Meghasandesam Serial Today September 13th: ‘మేఘసందేశం’ సీరియల్: భూమిని ఇంటికి తీసుకొచ్చిన గగన్ - గగన్ ఇంట్లోకి వెళ్లిన రత్న
Meghasandesam serial today episode September 13th: పూర్ణిమను బ్లాక్ మెయిల్ చేసి గగన్ ఇంట్లోకి వెళ్లిన రత్న.. అపూర్వకు ఫోన్ చేసి నిజం చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: పూర్ణి, బిందు గొడవ పడుతుంటే మధ్యలో వెళ్లిన శివకు గాయం అవుతుంది. బిందు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. శివ మాత్రం గాయంతో బాధపడుతుంటాడు. బ్లడ్ కూడా వస్తుంది. బ్లడ్ చూసిన పూర్ణి బాధతో రక్తం వస్తుంది శివ అంటూ తీసుకెల్లి అక్కడే కూర్చోబెట్టి బ్లడ్ క్లీన్ చేస్తుంది. వెనక నుంచి రత్న వీడియో తీస్తుంది. అందులో పూర్ణి, శివకు కిస్ చేస్తున్నట్టు ఉంటుంది.
రత్న: ( మనసులో) ఎలా అడగాలా..? ఆ ఇంట్లోకి మళ్లీ ఎలా వెళ్లాలా..? అనుకున్నాను. మంచి చాన్స్ వచ్చింది. ఈ వీడియో నా దగ్గర ఉంటే ఆ ఇంట్లోకి ఆ పూర్ణిమే తీసుకెళ్తుంది
శివ: ఆడవాళ్ల గొడవల్లో తలదూరిస్తే ఇలాగే ఉంటుంది. నేను వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాను జరగండి.
అంటూ శివ వెళ్లిపోతాడు. రత్న పూర్ణిమ దగ్గరకు వస్తుంది.
రత్న: నమస్కారం అమ్మా..
పూర్ణి: నువ్వు మళ్లీ ఇక్కడికి వచ్చావా..? అప్పుడేదో గొడవ పడి వెళ్లిపోయావు..
రత్న: ఏదో ఆవేశంలో నోటికొచ్చింది వాగి తప్పు చేశానమ్మా..కాస్త పెద్ద మనసు చేసుకుని క్షమించండి అమ్మ.. మీ కాళ్లు పట్టుకుంటాను అమ్మ.
పూర్ణి: నువ్వు చేసిన ఓవరాక్షన్‌కు పనిలోకి కాదు గుమ్మంలోకి కూడా రానివ్వను
రత్న: అయితే నన్ను పనిలోంచి తీసేశారా అమ్మా..?
పూర్ణి: అదే కదా చెప్పేది అర్థం కాలేదా..?
రత్న: నన్ను పనిలోంచి తీసేస్తే మీ ఇట్లో పనిలో పెట్టించే ఫ్రూప్ నా దగ్గర ఒకటి ఉంది.
పూర్ణి: ఏం ఫ్రూప్ ( ఫోటో చూపిస్తుంది రత్న) ఇందులో తప్పేం ఉంది. శివకు బ్లడ్ వస్తుంటే తుడిచాను.. నువ్వు వెనక నుంచి ఫోటో తీశావు.
రత్న: అది మీకు నాకు తెలుసు..? కానీ ఈ ఫోటోలో మీరు ముద్దు పెట్టుకుంటున్నట్టు ఉంది. దీనిని మీ అన్నయ్యో మీ అమ్మో చూశారో అనుకో మిమ్మల్ని కొడతారో లేక చంపేస్తారో
పూర్ణి: ఫ్లీజ్ అవి డిలీట్ చేయవా..?
రత్న: నన్ను మీ ఇంట్లో పనిలో పెట్టిస్తే డిలీట్ చేస్తాను.
పూర్ణి: నేను చెప్పి ఒప్పిస్తాను తర్వాత వద్దువు గానీ
రత్న: అమ్మా ఆలస్యం అమృతం విషం అంటారు. ఇప్పుడే వెళ్లి ఆ పని చూద్దాం రండి రండమ్మా..?
అంటూ పూర్ణిమ బ్యాగ్ తీసుకుని రత్న వెళ్తుంది. వెనకాలే భయంగా పూర్ణి వెళ్తుంది. తర్వాత రత్న, అపూర్వకు ఫోన్ చేస్తుంది.
అపూర్వ: చెప్పవే రత్న ఏంటి ఫోన్ చేశావు.
రత్న: అమ్మగారు నేను మళ్లీ గగన్ ఇంటికి వచ్చేశాను అమ్మగారు..
అపూర్వ: వెరీగుడ్.. కాకపోతే ఆ బొమ్మలో మిస్ అయినదాన్ని నువ్వు త్వరగా పట్టుకోవాలి. ఆ బొమ్మ కోసం భూమి కూడా వెతుకుతుంది కదా..? ఆ బొమ్మ కోసం భూమి కూడా వెతుకుతుంది కదా..? త్వరగా భూమి ఆ బొమ్మను చూసేలా ఎక్కడో దగ్గర పెట్టు.
రత్న: అలాగే అమ్మగారు.. కాకపోతే భూమికి కనబడేలా ఆ బొమ్మను నేనెలా పెట్టగలను. అది ఇంట్లో లేదు కదా..?
అపూర్వ: ఇంట్లో లేకపోతే.. అంటే ఆ గగన్ గాడు దాన్ని తీసుకుని హనీమూన్‌కు వెళ్లిపోయాడా..?
రత్న: ఊరుకోండి అమ్మగారు అసలు భూమిని తను పెళ్లే చేసుకోలేదని గగన్ అంటున్నాడు.
అపూర్వ: ఏంటి..? నిజమా..?
రత్న: నిజం అమ్మగారు భూమిని గగన్ అసలు ఇంట్లోకి కూడా రానివ్వలేదట. ఇంటి ముందే రోజంతా నిలబడి రాత్రి వానలో తడిసి స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్ లో జాయిన్ చేశారట. పోనీ హాస్పిటల్ నుంచైనా ఇంటికి రానిచ్చాడా అంటే అదీ లేదు. అటు నుంచే పొమ్మన్నాడట. పోయి ఇక్కడే ఎక్కడో పార్క్ లో కూర్చున్నాడట.. గగన్ చేస్తున్న పని శారదకు నచ్చక శారద కూడా పార్క్ లో కూర్చుందట.
అపూర్వ: సూపర్ న్యూస్ చెప్పావు.. చూడు ఇలాగే ఎప్పటికప్పుడు ఆ ఇంట్లో జరుగుతుందంతా నాకు చెప్తూ ఉండు.. అలాగే నేను చెప్పిన దాన్ని కూడా త్వరగా వెతుకు
రత్న: అలాగే అమ్మగారు
అంటూ కాల్ కట్ చేస్తుంది. పక్కనే ఉన్న నక్షత్ర ఏం జరిగింది మమ్మీ అంటూ అడగ్గానే.. మీ గగన్ బావ ఆ భూమి మెడలో తాళి కట్టలేదట అని చెప్తుంది అపూర్వ. దీంతో నక్షత్ర హ్యపీగా ఫీలవుతుంది. కానీ తర్వాత గగన్ భూమిని ఇంటికి తీసుకుని వస్తాడు. భూమికి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్తుంది శారద. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















