చెప్పేది ఒకటే మోక్షాబాబు. నేను మిమ్మల్ని కాపాడుకుంటాను
మోక్ష: కాపాడుకోలేవు పంచమి.. నీకు చెప్తే అర్థం కావడం లేదు. నాకు అంత టైం కూడా లేదు. ఇక నీతో పంచాయితీ అవసరం లేదు. దీనికి మనం కలవడం ఒక్కటే పరిష్కారం. అప్పుడు కనీసం నువ్వు అయినా ఇక్కడ ఉంటావ్. ఇక నువ్వు నాకు ఏం చెప్పకు. నేను ఎవరి మాటా వినను పంచమి. నేను ఉండే అవకాశం లేనప్పుడు నువ్వు అయినా ఉండాలి.. అని మోక్ష పంచమి దగ్గరకు వెళ్తే పంచమి దూరంగా నెట్టేస్తుంది. ఇంతలో పంచమి తల్లి  నుంచి మోక్షకు ఫోన్ రావడంతో మోక్ష పంచమిని వదిలేస్తాడు.    
పంచమితల్లి: నేను క్షేమంగానే చేరాను అమ్మ నాకు ఏం పర్లేదు. నేను ఒక నాగ సాధువును కలిశాను. మహా మృత్యుంజయ యాగం చేస్తే ఈ గండం నుంచి గట్టెక్కొచ్చని చెప్పారు. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చేయండి 
పంచమి: ఎంత మంచి వార్త చెప్పావు అమ్మా.. ఇంట్లో అందర్ని ఒప్పించి అక్కడికి వస్తాను అమ్మా. 
పంచమితల్లి: అలాగే పంచమి యాగం కచ్చితంగా చేసేలా చూడమ్మా ఉంటాను
పంచమి: చెప్పాను కదా మోక్షా బాబు నేను మిమల్ని ఎలా అయినా కాపాడుకుంటానని.. మహా మృత్యుంజయ యాగం చేస్తే మీరు ఈ పౌర్ణమికి గండం నుంచి బయటపడతారు. 
మోక్ష: తర్వాత అయినా ఆ గండం నన్ను వెంటాడుతుంది కదా పంచమి
పంచమి: ప్రస్తుతం దొరికిన ఈ అవకాశాన్ని ఎందుకు వదులు కోవాలి. ఇది మనకు ఆ దేవుడు ప్రసాదించిన వరం అనుకుందాం. మీరు ఇంకేం ఆలోచించకండి. దయచేసి మీ ఇంట్లో వాళ్లని ఒప్పించండి. నాగసాధువులు చెప్పారంటే అందులో అబద్ధం ఉండదు. ఎలా అయినా మహామృత్యుంజయ యాగం జరిపించేలా చేయండి. 
మోక్ష: సరే పంచమి నీ నమ్మకమే నా నమ్మకం. 

మరోవైపు ఈ సంభాషణను అంత ఫణేంద్ర పాము చూస్తూ ఉంటుంది. ఇక కరాళి ఏవో క్షుద్ర పూజలు జరిపి మహాంకాళిని దర్శనం చేస్తుంది. 

కరాళి: అమ్మా మహాంకాళి మీరు చెప్పినట్లు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాను తల్లీ. మోక్షను చాలా సులభంగా నేను నా వశం చేసుకోగలను తల్లీ కానీ ఆ బాలుడి రూపంలో నన్ను ఏదో శక్తి అడ్డుకుంటుంది. ఆ బాలుడి అడ్డు నాకు లేకుండా నువ్వే రక్షణ కల్పించాలి తల్లీ. 
మహాంకాళి: కరాళి ఎక్కడో నీకు అదృష్టం ఉంది. అందుకే ఆ బాలుడ్ని నువ్వు చూడగలిగావు కరాళి. ఆ బాలుడు శక్తి కాదు మహోన్నత స్వరూపం. దగ్గరకు వెళ్తే కాలి మసైపోతావు కరాళి.. ఆ బాలుడి కంట పడకుండా నీ కార్యం నువ్వు చేసుకోవడం లోనే నీ నైపుణ్యం ఉంది కరాళి. ఆ బాలుడికి ఎదురుపడి నీకు సాయం చేసే శక్తి నాకు లేదు కరాళి. కార్తీక పౌర్ణమిని గుర్తుపెట్టుకో కరాళి. ఆ తర్వాత మోక్ష నీకు దొరకడు. ఆ ఇష్టరూప జాతి నాగులు మోక్షను వదిలిపెట్టవు. ఈలోపు నీ కోరిక నెరవేర్చుకో.

