Meghasandesham Serial Today October 8th: ‘మేఘసందేశం’ సీరియల్: దొంగతనం మీదేసుకున్న చెర్రి – భూమిని క్షమించమన్న శరత్‌చంద్ర
Meghasandesham Today Episode: భూమి దొంగతనం చేయలేదని ఆ బైక్ తీసుకోవాలని ఆ నెక్లెస్ నేనే భూమి బ్యాగులో దాచానని చెర్రి చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Meghasandesham Serial Today October 8th: ‘మేఘసందేశం’ సీరియల్: దొంగతనం మీదేసుకున్న చెర్రి – భూమిని క్షమించమన్న శరత్‌చంద్ర meghasandesham serial today episode October 8th written update Meghasandesham Serial Today October 8th: ‘మేఘసందేశం’ సీరియల్: దొంగతనం మీదేసుకున్న చెర్రి – భూమిని క్షమించమన్న శరత్‌చంద్ర](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/07/930061fdad7ef7a58a776684aa1896361728320717371879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Meghasandesham Serial Today Episode: మీరా చెక్ చేయగానే భూమి బ్యాగ్ లోంచి నెక్లెస్ బయటపడుతుంది. అందరూ షాక్ అవుతారు. శరత్ చంద్ర కోపంగా తిడుతూ అడిగితే నేనే ఇచ్చేవాణ్ని కదా? దొంగతనం చేస్తావా? అంటూ భూమిపై కోప్పడతాడు. దీంతో భూమి ఏడుస్తూ నేను దొంగతనం చేయలేదు నాన్నా అంటుంది. దీంతో అపూర్వ ఎవరే నీకు నాన్నా అంటూ తిడుతుంది. ఇంకా నటిస్తున్నావా? అంటుంది. ఇందు కూడా తిడుతుంది. ప్రసాద్ మాత్రం భూమి అలాంటిది కాదని అంటాడు. అపూర్వ ఏడుస్తున్నట్లు నటిస్తూ బావ నువ్వే చెప్పు దీన్ని ఏం చేయాలో అంటుంది.
శరత్: నిజమే అపూర్వ నాదే తప్పు ఎవరో ఏంటో తెలుసుకోకుండా సింహాసనం మీద కూర్చోబెట్టాను.
భూమి: నాన్నకు నన్ను దగ్గర చేయ్ అమ్మా అంటే నాన్న నన్ను దొంగ అంటుంటే చూస్తున్నావా? అమ్మా.. ( అని మనసులో అనుకుంటుంది.)
శరత్: నా భార్యను గురువుగా బావించావు అంటే ఎంత మంచిది అనుకున్నా..? నాకు తల్లిలాంటిది అంటే తల్లి లేని బిడ్డ కదా నా శోభలో తల్లిని చూసుకుంటుంది ఎంత అమాయకురాలు అనుకున్నాను. కానీ నువ్వు దొంగవా? అభిమానాన్ని అడ్డుపెట్టుకుని నీకు ఇలా చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది. అందుకేనా నేను వెళ్తాను వెళ్తాను అంటూ తొందరపడ్డావు. మళ్లీ నీ ముఖం నాకు చూపించకు పో బయటకు.
భూమి: అమ్మ సాక్షిగా చెప్తున్నాను నేను ఈ దొంగతనం చేయలేదు.
శరత్: లేని నా శోభ మీద ప్రమాణం చేసి నీ తప్పును కప్పిపుచ్చుకోవాలనుకోకు. పో బయటికి. ఇంకా చూస్తావేంటి నడు..
చెర్రి: మామయ్యా భూమి ఆ దొంగతనం చేయలేదు.
మీరా: చెర్రి నెక్లెస్ తన దగ్గర దొరికితే తను దొంగతనం చేయలేదు అంటావేంట్రా..
చెర్రి: ఆ నెక్లెస్ దొంగతనం చేసింది మరెవరో కాదు. నేనే
ప్రసాద్: చెర్రి నువ్వు దొంగతనం చేశావా?
చెర్రి: నేనే చేశాను..
మీరా: నువ్వు దొంగతనం చేయడం ఏంట్రా..
చెర్రి: అవునమ్మా నేనే దొంగతనం చేశాను.
అపూర్వ: అబద్దం బావ వాడు అబద్దం చెప్తున్నాడు. దీన్ని కాపాడటానికే వాడు అబద్దం చెప్తున్నాడు.
చెర్రి: లేదు నేనే చేశాను. ఆ సైకిల్ మీద తిరగడం నాకు అవమానంగా ఉంది అమ్మా. అందుకే కొత్త బైక్ తీసుకుందామని నేనే తీశాను.
అని చెర్రి దొంగతనం తన మీద వేసుకుంటాడు చెర్రి. అపూర్వ మాత్రం నువ్వు కాదని చెప్తుంది. చెర్రి మాత్రం నేను మామయ్య కోసమే నిజం చెప్పానని ఆయన భూమిని ఎంత నమ్మాడో ఆయన మాటలు విన్నాక అర్థం అయ్యింది అంటాడు దీంతో శరత్‌చంద్ర కోపంగా వెళ్లి చెర్రిని కొడతాడు. నువవు చేసిన పనికి నేనిప్పుడు భూమి ముందు ఎలా తలెత్తుకోవాలి అంటూ బాధపడతాడు శరత్‌చంద్ర. భూమికి సారీ చెప్తాడు. దీంతో వద్దని భూమి నేను మీకన్నా చాలా చిన్నదాన్ని అంటూ ఏడుస్తుంది. దీంతో అమ్మలేదని బాధపడకు నీకు మీ నాన్న ఉన్నాడమ్మా అంటూ ఎమోషనల్ గా ఫీలవుతాడు శరత్‌చంద్ర.
తర్వాత భూమి రూంలోకి వెళ్లిన చెర్రి నా మీద నీకు కోపంగా ఉందా? అని అడుగుతాడు. ఎందుకని భూమి అడుగుతుంది. నెక్లెస్ నీ బ్యాగులో పెట్టినందుకు అని చెప్తాడు. దీంతో నువ్వు దొంగతనం చేశావంటే నేను నమ్మాలా? అది నా బ్యాగులో పెట్టాలంటే ఎలా నమ్మాలి అంటూ భూమి ప్రశ్నిస్తుంది. ఎటు వెళ్లాలో తెలియక రోడ్డు మీద ఉన్న తీసుకెళ్లి జాగ్రత్తగా మీ అన్నయ్య గారింట్లో పెట్టావు అంటూ భూమి ఎమోషనల్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)