అన్వేషించండి

Meghasandesam Serial Today October 26th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి కోసం మంటపానికి వెళ్లిన ప్రసాద్‌ – భూమి గురించి గగన్‌కు చెప్పబోయిన శారద

Meghasandesam Today Episode:  భూమి, గగన్‌ కొట్టిందన్న నిజం తెలుసుకున్న శారద గగన్‌కు ఫోన్‌ అడగ్గానే కోపంగా ఫోన్‌ కట్‌ చేస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode:   భూమి ఎక్కడ అని అడుగుతాడు. ఇందు పెళ్లి కదా  ఆ ఇంట్లోనే ఉందని చెప్తుంది శారద. దీంతో గగన్‌, భూమి మధ్య జరిగిన గొడవ గురించి చెప్పి భూమిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్లిపోతాడు. వాడి కోపానికి కారణం ఇదా..? అనవసరంగా వాడు భూమిని అపార్థం చేసుకుంటున్నాడు. వాడితో ఒకసారి మాట్లాడాలి అనుకుంటుంది. మరోవైపు గగన్‌ ఆఫీస్‌ బాయ్‌ ని పిలిచి కడుపులో మంటగా ఉంది ఏదైనా మెడిసిన్‌ తీసుకురా అని చెప్తుండగానే శారద ఫోన్‌ చేసి భూమి నిన్ను కొట్టిందటగా అని అడుగుతుంది. దీంతో గగన్‌ ఆ విషయం వదిలేయ్‌ అమ్మా అంటూ ఫోన్‌ కట్‌ చేస్తాడు. మరోవైపు అపూర్వ వాళ్లు పెళ్లి మంటపానికి వెళ్లడానికి రెడీ అవుతుంటారు.

శరత్ చంద్ర: అపూర్వ బయలు దేరుదామా…?

అపూర్వ: ఎలా వెళ్తాం బావ.. ఆ కృష్ణప్రసాద్‌ రాలేదు కదా?

శరత్: ఏం ఏమైంది.

అపూర్వ: ఏముంది. మా మీద కోపంతో బయటకు వెళ్లాడు. ఇంత వరకు రాలేదు. అప్పటికి మీరా బయట కనిపిస్తే బతిమాలింది. ఏదో పని ఉందని వెళ్లిపోయాడు.

శరత్‌: ఎందుకు ఇలా చేస్తున్నాడు. చిన్నపిల్ల తన మీద అలిగి ఇంటికి రాకపోవడం ఏంటి..?

మీరా: పోనీలే అన్నయ్యా ఆయన రాలేదని మంటపానికి వెళ్లకపోతే ఎలా..? అటు వంశీ వాళ్లు బయలుదేరారు అని ఫోన్‌ చేశారు.

అపూర్వ: అయ్యో వాళ్లు బయలుదేరినా మనం వెళ్లలేదు అంటే ఏమనుకుంటారు.

మీరా: అన్నయ్యా నాతో వచ్చేస్తాను అని చెప్పారు అన్నయ్యా.. నిజంగానే వచ్చేస్తారు అనుకున్నాను.

శరత్‌: చ..చ. కృష్ణప్రసాద్‌ రోజు రోజుకు ఎందుకు ఇలా తయారవుతున్నాడు.

బిందు: అదిగో నాన్న వచ్చారు.

  ప్రసాద్‌ వస్తాడు. అపూర్వను కోపంగా  చూస్తుంటాడు. శరత్‌ చంద్ర కోపంగా ప్రసాద్‌ ను తిడుతాడు. దీంతో నేను భూమితో మాట్లాడాలి అని భూమి ఎక్కడుంది అని అడుగుతాడు. దీంతో అపూర్వ కోపంగా అసలు ఇప్పుడు భూమితో ఏం  పని నీకు అంటుంది. భూమి, చెర్రి మంటపం పనులు చూడ్డానికి వెళ్లారు అని శరత్‌ చంద్ర చెప్పగానే ప్రసాద్‌ మంటపానికి వెళ్లబోతుంటే ఇలా కాదు రెడీ అయి రమ్మని అందరూ చెప్పగానే సరేనని రెడీ అవ్వడానికి వెళ్తాడు ప్రసాద్‌.  పెళ్లి మంటపంలో పనులు చేస్తున్న భూమిని చూస్తూ ఉండిపోతాడు చెర్రి.

చెర్రి: నా మువ్వ ఎంత కష్టపడిపోతుంది. ఇదే మంటపంలో మా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో

భూమి: హలో ఏంటి చూస్తున్నారు. పెళ్లికి వచ్చిన పెద్దమనిషిలా అలా నిలబడ్డావు. పెళ్లి పనులన్నీ పూర్తి అయ్యాయో లేదో  చూడు.

చెర్రి: అదే నువ్వు కూడా వస్తే బాగుంటుంది.

భూమి: నేనెందుకు రావాలి..

చెర్రి: అదే వచ్చిన వాళ్లను రిసీవ్‌ చేసుకోవాలి కదా? ఇద్దరం కలిసి రిసీవ్‌ చేసుకుందాం.  

భూమి: నేనెందుకు..?

చెర్రి: మనిద్దరం ఆహ్వానిస్తే బాగుంటుందని..

