Camphor Benefits: ఈ చిన్న పని చేస్తే చాలు కర్పూరంతో అదృష్ణ దేవతను మీ ఇంట్లోకి ఇలా ఆహ్వానించవచ్చట!
How To Remove Vastu Dosh: ఎంతటి భయంకరమైన వాస్తు దోషాలు ఉన్నా పోగొట్టి మీకు మీ ఇంటికి లక్మీ కటాక్షం కలగజేసే కర్పూరంతో చేసే రెమెడీని ఈ కథనంలో తెలుసుకుందాం.
Adrushta Remedies : ఇంట్లో కర్పూరం వెలిగిస్తే కలిగే లాభాలు మాత్రమే మీరింత వరకు తెలుసుకుని ఉంటారు. కానీ కర్పూరాన్ని వెలిగించకుండా అలాగే ఉంచినా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు పండితులు. అలా వెలిగించకుండా ఇంట్లో ఉంచిన కర్పూరం వల్ల ఇంట్లోని భయంకరమైన వాస్తు దోషాలను కూడా తొలగించుకోవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అసలు ఇంట్లో కర్పూరాన్ని ఎలా ఉపయోగించి వాస్తు దోషాలు పోగొట్టుకోవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.
హిందూ పురాణాల ప్రకారం వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టినా.. అది వాస్తు ప్రకారం లేకపోతే చాలా కష్టాలు వస్తాయని వాస్తు శాస్త్రం నానుడి. అయితే వాస్తు ప్రకారం నిర్మించని ఇంట్లో ఉండే వారి జీవితంలో కూడా అనుకోని కష్టాలు వస్తుంటాయని.. వారు ఎంత కష్టపడినా జీవితంలో పైకి ఎదగరని అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుందని పండితులు చెప్తుంటారు.
అయితే కొన్ని సందర్భాలలో వాస్తు శాస్త్రాన్ని విశ్వసించని వారు తమకు నచ్చినట్టుగా.. అధునాతన డిజైన్లతో ఇండ్లు కట్టుకుంటారు. తర్వాత ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రావడంతో అష్టకష్టాలు పడుతుంటారు. కోట్లు పెట్టి కట్టుకున్న కలల సౌధం తమ భవిష్యత్తుకు అడ్డంకిగా మారిందని.. తెలిసినా.. జీవితంలో ఏ పని చేసినా కలసిరాక ఇబ్బందులు పడుతున్నామని తెలిసినా వాస్తు దోషం ఉందని పండితులు చెప్పినప్పుడు. ఇక ఆ ఇంటిని కూలగొట్టలేరు. అలాగని ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్లలేరు. అటువంటి వాళ్ల కోసమే సనాతన ధర్మంలో చాలా రెమిడీస్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది.. చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదే కర్పూరంతో చేసే రెమెడీ.
ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ కు ఐ లవ్ యూ చెప్పిన భూమి – భూమిని తోసేసిన గగన్
ఈ రెమెడీ పాటిస్తే ఇంట్లో ఎంతటి భయంకర వాస్తు దోషాలు ఉన్నా మెల్లగా పలాయనం చిత్తగిస్తాయని పండితులు చెప్తున్నారు. అంతే కాదు మీరు ఈ చిన్న రెమెడీ కనక క్రమం తప్పకుండా పాటిస్తుంటే.. మీ జీవితం నుంచి నెగెటివ్ ఎనర్జీ వెల్లిపోతుందట. మీరు మీ జీవితంలో ఆనందం, సంతోషాన్ని తిరిగి పొందవచ్చని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెప్తున్నారు.
ఏ ఇంట్లో అయితే వాస్తు దోషం ఉందని తెలుసుకుంటారో ఆ ఇంట్లో రెండు మూలలలో కర్పూరం ముక్కలు ఉంచాలట. అవి వెలిగించకుండా అలాగే ఉంచడం వల్ల అవి మెల్లగా కరిగిపోయతాయట. అలా కర్పూరం ముక్కలు రెగ్యులర్‌గా పెడుతూ ఉంటే అవి రెగ్యులర్ గా కరిగిపోతుంటే ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయట. అదీ కాకుండా ఆ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ కూడా కర్పూరంలా కరిగిపోతుందట.
అదేవిధంగా ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర కూడా కర్పూరం ముక్కలను ఉండచం ద్వారా ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా కర్పూరం నిరోధిస్తుందట. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచడంతో పాటు ఆ ఇంట్లో ఉంటున్న వారి జీవితంలో కూడా గొప్ప పురోభివృద్దికి కర్పూరం బాటలు వేస్తుందట. అలాగే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవారు కూడా కర్పూరాన్ని ఉపయోగించి తమ ఆర్థిక కష్టాలను దూరం చేసుకోవచ్చని తంత్రశాస్త్ర నిపుణులు చెప్తున్నారు.
వాస్తు కోసమే కాకుండా కర్పూరాన్ని అద్బుతమైన రూమ్ ప్రెషనర్ గా కూడా ఉపయోగించవచ్చని అధునిక సైంటిస్టులు తెలియజేస్తున్నారు. కర్పూరాన్ని పొడిగా చేసి దానికి లావెండర్ ఆయిల్ కలిపి రూంలో స్ప్రే చేసుకోవచ్చంటున్నారు. అలాగే కర్పూరం పొడిని నీటితో కలిపి ఫ్లోర్‌లను శుభ్రం చేయడం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుందట.
ALSO READ: రాధాష్టమి ఎప్పుడొచ్చింది..ఈ రోజు విశిష్టత ఏంటి - పూజావిధానం!