Meghasandesam Serial Today October 24th: ‘మేఘసందేశం’ సీరియల్: కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కేపీని హాస్పిటల్‌కు తీసుకెళ్లిన కూలీలు – గగన్‌ను తిట్టిన శారద
Meghasandesam serial today episode October 24th: చనిపోయింది కేపీ కాదని తెలియక అందరూ ఎవరిదో శవం ముందు కూర్చుని ఏడుస్తుంటారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: కేపీ చనిపోయాడని శారదకు వాళ్ల అత్త ఫోన్ చేసి చెప్పగానే శారద ఉన్న చోటనే కుప్పకూలిపోతుంది. గట్టిగా ఏడుస్తుంది. శారద ఏడుస్తుండటం చూసి ఆ అరుపుకు లోపల ఉన్న భూమి పరుగెత్తుకుంటూ వస్తుంది.
భూమి: ఏమైంది అత్తయ్యా ఎందుకు ఏడుస్తున్నారు..?
శారద: ఎలా చెప్పాలి భూమి.. నేను ఏమని చెప్పను.. భూమి
భూమి: అదేంటి అత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు.. ఏం జరిగిందో చెప్పండి అత్తయ్యా.. బావ.. బావ ఎక్కడున్నావు.. త్వరగా రా…
శారద ఏడుస్తూనే ఉంటుంది. ఇంతలో భూమి పిలవగానే బయట నుంచి పూర్ణి, శివ వస్తారు. శారద ఏడుస్తూ ఉండటం చూసిన పూర్ణి అమ్మా ఏమైంది అమ్మా.. అంటూ కంగారు పడుతూ అడుగుతుంది. శారద ఏడువడం తప్పా ఏం చెప్పలేదు.. ఇంతలో భూమి మళ్లీ అడుగుతుంది.
భూమి: అత్తయ్య చెప్పండి అసలు ఏం జరిగింది. చెప్పండి అత్తయ్యా..?
శారద: భూమి మీ మామయ్య మనకు ఇక లేరమ్మా.. ఆయన చనిపోయారంట.. ఇప్పుడే డెడ్ బాడీని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారట.. అత్తయ్య ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది భూమి..
అంటూ శారద చెప్తుండగానే.. భూమి కూడా అక్కడే కుప్పకూలిపోతుంది. బోరున ఏడుస్తుంటుంది. పూర్ణి, శివ కూడా ఏడుస్తుంటారు. ఇంతలో బయటి నుంచి గగన్ వస్తాడు. శారద ఏడుపు చూసి కంగారుగా లోపలకు పరుగెత్తుకుంటూ వస్తాడు.
గగన్: అమ్మా ఏమైంది అమ్మా..? ఎందుకు ఏడుస్తున్నావు..
శారద: నాన్న గగన్ మీ నాన్న ఇక లేరుర.. ఆయన చనిపోయారని మీ నాన్నమ్మ ఫోన్ చేసిందిరా..
అంటూ శారద చెప్పగానే.. గగన్ షాక్ అవుతాడు. వెంటనే తేరుకుని గగన్ శారదను ఓదారుస్తాడు. అయినా శారద ఏడుస్తూనే ఉంటుంది.
శారద: నాన్న గగన్ మనం అక్కడికి వెళ్దాం పద నాన్న.. పెద్ద కొడుకుగా ఆయనకు తలకొరివి పెట్టడం నీ ధర్మంరా. వెళ్దాం పదరా..
అంటూ శారద, గగన్ చేయి పట్టుకుని తీసుకెళ్లబోతుంటే.. గగన్ కదలడు..
గగన్: అమ్మా నేను అక్కడికి రావాలి అనుకోవడం లేదు.. నువ్వు వెళ్లు అమ్మా
అని గగన్ చెప్పగానే.. శారద ఏడుస్తూనే గగన్‌ను కన్వీన్స్ చేయాలని చూస్తుంది. మరోవైపు శరత్ చంద్ర షూట్ చేయగానే.. రాళ్ల మధ్యలో పడిపోయిన కేపీ కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటాడు. వేరే బాడీని ఇంటికి తీసుకెళ్లి కేపీ బాడీ అనుకుని అందరూ ఏడుస్తుంటారు. రాళ్ల మధ్య కొన ఊపిరితో కొట్టుకుంటున్న కేపీని అక్కడే పని చేస్తున్న వాళ్లు చూసి హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. మరోవైపు గగన్ న శరత్ చంద్ర ఇంటికి తీసుకెళ్లాలని శారద ప్రయత్నిస్తుంది. గగన్ మాత్రం తాను రానని చెప్తుంటాడు.
గగన్: అమ్మా అక్కడికి నేను రాను.. కానీ నువ్వు వెళ్తానంటే నేను అడ్డుకోను.. నువ్వు వెళ్లాలనుకుంటే వెళ్లు అమ్మ.. నేను అసలు అడ్డు పడను.. పూర్ణిని కూడా తీసుకెళ్లు.. అవసరం అయితే భూమిని కూడా తీసుకెళ్లు కానీ నేను మాత్రం రాను అమ్మ..
శారద: ఒరేయ్ గగన్ నువ్వు ఇంత కఠినంగా ఎప్పుడు మారిపోయావురా..? అక్కడ చనిపోయింది. నీ కన్నతండ్రిరా.?
గగన్: నా కన్న తండ్రి నా దృష్టిలో ఎప్పుడో చనిపోయాడమ్మా..? ఇప్పుడు కొత్త చనిపోవడం ఏంటి..? ఇన్నాళ్లు ఆయన నా దృష్టిలో బతికినా చచ్చిన వాడి కిందే లెక్క.. అయినా ఇవ్వని ఎందుకు అమ్మా నువ్వు వెళ్లాలనుకుంటే వెళ్లు అమ్మ..
అని చెప్పి గగన్ పైకి వెళ్లిపోతాడు. శారద ఏడుస్తూనే ఉంటుంది. కేపీ శవం అనుకుని ఎవరిదో శవం ముందు కూర్చుని చెర్రి, మీరా ఏడుస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















