Meghasandesam Serial Weekly Roundup September 8th to 13th: ‘మేఘసందేశం’ సీరియల్: గడచిన వారం మేఘసందేశం సీరియల్‌లో ఏ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం
Meghasandesam serial weekly episode September 8th to 13th: మేఘసందేశం సీరియల్ ఈ వారంలో చాలా ఆసక్తికరంగా జరిగింది. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Meghasandesam Serial weekly Episode: బ్యాచిలర్ పార్టీ అయిపోయాక ఉదయ్ కోపంగా శరత్ చంద్ర ఇంటికి వెళ్లి గగన్, భూమిని ఎత్తుకుని వెళ్లడం.. భూమి కూడా గగన్‌తో క్లోజ్‌గా ఉన్న వీడియో చూపిస్తాడు. వీడియో చూసిన శరత్ చంద్ర కోపంగా భూమిని పిలుస్తాడు. భూమికి వీడియో చూపిస్తాడు. అడిగిన ప్రతిసారి ఆ గగన్‌ను ప్రేమించడం లేదు మర్చిపోయాను అని నాకు నువ్వు అబద్దం చెప్పావు. నాకు నువ్వు అబద్దం మాత్రమే చెప్పలేదు. మోసం చేశావు. నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నట్టేట ముంచావు. మీ అమ్మ చచ్చిపోయి బతికిపోయింది. బతికి ఉంటే ఇప్పుడు చచ్చిపోయేది. చెప్పు.. నన్నెందుకు మోసం చేయాలనిపించింది. అంటూ శరత్ చంద్ర కోపంగా భూమిని కొడతాడు.
భూమి దూరంగా వెళ్లి కింద పడుతుంది. అప్పుడే భూమి మెడలో తాళి బొట్టు కనిపిస్తుంది. అది చూసిన శరత్ చంద్ర షాక్ అవుతాడు. అందరూ షాక్ అవుతారు. తాళి నీ మెడలోకి ఎలా వచ్చిందని అడుగుతాడు. అయితే గగన్ తాళి కట్టిన విషయం మొత్తం చెప్తుంది భూమి. దీంతో శరత్ చంద్ర భూమి మెడలో తాళి తెంపాలని చూస్తాడు. ఇంతలో కేపీ కోపంగా మీరా తాళి పట్టుకుని నువ్వు భూమి మెడలో తాళి తెంపేస్తే.. నేను నీ చెల్లి మెడలో తాళి తెంపేస్తానని చెప్తాడు. దీంతో శరత్ చంద్ర కోపంగా భూమిని తీసుకుని గగన్ ఇంటికి తీసుకెళ్లి అక్కడే వదిలేసి వస్తాడు. శరత్ చంద్ర భూమిని వదిలేసి వెళ్లాక గగన్ కోపంగా భూమిని తిడతాడు. నీకు నువ్వే తాళి కట్టుకుని కొత్త డ్రామా ఆడుతున్నావా..? అంటూ నిలదీస్తాడు. దీంతో భూమి ఏడుస్తూ బావ నువ్వే రాత్రి అమ్మ వారి గుడిలో కట్టావు ఈ తాళి అని చెప్తుంది. భూమి ఎంత చెప్పినా గగన్ నమ్మడు. పైగా తన ఇంట్లోకి రావొద్దని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఇంట్లో వాళ్లు కూడా ఎవ్వరూ భూమిని లోపలికి తీసుకురావొద్దని చెప్పడంతో ఎవ్వరూ ఏమీ అనకుండా ఉండిపోతారు.
గగన్ లోపలికి వెళ్లిపోయాక భూమి గేటు దగ్గర నిలబడుతుంది. ఫుల్లుగా వర్షం పడుతున్నా వానలోనే నిలబడి ఉంటుంది. పైన రూంలోంచి గగన్ అంతూ చూస్తుంటాడు. మరుసటి రోజు ఉదయం భూమి స్పృహ తప్పి కింద పడిపోతుంది. వెంటనే గగన్ తన కారులోనే భూమిని తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తాడు. భూమికి ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్ గగన్ వాళ్లను తిడుతుంది. రాత్రంతా వానలో తడవాల్సిన అవసరం ఏమొచ్చిందని అసలు మీరు మనుషులేనా అంటూ తిడుతుంటే.. తను వానలో చిక్కుకుపోయింది. అక్కడ ఎక్కడా షెల్టర్ లేకపోవడంతో తడిపిపోవాల్సి వచ్చింది అంటూ గగన్ చెప్తాడు. తర్వాత సిస్టర్ వచ్చి భూమికి స్పృహ వచ్చిందని చెప్తుంది. శారద, గగన్ లోపలకి వెళ్తారు. శారద, భూమిని ఓదారుస్తూ మాట్లాడిన తర్వాత గగన్, శారదను బలవంతంగా ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్తూ.. తన ఇంటికి రావొద్దని భూమిని తిట్టి వెళ్లిపోతాడు.
గగన్ తిట్టడంతో ఏం చేయాలో తెలియక భూమి పార్కులో వెళ్లి కూర్చుని ఉంటుంది. అయితే భూమి పార్క్ లో కూర్చున్న విషయం శారదకు తెలుస్తుంది. వెంటనే భూమి కోసం భోజనం తీసుకుని వెళ్తుంది శారద. ఇద్దరూ కలసి పార్క్ లోనే భోజనం చేస్తారు. తర్వాత ఇంటికి రమ్మని శారద పిలిస్తే.. గగన్ పిలిస్తే వస్తానని భూమి చెప్తుంది. ఇంతలో గగన్ వచ్చి శారదను ఇంటికి రమ్మని పిలుస్తాడు. భూమి వస్తేనే నేను వస్తాను అని శారద చెప్తుంది. అయితే భూమి ఇంటికి రావడానికి ఇష్టమే కానీ నేన తాళి కట్టిన్నట్టు నిరూపించమను అంటూ గగన్ కండీషన్ పెడతాడు. గగన్ కండీషన్‌కు భూమి ఒప్పుకుంటుంది. ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు.
మరోవైపు రత్న దూరం నుంచి శివ, పూర్ణిమ క్లోజ్ గా ఉన్న ఫోటోలు తీసి.. వాటిని ఇంట్లో వాళ్లకు చూపిస్తానని బ్లాక్ మెయిల్ చేస్తుంది. తనను మళ్లీ ఇంట్లోకి పని మనిషిగా తీసుకెళ్లమని చెప్తుంది. దీంతో పూర్ణిమ, రత్నను తీసుకుని ఇంటికి వెళ్తుంది. దీంతో ఈ వారం మేఘసందేశం చివరి ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