భూమి: నాకు ఎవరు తెలుసు..?

చెర్రి: ఇప్పుడు పరిచయం అయితే తర్వాత అసలు ఇబ్బంది ఉండదు కదా? చూసిన నలుగురు చూడచక్కని జంట అంటే ఆదో ఆశీర్వాదం కదా?

భూమి: చూడచక్కని జంట ఎవరు..?

చెర్రి: అదే ఇందు.. తనకు కాబోయే భర్త..

 భూమి: ఆ మాట వాళ్లు పీటల మీద కూర్చున్నాక అంటారు. ఇప్పుడెందుకంటారు.

చెర్రి: సరే అలా వచ్చి నా పక్కన నిలబడొచ్చు కదా? బంధువులందరూ పరిచయం అవుతారు.

అని చెర్రి చెప్పగానే నేను ఇక్కడ ఉండాలి. ఆ వచ్చే వాళ్ల సంగతి నువ్వే చూసుకో వెళ్లు అని భూమి చెప్పగానే చెర్రి అక్కడి నుంచి దూరంగా వెళ్లి కూడా భూమినే చూస్తుంటాడు.  ఇంతలో ఇంటి నుంచి అందరూ వస్తారు కృష్ణప్రసాద్‌ కంగారుగా భూమి కోసం వెతుకుతుంటాడు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prakash Raj: ప్రకాష్ రాజ్ JustAsking అంటూ ప్రశ్నలు ఎందుకు అడుగుతారో తెలుసా !
Prakash Raj: ప్రకాష్ రాజ్ JustAsking అంటూ ప్రశ్నలు ఎందుకు అడుగుతారో తెలుసా !
ABP Southern Rising Summit 2024 : మంత్రుల ఫోన్లు సీఎం ట్యాప్ చేస్తున్నారు - రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు వస్తారా ? - ఏబీపీ సదరన్  రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సవాల్
మంత్రుల ఫోన్లు సీఎం ట్యాప్ చేస్తున్నారు - రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు వస్తారా ? - ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సవాల్
ABP Southern Rising Summit 2024 : మధ్యతరగతికి విమాన ప్రయాణం చేరువ చేస్తాం - మోదీ స్వేచ్చ ఇచ్చి పని చేయించుకుంటారు - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
మధ్యతరగతికి విమాన ప్రయాణం చేరువ చేస్తాం - మోదీ స్వేచ్చ ఇచ్చి పని చేయించుకుంటారు - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
ABP Southern Rising Summit 2024 : డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను చాలా ప్రాక్టికల్, కొంచెం సెంటిమెంటల్ కూడా - నటి గౌతమిరేవంత్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేయిస్తున్నాడు - కేటీఆర్ సంచలనంపర్ఫెక్ట్‌గా పాట పాడేవాళ్లు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు - సింగర్ శిల్పా రావువిమానాలకు బాంబ్ కాల్స్, అలా చేస్తే బ్లాక్ లిస్ట్‌లోకే - రామ్మోహన్ నాయుడు వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prakash Raj: ప్రకాష్ రాజ్ JustAsking అంటూ ప్రశ్నలు ఎందుకు అడుగుతారో తెలుసా !
Prakash Raj: ప్రకాష్ రాజ్ JustAsking అంటూ ప్రశ్నలు ఎందుకు అడుగుతారో తెలుసా !
ABP Southern Rising Summit 2024 : మంత్రుల ఫోన్లు సీఎం ట్యాప్ చేస్తున్నారు - రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు వస్తారా ? - ఏబీపీ సదరన్  రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సవాల్
మంత్రుల ఫోన్లు సీఎం ట్యాప్ చేస్తున్నారు - రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు వస్తారా ? - ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సవాల్
ABP Southern Rising Summit 2024 : మధ్యతరగతికి విమాన ప్రయాణం చేరువ చేస్తాం - మోదీ స్వేచ్చ ఇచ్చి పని చేయించుకుంటారు - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
మధ్యతరగతికి విమాన ప్రయాణం చేరువ చేస్తాం - మోదీ స్వేచ్చ ఇచ్చి పని చేయించుకుంటారు - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
ABP Southern Rising Summit 2024 : డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
ABP Southern Rising Summit : జయలలిత చాలా స్వీట్.. అన్నాడీఎంకేలో గౌతమి చేరడానికి ఆమె రీజనా?
జయలలిత చాలా స్వీట్.. అన్నాడీఎంకేలో గౌతమి చేరడానికి ఆమె రీజనా?
Allu Arjun News: నటుడు అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరట, అప్పటివరకూ చర్యలు తీసుకోవద్దన్న ధర్మాసనం
నటుడు అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరట, అప్పటివరకూ చర్యలు తీసుకోవద్దన్న ధర్మాసనం
Asifabad News: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట
Ka Trailer : పగటిపూట 3 గంటలకే చీకటి పడే వింత ఊరు... క్యూరియాసిటీని పెంచేస్తోన్న 'క' ట్రైలర్ 
పగటిపూట 3 గంటలకే చీకటి పడే వింత ఊరు... క్యూరియాసిటీని పెంచేస్తోన్న 'క' ట్రైలర్ 
Embed widget