Naga Panchami Serial Promo Today December 28th - 'నాగ పంచమి' సీరియల్: పంచమి చెంప చెల్లుమనిపించిన మోక్ష, ఇద్దరి మధ్య దూరం పెరిగిందా?
Naga Panchami Promo Today - పంచమి తనని పక్కకు నెట్టేయగా.. కోపంతో మోక్ష తనని కొట్టడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Telugu Serial Promo Today: ఈ రోజు (December 27) ప్రసారం కానున్న ‘నాగ పంచమి’ సీరియల్ ప్రోమో విడుదలైంది. ఫణేంద్ర, పంచమిల మధ్య సంభాషణ.. మోక్ష, పంచమిల మధ్య గొడవ ఈరోజు ప్రోమోలో పీక్స్‌లో ఉన్నాయి. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరగనుందంటే..
ఫణేంద్ర పంచమిని పాముగా మారి మోక్షని కాటేసి చంపేయమని చెప్పాడు. దీంతో పంచమి అది జరగని పని అంటుంది. ఇక కోపంతో ఫణేంద్ర అయితే నా నిర్ణయం కూడా చెప్తాను విను యువరాణి అని.. ముక్కోటి ఏకాదశి రోజున నాగదేవత ఆదేశించినట్లే తాను మోక్షని కాటేసి తనపాటికి తాను నాగలోకం వెళ్లిపోతాను అంటాడు. దాంతో పంచమి షాక్ అవుతుంది.
మరోవైపు మోక్ష తనని పట్టుకోవాలని చూస్తే పంచమి అతడి చేయిని విడిపించుకుంటుంది. దీంతో మోక్ష పంచమిని చెంప మీద కొడతాడు. చివరకి తనని పశువుని చేశావని.. ఒక్క దెబ్బతో తనలోని ప్రేమను చంపేసి రాక్షసుడ్ని చేశావని పంచమి మీద మోక్ష సీరియస్ అవుతాడు. ఇక పంచమి ఏడుస్తుంది. మోక్ష హాల్‌లోని సోఫాలో వచ్చి కూర్చొంటాడు. మరోవైపు పంచమిని మోక్ష కొట్టడం మేఘన చూస్తుంది.
మొత్తానికి ఈ ప్రోమో చూస్తుంటే పంచమి, మోక్షల మధ్య ఎడబాటు వచ్చినట్లు ఉంది. ఇక మేఘన ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని పంచమి, మోక్షలను దూరం చేయడానిక మరింతగా ప్రయత్నించొచ్చు. అసలు ఏం జరిగిందో తెలియాలి అంటే ఇవాళ్టి ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.
నిన్నటి ఎపిసోడ్‌లో జరిగింది ఇదే..
పంచమి పాములా తన తల్లి గౌరికి కలలో కనిపిస్తుంది. తన కూతురు పంచమి నాగలోకం వెళ్లడం ఇష్టం లేదని తన దగ్గరే ఉండిపోవాలని ఉందని చెప్పినట్ఉల కల కంటుంది. దీంతో గౌరి ఉదయం లేచి నాగ సాధువు దగ్గరకు వెళ్లి తన కూతురు, అల్లుడికి ఇబ్బందులు తొలగిపోవాలని.. అల్లుడి ప్రాణ గండం నుంచి తప్పించుకునేందుకు ఏదైనా మార్గం ఉంటే చెప్పమని ప్రాధేయపడుతుంది. దీంతో నాగ సాధువు తన దివ్య దృష్టితో చూసి.. ఇష్టరూప జాతి నాగు విషానికి ఈ భూలోకంలో విరుగుడు ఉండదు. కానీ నాగలోకంలో అయితే నీటి అడుగున పెరుగుతున్న నాగ చంద్రకాంత అనే మొక్క ఒక్కటే ఇష్టరూప నాగ జాతి విషానికి విరుగుడుగా పనిచేస్తుంది అని చెప్తారు. మీ అల్లుడిని బతికించుకోవడానికి అదొక్కటే మార్గం అని చెప్తారు. దీంతో గౌరి సంతోషిస్తూ ఆ విషయం తన కూతురికి చెప్తాను అంటుంది. మరోవైపు మేఘన తన పనులతో ఇంట్లో వాళ్లందరినీ ఆకట్టుకుంటుంది.
ఇక మోక్ష, పంచమి నాగమణి గురించి మాట్లాడుకుంటారు. ఇక మోక్ష.. తాను పంచమి, ఫణేంద్రలను నమ్మి పంచమితో కాటేయించుకోవడానికి సిద్ధమే అని అంటాడు. కానీ తర్వాత మీరు ఆ నాగమణిని తీసుకురాలేకపోతే ఏం చేయగలరు. నన్ను తిరగి బతికించగలరా.. అసలు ఆ నాగమణికి అలాంటి శక్తి ఉందని తెలుసా.. ఎప్పుడైనా ప్రత్యక్షంగా నాగమణిని చూశావా అంటూ పంచమిని ప్రశ్నిస్తాడు. ఇక పంచమి మోక్షని ఒప్పించేందుకు ప్రయత్నిస్తుంటే.. ఫణేంద్రకు ఆ నాగమణి తీసుకురమ్మని చెప్పమని చెప్పాడు. కానీ పంచమి అది కేవలం యువరాణి అయిన తనకే సాధ్యమని చెప్తుంది. ఇక మోక్ష తనకు బిడ్డ కావాలి అని చెప్తాడు. అయితే పంచమి తాను తల్లి అయితే ఇక ఎప్పటికీ నాగలోకంలో కాలు పెట్టలేను అని అంటుంది.
Also Read: హాలీవుడ్‌కు షాకిచ్చిన ‘సలార్’, ‘డంకీ’ - గ్లోబల్ బాక్సాఫీస్ బాక్స్ బద్దలు