Meghasandesham Serial Today September 13th: ‘మేఘసందేశం’ సీరియల్: అపూర్వకు వార్నింగ్ ఇచ్చిన శోభ – చెర్రికి నిజం చెప్పిన భూమి
Meghasandesham Today Episode: తన బిడ్డనే చంపాలనుకుంటావా? అంటూ అర్ధరాత్రి వచ్చిన శోభా, అపూర్వకు వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Meghasandesham Serial Today Episode: చెర్రి తాను భూమిని లవ్ చేస్తున్నట్లు ఫోన్ లో చెప్తాడు. ఫోన్ పక్కన పెట్టిన భూమి గగన్ టిఫిన్ చేస్తుంటే ప్రేమగా చూస్తూ పక్కనే కూర్చుంటుంది. చెర్రి నా మనసులో మాట నీకు చెప్పేశాన నువ్వేమంటావు అని అడుగుతాడు. అయినా వెంటనే చెప్పడం కష్టమే కానీ కొంచెం టైం తీసుకుని నాకు చెప్పు అంటూ హలో అంటాడు. మరోవైపు గగన్ నే చూస్తూ కూర్చున్న భూమి తనకు గగన్ పానిపూరి తినిపించింది గుర్తు చేసుకుంటుంది. ఇంతలో గగన్‌కు పొలమారడంతో భూమి మంచినీళ్లు తాగిస్తుంది. టిఫిన్ చేసి గగన్ వెళ్లిపోయాక భూమి మళ్లీ ఫోన్ రిసీవర్ తీసుకుని నేను నీతో మాట్లాడాలి అని అంటుంది. దీంతో నేను చెప్పినదానికి ఓకేనా కాదా? చెప్పకుండా మాట్లాడాలి అంటే ఎలా అని చెర్రి అడగ్గానే అది ఓకే అని భూమి చెప్పగానే చెర్రి కేరింతలు కొడుతూ నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అంటూ హ్యాపీగా ఫీలవతుంటాడు. తర్వాత భూమి చెప్పిన ప్లేస్ కు వెళ్తాడు చెర్రి.
చెర్రి: నా మనసులో మాట చెప్పేశాను. తాను మాత్రం ఇంకా చెప్పలేదు. ఇక్కడికి రమ్మంది అంటే నేరుగా చెప్తుందేమో..? ఈ గుండె ఏంట్రా గుడిలో గంటలా ఇలా కొట్టేసుకుంటుంది. ఈ మనసుకు మరీ తొందర ఎక్కువ.
భూమి: వచ్చేశారా?
చెర్రి: నువ్వు రమ్మని చెప్పాకా.. రాకుండా ఉంటానా?
భూమి: మీకో ముఖ్యమైన విషయం చెప్పాలని రమ్మని చెప్పాను.
చెర్రి: నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేసెయ్.
భూమి: మీరేం చెప్పారు..?
చెర్రి: ఫోన్ లో చెప్పాను కదా?
భూమి: అదే ఏం చెప్పారు..? మీరేం చెప్పారో నేను వినలేదు. కానీ నేను నీకో విషయం చెప్పాలని వచ్చాను.
చెర్రి: సరే నువ్వేం చెప్పాలనుకున్నావో అది చెప్పు.
భూమి: నాకు నా వాళ్లెవరో తెలిసింది. ఇన్ని రోజులు నేను వెతుకుతున్న నా వాళ్లెవరో నేను తెలుసుకోగలిగాను.
చెర్రి: సరేలే నేను చెప్పింది వినకపోయినా తన కుటుంబ విషయం నాకు పిలిచి చెప్తుందంటే తన మనసులో నాకు చోటుందని అర్థమైంది.
అని చెర్రి మనసులో అనుకుని సరేలే మరి మీ వాళ్లను కలిశావా? అని అడుగుతాడు. దీంతో లేదని మా అమ్మ చనిపోయిన తర్వాత నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు. పైగా నేనే వాళ్ల కూతురిని అని చెప్పే వ్యక్తి హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య ఉన్నాడని చెప్తుంది. అందుకే మీరైతే ఏదైనా ఐడియా ఇస్తారని పిలిచాను అంటుంది భూమి. దీంతో చెర్రి ఒక ఐడియా చెప్పడంతో భూమి హ్యపీగా వెళ్లిపోతుంది. చెర్రి మాత్రం డిస్సపాయింట్‌గా వెళ్లిపోతాడు. తర్వాత అర్ధరాత్రి నిద్రపోతున్న అపూర్వకు ఎవరో అరుస్తున్నట్లు సౌండ్ వినిపించడంతో భయంగా లేచి వెళ్లి చూస్తుంది. ఇంటి ముందు భూమి డాన్స్ చేస్తూ ఉంటుంది. భూమిని చూసిన అపూర్వ భయపడుతుంది. భూమి డాన్స్ చేస్తూ వచ్చి అపూర్వను కొడుతుంది. కొడతూ కొడుతూ శోభా చంద్ర ఫోటో దగ్గరకు తీసుకువెళ్తుంది.
అపూర్వ: ఎవరు నువ్వు...
భూమి: ఇంకా గుర్తు పట్టలేదా? అపూర్వ నిన్ను నమ్మి మోసపోయిన దాన్ని. నీ పగకు బలై పోయిన దాన్ని. శోభా చంద్రని..
అపూర్వ: నువ్వా..?
భూమి: నన్ను చంపింది చాలదా? నీ స్వార్థానికి నన్ను బలి తీసుకుంది చాలక. నా బిడ్డను కూడా ఎందుకు చంపాలని చూస్తున్నావు.
అపూర్వ: నీ బిడ్డా..
భూమి: అవును నువ్వు చంపాలని చూస్తుంది నా బిడ్డనే.. తన పుట్టుక తెలుసుకోవాలని తన వాళ్లను కలుసుకోవాలని పుట్టింటిని వెతుక్కుంటూ వచ్చిన నా కూతురును బలి తీసుకోవాలని చూస్తావా?
అంటూ భూమి లోపలికి వచ్చిన శోభా చంద్ర, అపూర్వకు వార్నింగ్ ఇస్తుంది. నా బిడ్డను ఏమైనా చేస్తే నిన్ను వదలను అంటూ అపూర్వ గొంతు నులిముతుంటే ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఈ చిన్న పని చేస్తే చాలు కర్పూరంతో అదృష్ణ దేవతను మీ ఇంట్లోకి ఇలా ఆహ్వానించవచ్చట!