పంచమి: వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో. లేదంటే మెడ పెట్టి బయటకు గెంటేస్తా
కరాళి: ఆ మాట నేను అనాలి పంచమి. నువ్వు విష నాగువి.. మనిషివి కాదు అని నేను చెప్తే ఇంటి నుంచి గెంటేస్తారు. కర్రలతో కొట్టి చంపేస్తారు. నేను ఎవరో ఏంటో బయట పెడితే నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ నీది ఈ లోకం కాదని తెలిస్తే.. ఎలా ఉంటుందో అప్పుడు ఈ ఇంట్లో నీ పరిస్థితి ఏంటో నువ్వు ఊహించుకోలేవు పంచమి
పంచమి: అసలు నీ కోరిక ఏంటి కరాళి. ఎందుకు ఈ ఇంట్లో అడుగుపెట్టావు
కరాళి: చాలా పెద్ద కోరిక పంచమి.. నాకు నాగమణి కావాలి.. 
పంచమి: అది ఆట బొమ్మ కాదు కొని ఇవ్వడానికి దాన్ని మానవులు ముట్టుకుంటే మాడి మసి అయిపోతారు
కరాళి: ఆ నాగమణి నాగలోకంలో ఉన్నంత వరకు నేను ముట్టుకోలేను. కానీ నువ్వు దాన్ని తెచ్చిస్తే చాలా ఇక్కడ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలుసు
పంచమి: నాకు నాగమణికి ఏం సంబంధం లేదు కరాళి. నేను శాశ్వతంగా మానవ రూపంలో ఇక్కడే ఉండిపోతాను
కరాళి: ఎవరి కోసం పంచమి.. 
పంచమి: నా భర్త కోసం
కరాళి: ఆ భర్తే లేకపోతే
పంచమి: ఇంతవరకు చేసింది చాలదా.. ఇంకా ఏం చేయాలి అనుకుంటున్నావ్ నా భర్తని
కరాళి: మోక్ష ఎప్పుడో నా వశం అయిపోయి తన ఆయుష్షు యవ్వనం నాకు వచ్చేవి కానీ చివరి నిమిషంలో నువ్వే మొత్తం నాశనం చేశావు
పంచమి: మరోసారి అలా చేయనివ్వను కరాళి. నీకు ఏదో చెడుకాలం దాపరించి ఈ ఇంట్లో అడుగుపెట్టావు. నా భర్త కోసం నాగలోకాన్నే ఎదుర్కొంటున్న దాన్ని నాకు నువ్వు ఒక లెక్క కాదు
కరాళి: అదీ చూద్దాం పంచమి. నువ్వు మనిషి రూపంలో ఉన్నావు కాబట్టి నాతో మాట్లాడగలుగుతున్నావు. అదే పాములా మారితే నిన్ను బంధించి నీ కోరలు పీకి నీ విషం మొత్తం కక్కిస్తాను. అప్పుడు నువ్వు పంచమిగా మారినా మోక్ష కోసం నేను చెప్పేది వినాల్సిందే.
పంచమి: నేను ఈఏ రూపంలో ఉన్నా నిన్ను మోక్షా బాబుని తాకనివ్వను
కరాళి: తాకనివ్వడం కాదు పంచమి త్వరలోనే మోక్ష నాకు సొంతం కానున్నాడు. తనలోని శక్తిని యవ్వనాన్ని నాలో ఐక్యం చేసుకోనున్నాను. నీకు చేతనైతే నన్ను అడ్డుకో చూద్దాం. నేను చెప్పినట్టు వింటే నీకు మోక్ష దక్కతాడు. నువ్వు పౌర్ణమి రోజున మోక్షను కాటేసి నేరుగా నాగలోకం వెళ్లు అక్కడ నుంచి ఆ నాగమణిని తీసుకొని రా. అంత వరకు మోక్ష శరీరాన్ని నేను కాపాడుతాను. నాగమణి శక్తితో నీ భర్తకు తిరిగి ప్రాణాలు దక్కుతాయి. నాగమణి నా సొంతం అవుతుంది. ఇందుకు నువ్వు సరే అంటే పౌర్ణమి రోజు నువ్వు  మోక్ష ఇద్దరు నా కళ్ల ముందే ఉండాలి. అందుకు ఏర్పాట్లు నువ్వే చేయాలి. నీకు మరో మార్గం లేదు పంచమి. నీ భర్తను నాగలోకం వదిలిపెట్టదు. ఆలోగా నేను వశం చేసుకోకుండా మానను. నువ్వు నీ భర్తను కాపాడుకోవాలి అనుకుంటే ఇందులో రాజీ పడాల్సిందే
పంచమి: నేను ప్రాణాలతో ఉండగా అలా జరగదు పంచమి
కరాళి: సరే పంచమి నువ్వే చూస్తావు కదా

