Meghasandesam Serial Today November 18th: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ కు దొరికిపోయిన కేపీ – షాక్ లో శారద, భూమి
Meghasandesam serial today episode November 18th: కేపీ దగ్గరకు వెళ్తున్న శారద, భూమినిలను తానే స్వయంగా కారులో డ్రాప్ చేస్తా అంటాడు గగన్. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: హాస్పిటల్ లో అపూర్వ నుంచి తప్పించుకుని స్టోర్ రూంలోకి వెళ్లి లాక్ చేసుకుంటాడు కేపీ. బయటి నుంచి అపూర్వ బెదిరిస్తుంది. మర్యాదగా డోర్ ఓపెన్ చేయమని వార్నింగ్ ఇస్తుంది. అయితే కేపీ అసలు పట్టించుకోడు.. ఇంతలో అక్కడికి గగన్ వచ్చి అపూర్వను చంపబోతుంటే శారద, భూమి వచ్చి గగన్ ఆపేస్తారు. అపూర్వ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. తర్వాత గగన్ ను తీసుకుని శారద, భూమి ఇంటికి వెళ్లిపోతారు. స్టోర్ రూంలో ఉన్న కేపికి ఫోన్ చేసి చెప్తారు. దీంతో కేపి బయటకు వచ్చి శివాలయం దగ్గరకు వెళ్తాడు. గుడి దగ్గరకు వెళ్లిన కేపీ భూమికి ఫోన్ చేస్తాడు.
కేపీ: అమ్మా భూమి ఎక్కడున్నావు..?
భూమి: మామయ్య మేము ఇంటి దగ్గరే ఉన్నాము మీరు ఎక్కడున్నారు…? మీరు సేఫ్ గానే ఉన్నారు కదా..?
కేపీ: భూమి నేను సేఫ్ గానే ఉన్నాను శివాలయం దగ్గరకు వచ్చాను.. మీరు అర్జెంట్ గా ఇక్కడికే వచ్చేయండి..
భూమి: అలాగే మామయ్య ఇప్పుడే అత్తయ్య నేను బయలుదేరుతాము.. మీరు జాగ్రత్తగా ఉండండి మామయ్య.. మిమ్మల్ని ఎవ్వరూ గుర్తు పట్టకుండా ఒక దగ్గర దాక్కొండి..
కేపీ: సరే భూమి మీరు జాగ్రతగా రండి..
అని చెప్పగానే భూమి ఫోన్ కట్ చేసి శారదకు విషయం చెప్తుంది. శారద వెంటనే రెడీ అయి ఇంటి బయట భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. భూమి కూడా రెడీ అయి బయటకు వెళ్లబోతుంటే.. గగన్ అంతా గమనించి వచ్చి డోర్ దగ్గర అడ్డుగా నిలబడతాడు. గగన్ ను చూసిన భూమి షాక్ అవుతుంది.
భూమి: ఏంటి బావ డోర్‌కు అడ్డుగా నిలబడ్డావు.. ఎందుకు..? ఏమైంది
గగన్: నాకు ఆకలిగా ఉంది కాస్త టిఫిన్ పెడతావా..?
భూమి: అయ్యో టిఫినేగా బావ.. ఈ ఒక్కసారి నువ్వే వడ్డించుకో బావ.. నాకు అర్జంట్ పనుంది వెళ్తాను..
గగన్: అదేం లేదు నువ్వు వడ్డించాల్సిందే నేను తినాల్సిందే..
అంటూ గగన్ చెప్పగానే.. సరే అంటూ వెళ్లి భూమి టిఫిన్ వడ్డించి గగన్‌ను పిలుస్తుంది. గగన్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తాడు.
భూమి: బావ ఇక్కడే పుల్లుగా వడ్డించాను. ఇంకా నీకు ఏదైనా కావాలంటే ఇదిగో ఇక్కడే అన్ని ఉంచాను.. నువ్వే వడ్డించుకుని తిను ఇక నేను వెళ్తాను చాలా టైం అయింది.
గగన్: ఏయ్ ఆగు.. ఇంత మంచి టిఫిన్ చేశావు నువ్వు తినకకుండా వెళితే ఎలా నువ్వు కూడా బాగా టిఫిన్ చేయాలి కదా కూర్చో కూర్చుని నాతో పాటు నువ్వు కూడా టిఫిన్ చేయ్
అని గగన్ చెప్పగానే.. భూమి ఇరిటేటింగ్ గా కూర్చుని గబగబా టిఫిన్ తింటుంది. స్పీడుగా హ్యాండ్ వాష్ చేసుకుని
భూమి: నీతో పాటు కూర్చుని పుల్లుగా టిఫిన్ కూడా చేశాను. ఇప్పుడు నేను వెళ్లొచ్చా బావ
గగన్: ఒకే దర్జాగా వెళ్లిపోవచ్చు..
భూమి: థాంక్యూ సోమచ్
అంటూ భూమి బయటకు వెళ్లి శారదతో కలిసి ఇంటి గేటు దాటుతుంటే ఎదురుగా గగన్ కారు తీసుకుని వస్తాడు. గగన్ ను చూసిన శారద, భూమి షాక్ అవుతారు. గగన్ మాత్రం రండి ఎక్కడికో రండి నేను డ్రాప్ చేస్తాను అంటాడు గగన్ వాళ్లను బలవంతంగా కారులో ఎక్కించుకుంటాడు. ముగ్గురు కలిసి కారులో వెళ్తుంటారు. ఇంతలో భూమికి కేపీ ఫోన్ చేయగానే.. గగన్ ఫోన్ లాక్కుని హలో అంటాడు. ఫోన్‌లో గగన్ వాయిస్ విన్న కేపీ షాక్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















