Meghasandesam Serial Today November 7th: మేఘసందేశం’ సీరియల్: శారదను బంధీగా తీసుకెళ్లిన శరత్ - భూమికి వార్నింగ్ ఇచ్చిన అపూర్వ
Meghasandesam Today Episode: భూమి శాశ్వతంగా కనిపించకుండా వెళ్లిపోతేనే అన్ని సమస్యలు తీరిపోతాయని అపూర్వ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Meghasandesam Serial Today Episode: గగన్ ఇంటికి రివాల్వర్ తో వచ్చిన శరత్‌చంద్ర ఇవాళ ఏ టైంకి అయితే పెళ్లి ఆగిపోయిందో.. రేపు అదే టైంకి పెళ్లి జరగాలి. లేదంటే మిమ్మల్ని చంపేస్తాను అంటాడు. దీంతో శారద సరే అంటుంది. సరే అన్నంత మాత్రాన మిమ్మల్ని ఎలా నమ్మాలి. మునుపటి లా ఊరు వదిలి వెళ్లిపోతే అంటాడు. దీంతో అలా జరగదని మా మీద మీకు నమ్మకం రావాలంటే ఏం చేయాలని శారద అడుగుతుంది. ఈ 24 గంటలు మీరు నా ఆధీనంలో ఉండాలి అని చెప్తాడు. శారద సరేనని నా కొడుకు మీద నమ్మకం ఉందని ఈ 24 గంటల్లో పెళ్లి చేస్తాడని శరత్‌చంద్రతో వెళ్తుంది. గగన్, పూరి ఏడుస్తుంటారు. తర్వాత సుజాత, అపూర్వ ఇద్దరూ శరత్ చంద్ర ఏం చేయబోతున్నాడో అని ఆలోచిస్తుంటారు.
సుజాత: ఏంటమ్మాయి ఆ పిల్ల ఇంకా రాలేదు.
అపూర్వ: వస్తుందిలే.. రాకుండా ఎక్కడికి పోతుంది.
సుజాత: అది రావడం తర్వాత వాడి పేరేంటి ఆ గగన్ వాణ్ని ఏదో చేస్తానని పోయిన మీ ఆయన ఇంకా రాలేదు.
అపూర్వ: నేను అదే చూస్తున్నాను పిన్ని.. బావ వెళ్లిన కోపానికి ఈ పాటికి వాడి చావు వార్త వినిపిస్తుంది అనుకున్నాను.
సుజాత: ఆ ఎవరో చెప్తేనే వినాలా ఏంటి..? ఫోన్ చేసైనా వినొచ్చు కదా..?
అని చెప్పగానే అపూర్వ.. శరత్ చంద్ర కు ఫోన్ చేస్తుంది. ఏం జరిగిందని అడుగుతుంది. వాణ్ని చంపేశావా? ఏంటి అని అడుగుతుంది. దీంతో దారిలో నాకు అడ్డుపడి నా గన్ లో ఆ కృష్ణప్రసాద్ బుల్లెట్స్ తీసేశాడు. అని చెప్పి అక్కడ జరిగింది చెప్పి శారదను ఇంటికి తీసుకొస్తున్నానని చెప్తాడు. దీంతో అపూర్వ షాక్ అవుతుంది.
అపూర్వ: పిన్ని మనం ఒకటనుకుంటే అంత కన్నా గొప్పగా జరుగుతుంది.
సుజాత: నీ మాటల్ని బట్టి మీ ఆయన వాణ్ని ఏమీ చేయలేదని తెలుస్తుంది. ఇంకేం జరిగింది.
అపూర్వ: బావా ఆ శారదను తీసుకొస్తున్నాడు. ఆ గగన్ గాడు వంశీని ఒప్పించి పెళ్లి చేయలేడు. అది జరగలేదంటే శారద బతకదు. అదృష్టం బాగానే వస్తుంది పిన్ని..
ఇంతలో అక్కడకు భూమి పరుగెత్తుకుంటూ వస్తుంది. భూమిని చూసిన సుజాత అమ్మాయి చూడు అంటుంది. భూమిని చూసిన అపూర్వ రారా అంటుంది. వచ్చీ రాగానే భూమి అపూర్వను తిడుతుంది. ఇందును హాస్పిటల్ లో ఉంటే నువ్వేంటి ఇక్కడ ఇలా ఉన్నావు అంటుంది. దీంతో అసలు ఆ కథంతా నడిపించిందే నేను. ఆ వచ్చిన వాణ్ని కూడా పంపించింది నేనే అంటూ మొత్తం చెప్తుంది అపూర్వ. దీంతో భూమి కోపంగా అపూర్వను తిట్టి ఇప్పుడే ఈ విషయం నాన్నకు చెప్తాను అని వెళ్లబోతుంటే.. సాక్ష్యం ఉందా? అని అపూర్వ అడుగుతుంది.
భూమి: ఏం కావాలి నీకు ఎందుకు ఇదంతా చేస్తున్నావు.
అపూర్వ: నువ్వు పోవాలి.. ఈ ఇంటికి దూరంగా మీ నాన్నకు దూరంగా నువ్వు శాశ్వతంగా వెళ్లిపోవాలి. నా ఇల్లు నా కుంటుంబం అనకుండా మళ్లీ ఇటువైపు ఎవ్వరికీ కనిపించకుండా వెళ్లిపోవాలి. నువ్వు లేవన్న విషయం తెలియగానే ఇక్కడ ఇందు పెళ్లి జరుగుతుంది. అక్కడ ఆ పెళ్లి ఆగిపోతుంది.
భూమి: అక్కడ పెళ్లి ఏంటి..?
అపూర్వ: గగన్ గాడిని చంపడానికి వెళ్లిన మీ నాన్న వాడిని చంపకుండా ఆ శారదను తీసుకుని వస్తున్నాడు. ఇక్కడ పెళ్లి జరగకపోతే అక్కడ మా బావ చేతిలో శారదకు పెళ్లి జరుగుతుంది. నువ్వు లేవన్న మరుక్షణం ఇందు పెళ్లి జరుగుతుంది. శారద పెళ్లి ఆగుతుంది.
అని చెప్పి అపూర్వ వెళ్లిపోతుంది. భూమి ఏడుస్తూ ఆలోచనలో పడిపోతుంది. మరోవైపు హాస్పిటల్ లో ఇందు దగ్గర అందరూ ఏడుస్తూ కూర్చుని ఉంటారు. ఇంతలో ఇందు కళ్లు తెరచి చూస్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!