మరోవైపు ఫణేంద్ర నాగలోకాని వెళ్లి నాగదేవతతో మాట్లాడుతారు. మోక్షను కాపాడుకోవడానికి యువరాణి చాలా ప్రయత్నాలు చేస్తోందని చెప్పాడు. యువరాణి కోసం మోక్షను ప్రాణాలతో వదిలితే అదే తమ ప్రతిష్టకు భంగం అని నాగదేవత అంటుంది. ఇక కార్తీక పౌర్ణమికి ఎలా అయినా మోక్ష ప్రాణాలు తీయాలి అని నాగదేవత సూచించింది. ఇక ఫణేంద్ర మహామృత్యుంజయ యాగం గురించి చెప్తే నాగ దేవత ఆ యాగం జరగకూడదు అని చెప్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Deputy Floor Leader Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్ రావు - కీలక నియామకాలు చేసిన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్ రావు - కీలక నియామకాలు చేసిన కేసీఆర్
Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Toll free travel: విజయవాడ- హైదరాబాద్ హైవేపై పండగ ట్రాఫిక్ భయం- టోల్ ఫ్రీ ట్రావెల్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ సిఫారసు
విజయవాడ- హైదరాబాద్ హైవేపై పండగ ట్రాఫిక్ భయం- టోల్ ఫ్రీ ట్రావెల్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ సిఫారసు
Cigarette Price: మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !

వీడియోలు

Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
Monty Panesar about Gautam Gambhir | గంభీర్ పై మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill Highest Scorer in Test Format | టెస్టుల్లో టాప్‌ స్కోరర్‌గా గిల్
Hardik, Bumrah out of Ind vs NZ ODI Series | న్యూజిలాండ్ సిరీస్ కు సీనియర్లు దూరం ?
Abhishek Sharma 45 Sixes in 60 Minutes | ప్రపంచ కప్‌ ముందు అభిషేక్ విధ్వంసం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy Floor Leader Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్ రావు - కీలక నియామకాలు చేసిన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్ రావు - కీలక నియామకాలు చేసిన కేసీఆర్
Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Toll free travel: విజయవాడ- హైదరాబాద్ హైవేపై పండగ ట్రాఫిక్ భయం- టోల్ ఫ్రీ ట్రావెల్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ సిఫారసు
విజయవాడ- హైదరాబాద్ హైవేపై పండగ ట్రాఫిక్ భయం- టోల్ ఫ్రీ ట్రావెల్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ సిఫారసు
Cigarette Price: మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
Mega Victory Mass Song : మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసింది - చిరు, వెంకీ మాస్ స్టైలిష్ స్టెప్పులు చూశారా?
మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసింది - చిరు, వెంకీ మాస్ స్టైలిష్ స్టెప్పులు చూశారా?
Mega Victory Mass Song Lyrics : మెగా విక్టరీ మాస్ సాంగ్ - న్యూ ఇయర్, సంక్రాంతికి హుషారు పెంచే లిరిక్స్ బాసూ...
మెగా విక్టరీ మాస్ సాంగ్ - న్యూ ఇయర్, సంక్రాంతికి హుషారు పెంచే లిరిక్స్ బాసూ...
Prabhas Dating: 'రాజా సాబ్' హీరోయిన్‌తో ప్రభాస్ డేటింగ్? ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఎందుకీ డిస్కషన్??
'రాజా సాబ్' హీరోయిన్‌తో ప్రభాస్ డేటింగ్? ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఎందుకీ డిస్కషన్??
Khaleda Zia Net Worth: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
Embed widget