Meghasandesam Serial Today October 30th: ‘మేఘసందేశం’ సీరియల్: శారదకు షాక్ ఇచ్చిన కేపీ అమ్మ – శారద పసుపు కుంకుమలు తీసేయమన్న అత్తయ్య
Meghasandesam serial today episode October 30th: కేపీ వాళ్ల అమ్మ శారద ఇంటికి వచ్చి శారదను పసుకు కుంకాలు తీసేయమని చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: కేపీని చంపేశాననే బాధతో శరత్ చంద్ర రూంలో కూర్చుని ఏడుస్తుంటాడు. అప్పుడే రూంలోకి వచ్చిన అపూర్వ, శరత్ ను చూసి భయపడుతుంది. వెంటనే రూం డోర్ క్లోజ్ చేస్తుంది.
అపూర్వ: అయ్యో బావా.. ఏమైంది బావ..
శరత్: ఇంకేం అవ్వాలి అపూర్వ. నా చెల్లి మీరాను చూస్తుంటే.. గుండె తరుక్కుపోతుంది. ఏమీ తినకుండా అలా పిచ్చిదానిలా తన గదిలో నేల మీద పడుకుని ఏడుస్తుంది అపూర్వ. ఆ చెర్రి గాడైతే నాన్న వచ్చేయ్ నాన్నా నాకెవ్వరూ ఫ్రెండ్స్ లేరని ఏడుస్తున్నాడు అపూర్వ..
అపూర్వ: బావ..
శరత్: ఎప్పుడూ నవ్వుతూ తిరిగే ఆ చెర్రిగాడి ఆనందాన్ని.. ఎప్పుడూ ఆయనే ప్రపంచం అంటూ కేపీ చుట్టు తిరిగే నా చెల్లి ఆనందాన్ని నేనే కదా అపూర్వ తీసేసింది. ఈ చేతుల తోనే కదా కేపీని చంపేసింది.
అపూర్వ: బావ.. ఫ్లీజ్ బావ.. ఎవరైనా వింటే మనకున్న ఈ కొంచెం మనఃశాంతి కూడా పోతుంది బావ. నువ్వేమైనా కేపీని సరదాగా చంపావా..? ఆ కేపీ నన్ను చంపబోతుంటే.. వచ్చి అడ్డుపడి చంపేశావు. లేదంటే నక్షత్రకు ఈరోజు అమ్మ ఉండేది కాదు కదా బావ. ఆ తర్వాత నిన్ను కూడా చంపేవాడు.. ఆ తర్వాత శారద కోసం మన మీరాను కూడా ఈ భూమ్మీద ఉండనిచ్చేవాడు కాదు. బావ చూడు ఏం జరిగినా మన మంచికే అనుకో బావ. ఫ్లీజ్ బావ నాకు మాట ఇవ్వు ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి.
శరత్: సరే అపూర్వ అలాగే.. అలాగే..
అనగానే నీకు తాగడానికి ఏదైనా తీసుకొస్తాను ఉండు అంటూ బయటకు వెళ్తుంది. బయట డోర్ దగ్గర నిలబడి మొత్తం వింటున్న సుజాతను చూసి అపూర్వ షాక్ అవుతుంది. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత గగన్ ఇంటికి కేపీ వాళ్ల వెళ్తుంది. అక్కడ శారదను చూసి విసుక్కుంటుంది. అపూర్వ చెప్పిన మొగుడు పోయిన బాధ కూడా లేకుండా సింగారించుకున్న ఆ శారదను నిందించడం తప్పా అండి అంటూ తిట్టిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంతలో అత్తయ్యను చూసిన శారద నవ్వుకుంటూ దగ్గరకు వస్తుంది.
శారద: అత్తయ్యా ఎప్పుడొచ్చారు..? అయినా ఇక్కడే నిలబడ్డారేంటి..? రండి లోపలికి..
అత్తయ్య: అమ్మా శారద.. నువ్వు ఇలా ఉండటం కరెక్టు కాదమ్మా…? నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. నువ్విలా ఉండటం తప్పు శారద. నీ పసుపు కుంకాలు తీసేయాల్సింది.
అని చెప్పి కొంత మంది ఆడోళ్లను తీసుకొచ్చి శారదను విధవను చేయాలని చూస్తుంది అత్తయ్య. అంతా గమనించిన పూర్ణి. వెంటనే భూమికి ఫోన్ చేస్తుంది.
భూమి: ఏమైంది పూరి ఇప్పుడు ఫోన్ చేశావు..
పూర్ణి: భూమి ఎక్కడున్నావు..
భూమి: బయట ఉన్నాను పూరి.. ఎందుకు ఏమైంది..? చెప్పు..
పూర్ణి: భూమి నాన్నమ్మ ఇంటికి వచ్చింది. ఒక్కతే కాకుండా కొంతమందిని తీసుకొచ్చింది. అమ్మకు బలవంతంగా పసుపు కుంకాలు తీసేయిస్తుంది నాన్నమ్మ.
అని చెప్పగానే.. భూమి షాక్ అవుతుంది. మరోవైపు ఆడాళ్లంతా బలవంతంగా శారదను బయటకు తీసుకెళ్లి పసుపు కుంకుమలు తీస్తుంటారు. ఎక్కడో దూరంలో ఉన్న తాను ఆ కార్యక్రమాన్ని ఎలా ఆపాలా…? అని ఆలోచిస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















