Meghasandesham Serial Today September 26th: ‘మేఘసందేశం’ సీరియల్: నాగును చంపేసిన అపూర్వ – గగన్ బట్టలు ఉతికిన నక్షత్ర
Meghasandesham Today Episode: హాస్పిటల్ ఐసీయూలో ఉన్న నాగును ఎవ్వరూ చూడకుండా అపూర్వ చంపేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Meghasandesham Serial Today Episode: హాస్పిటల్ ఐసీయూలో ఉన్న నాగును అపూర్వ చూస్తుంది. షాక్ అవుతుంది. లోపల భూమిని చూసి బాధపడుతున్న నాగును నేను శోభాచంద్ర గారి కూతురినే అని చెప్తారా? అని అడుగుతుంది. చెప్తానని నాగు అంటాడు. ఇది శోభ కూతురినని చెప్పకపోవడం ఏ సాక్ష్యం లేనందుకే అన్నమాట అనుకుంటుంది. భూమి డాక్టర్ దగ్గరకు వెళ్లగానే అపూర్వ లోపలికి వెళ్తుంది. అపూర్వను చూసిన నాగు షాక్ అవుతాడు. నాగును అపూర్వ చంపేసి వెళ్లిపోతుంది. డాక్టర్ దగ్గర నుంచి నాగు దగ్గరకు వచ్చిన భూమి అతను చలనం లేకుండా ఉండటం చూసి కంగారుపడుతుంది. డాక్టర్ ను పిలుస్తుంది. డాక్టర్ వచ్చి చనిపోయాడని చెప్తాడు. దీంతో భూమి ఏడుస్తుంది. మరోవైపు గగన్ వాళ్ల ఇంటికి వస్తుంది నక్షత్ర.
పూరి: అమ్మా.. అటు చూడు
శారద: ఈ అమ్మాయి మన ఇంటికి వస్తుందేంటి?
పూరి: ఆ ఇంటి వాళ్లు మన ఇంటికి ఎప్పుడూ గొడవ పడటానికే కదా వస్తారు.
శారద: అమ్మా నాన్నా అత్త అందరూ రావడం అయిపోయిందని ఇప్పుడు ఈ అమ్మాయి వస్తుందా?
పూరి: దేని గురించి గొడవ పడటానికి వస్తుందో..
శారద: ఏంటమ్మా ఏం కావాలి..?
నక్షత్ర: గగన్ ఎక్కడ?
పూరి: మా అన్నయ్యతో నీకేంటి పని..
నక్షత్ర: పని ఉంది కాబట్టే వచ్చాను. ఇంట్లో ఉన్నాడా? లేడా?
శారద: ఎం కావాలో చెప్పకుండా ఏంటమ్మా నువ్వు.
నక్షత్ర: గగనే కావాలని చెప్పాను కదా?
పూరి: ఎందుకని నేను అడుగుతున్నాను కదా?
శారద: తనతో గొడవ ఎందుకు మీ అన్నయ్యను పిలువు వాడే మాట్లాడతాడు.
నక్షత్ర: ఇలా వచ్చిన వాళ్లందరికీ మర్యాద ఇస్తున్నందుకే ఇష్టానికి వస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు తిట్టి పోతున్నారు.
గగన్ కిందకు వస్తాడు. గగన్ ను చూసి నక్షత్ర లవ్ లీగా ఫీలవుతుంది.
గగన్: నువ్వేంటి ఇక్కడ..
నక్షత్ర: నిన్న కోటు ఇచ్చావు కదా? అది ఇచ్చిపోదామని వచ్చాను. తీసుకో..
గగన్: ఏంటిది దుమ్ము పట్టిపోయి ఉంటే అలాగే తీసుకొచ్చావా?
నక్షత్ర: ఇప్పుడేంటి నీకు నీ కోటు వాష్ చేసి ఇవ్వాలి. ఇప్పుడే ఇక్కడే వాష్ చేసి ఇస్తాను. ఇవ్వు
గగన్: ఏమీ అవసరం లేదు.
నక్షత్ర: నేను మాట పడను నీ కోటు నీకు క్లీన్‌గా వాష్ చేసి ఇచ్చి వెళ్తాను.
అని కోటు తీసుకుని బయటకు వెళ్లి వాష్ చేస్తుంది నక్షత్ర. గగన్, శారద, పూరి విచిత్రంగా చూస్తుంటారు. ఇంతలో గేటు ఓపెన్ చేసుకుని భూమి బాధగా లోపలికి వస్తుంది. కోటు ఉతుకుతున్న నక్షత్రను చూసి ఆశ్చర్యపోతుంది.
భూమి: ఇది ఎందుకు వచ్చింది.
పూరి: అన్నయ్యకు కోటు ఇచ్చి పోవాలని వచ్చింది.
భూమి: మీ అన్నయ్య కోటు తన దగ్గర ఎందుకు ఉంది.
పూరి: నాకు అదే అర్థం కాలేదు.
భూమి: మరి ఉతుకుతుందేంటి?
పూరి: దాని మీద డస్ట్ పడిందట. అన్నయ్య వద్దు అన్నా తనే ఉతికి ఇస్తానంది. చూడు ఎలా ఉతుకుతుందో..
అనగానే నక్షత్ర బండకేసి ఉతకగానే కోటు చిరిగిపోతుంది. దీంతో నక్షత్ర కోటు ఏంటి ఇలా అయిపోయింది అంటుంది. అలా ఉతికితే ఇలాగే చిరిగిపోతుంది అని శారద అంటుంది. గగన్ నాకు ఏ కోటు వద్దని చెప్పగానే లేదు నేను కొత్త కోటు తీసుకుని మీది మీకు ఇస్తాను అంటూ వెళ్లిపోతుంది నక్షత్ర. అసలు మీ కోటు తన దగ్గర ఎందుకుంది అని భూమి అడగ్గానే జరిగింది చెప్తాడు గగన్. మరోవైపు ఇంటికి వెళ్లిన ఇందు ఏడుస్తుంది. ఏమైందని అందరూ అడుగుతారు. వంశీ ఏమైనా అన్నాడా? అని అడుగుతారు. ఇందు ఏం చెప్పకుండా ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీ ఇంట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే భయంకరమైన వాస్తు దోషం ఉన్నట్లే