Meghasandesham Serial Today September 30th: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ ను తిట్టిన మీరా – పెళ్లి వాళ్లను ఒప్పించమని అపూర్వకు భూమి వార్నింగ్
Meghasandesham Today Episode: మగపెళ్లి వాళ్లకు గగన్ సారీ చెప్పడని.. నువ్వే వెళ్లి వాళ్లను పెళ్లికి ఒప్పించాలని అపూర్వకు వార్నింగ్ ఇస్తుంది భూమి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ చాలా ఆసక్తిగా జరిగింది.
Meghasandesham Serial Today Episode: గగన్‌కు జ్యూస్ తీసుకెళ్లిన భూమి అతన్ని కొట్టడం తప్పేం కాదు కానీ ఆ ఇంట్లో వాళ్ల బాధ పడలేక వచ్చి అంకుల్ అడిగినట్లు ఉంది అంటుంది. అమ్మాయి కష్టంలో ఉంటే వెళ్లి కాపాడారు చూడండి అందుకే మీరంటే నాకు ఇష్టం అంటుంది భూమి. దీంత గగన్ ఏంటి అని అడుగుతాడు. అదే మంచితనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే మీ మంచితనం అంటే ఇష్టం అని చెప్తున్నాను. ఈ జ్యూస్ తాగి పడుకోండి. మరోవైపు మీరా వంశీ వాళ్ల నాన్నకు ఫోన్ చేస్తుంది.
మీరా: అన్నయ్య గారు పెళ్లి దగ్గర పడుతుంది కదా పెళ్లి పనులు ఎంత వరకు వచ్చాయో తెలుసుకుందామని ఫోన్ చేశాను.
వంశీ డాడీ: అసలు మేము పెళ్లే వద్దనుకుంటే మీరు పనుల గురించి అడుగుతున్నారు.
మీరా: అదేంటండి అలా మాట్లాడుతున్నారు.
వంశీడాడీ: ఏంటి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు. వాడెవడో వచ్చి మా అమ్మాయిని కొట్టాడు. అయినా సిగ్గు శరం లేకుండా ఇంకా పెళ్లి చేయమని అడుగుతున్నారా? నా కొడుకు మీద ఎవడైతే చేయి చేసుకున్నాడో వాడే వచ్చి క్షమాపణ చెప్పాలి. అప్పుడే పెళ్లైనా పెళ్లి పనులైనా..
మీరా: మా ఆయన వాడితో మాట్లాడి క్షమాపణ చెప్పిస్తారండి.
వంశీడాడీ: చెప్పాకా చూద్దాం లేండి. చెప్తేనే పెళ్లి లేకపోతే మీరు ఇంకో సంబంధం చూసుకోవాల్సి వస్తుంది.
అంటూ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. మీరా ఏడుస్తూ ప్రసాద్ దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది. ఇంతలో చెర్రి కల్పించుకుని అన్నయ్య సారీ చెప్పడం ఏంటమ్మా అంటాడు. ఆ ప్లేస్ లో నేనున్నా అలాగే చేసేవాడిని అంటాడు.
చెర్రి: అన్నయ్య చెప్పిన్నట్లు ఈ పెళ్లే ఆపేద్దాం అమ్మా
ఇందు: ఆపేస్తే ఇంకో సంబంధం నువ్వు తెస్తావా? ఈయన తెస్తాడా?
చెర్రి: మంచి చెప్పడం కూడా తప్పు అనుకుంటే అది నీ ఖర్మనే
మీరా: చెర్రి నోరు మూయ్ నువ్వు ఏవండి పెళ్లి ఆపమంటే ఇప్పటికిప్పుడు ఎలా ఆపుతామండి. అలా ఖాయం అయిన సంబంధం వద్దనుకుంటే ఇంచో సంబందం వస్తుందా?
నక్షత్ర: ఏంటతయ్యా ఏమైంది..?
మీరా: చూడు నక్షత్ర పెళ్లి కొడుకుని కొట్టింది చాలక పెళ్లి ఆపేమన్నారట.
నక్షత్ర: ఎవడా మాట అంది.
మీరా: ఇంకెవడు ఆ గగన్ గాడే.
నక్షత్ర: అంతే కదా మరి. వంశీ తప్పు చేయకపోతే గగన్ ఎందుకు కొడతాడు. నాకు అనిపించినట్టే ఆయనకు అనిపించింది అన్నమాట. అయినా ఆయన చెప్పాడు అంటే కరెక్టుగానే చెప్తాడు. నాకు తెలిసి పెళ్లి ఆపేస్తేనే మంచిది.
మీరా: ఏంటి నక్షత్ర నువ్వు చెప్పేది. పెళ్లి ఆపేస్తే దాని జీవితం ఏం కావాలి. ఒక సంబంధం చెడిపోతే ఇంకో సంబంధం వస్తుందా? ముహూర్తం కూడా పెట్టుకున్నాక పెళ్లి ఆగిపోతే దాని బతుకు ఏం కావాలండి.
అని అందరూ మాట్లాడుకుంటుంటే చాటు నుంచి అంతా విన్న భూమి డల్లుగా వెళ్లిపోతుంది. ఇంతలో శరత్‌చంద్ర వస్తాడు. కాసేపట్లో అందరూ వస్తారు. డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు అని చెప్తాడు. దీంతో అందరూ పెళ్లి ఆగిపోతుందంటున్నారు అని అడుగుతుంది. దీంతో శరత్ చంద్ర గగన్ ను తిడతాడు. భూమి బాధపడతుంది. శరత్‌చంద్ర వెళ్లిపోతుంటే అలాగే నాన్నా అంటుంది.
దీంతో శరత్‌చంద్ర ఎమషనల్ అవుతూ ఏమన్నావు అమ్మా అని అడుగుతాడు. అలాగే అంకుల్ అన్నాను అని మాట మారుస్తుంది భూమి. శరత్ చంద్ర వెళ్లిపోయాక అపూర్వ దగ్గరకు వెళ్లి బ్లాక్ మెయిల్ చేస్తే గగన్ సారీ చెప్పకుండా మగ పెళ్లి వాళ్లను నువ్వే ఒప్పించాలని చెప్తుంది. మరోవైపు శారదను గుడి దగ్గరకు పిలిచిన మీరా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా అంటూ తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం