Meghasandesam Serial Today June 7th: ‘మేఘసందేశం’ సీరియల్: చెర్రికి నక్షత్రకు పెళ్లి చేద్దామన్న శరత్ – షాక్‌లో నక్షత్ర
Meghasandesam Today Episode: వెడ్డింగ్ కార్డులో గగన్ ఫోటో పక్కన తన ఫోటో పెట్టుకున్న నక్షత్రను శరత్ చంద్ర తిట్టి చెర్రితో తన పెళ్లి చేయాలంటాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: తనను హగ్ చేసుకున్న గగన్‌తో తనకు ఒక కోరిక ఉందని అది పెళ్లికి ముందే తీర్చుకోవాలని అడుగుతుంది. ఏంటో అడగమని నీ కోరిక ఏదైనా తీర్చేందుకు ప్రయత్నిస్తానని గగన్ చెప్తాడు.
భూమి: మొన్న నిశ్చితార్తంలో అత్తయ్యా మామయ్య పక్కపక్కనే నిలబడి తాబూలాలు తీసుకుంటుంటే చూడటానికి ఎంత ముచ్చటేసిందో. మీరుగమనించారో లేదో అత్తయ్య ముఖం సంతోషంతో వెలిగిపోయింది.
గగన్: భూమి నీ కోరిక ఏంటో చెప్పు
భూమి: అదే బావ రేపు పెళ్లిలో కూడా అత్తయ్య మామయ్య ఇలాగే కలిసి పెళ్లి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. పెళ్లి పత్రికల్లో కూడా మామయ్య పేరు వేస్తే నిండుగా ఉంటుంది. పెళ్లిలో కూడా మీ ఆయన ఏరి అన అత్తయ్యను ఎవ్వరూ అడగరు. పెళ్లి కొడుకు తండ్రి ఎక్కడ అని ఎవ్వరూ అడగరు.
గగన్: ఏయ్ (అంటూ గగన్ కోపంగా భూమి మీదకు చెయ్యి ఎత్తుతాడు.) ఇంకొక్కసారి ఈ ప్రస్తావన తెస్తే చంపేస్తాను.
అంటూ కోపంగా వెళ్లిపోతాడు గగన్. భూమి భయంతో ఏడుస్తుంది. ఇంతలో శరత్ చంద్ర భూమి అనుకుంటూ వస్తాడు.
శరత్: భూమి ఏమైందమ్మా ఎందుకు అలా అరిచావు..
భూమి: ఏం లేదు నాన్నా..?
సుజాత: అయ్యయ్యో సిగ్గు పడుతుంది అంటేనే మనం అర్తం చేసుకోవాలి అల్లుడు గారు.
అనగానే అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. నక్షత్ర మాత్రం దగ్గరకు వెళ్తుంది.
నక్షత్ర: నిజం చెప్పు భూమి మీ మధ్య అసలు ఏం జరిగింది.
భూమి: గోరింటాకు ఆంటీ అంత విడమరిచి చెప్పినా అర్తం కాలేదా..?
నక్షత్ర: ఏయ్ నటించకు.. బావ సీరియస్‌గా వెళ్లడం నేను చూశాను.
భూమి: అంటే కొంచెం మోటు సరసం నాకు ఇష్టం లేదంటే కోపం వచ్చి వెళ్లిపోయారు. ఇంకా వివరంగా చెప్పమంటే చెప్తాను. వయసులో ఉన్నావు.. విని తట్టుకోగలవా..?
అనగానే నక్షత్ర తిట్టుకుంటూ వెళ్లిపోతుంది. భూమి ఏడుస్తూ కూలబడిపోతుంది. గగన్ కోప్పడిన విషయమే గుర్తు చేసుకుంటుంది. తర్వాత సాధన డబ్బులు తీసుకుని అపూర్వను కలుస్తుంది. తాను ఇచ్చిన డబ్బుకు రెట్టింపు తీసుకొచ్చి అపూర్వకు ఇస్తుంది. తనకు భూమి అడ్డు పడుతుందని రెస్టారెంట్‌లో జరిగిన విషయం చెప్తుంది. మీరు తనను ఆపాలని చెప్తుంది. దీంతో ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తారు. భూమి డాన్స్ అకాడమి పెట్టకుండా చూసే బాధ్యత తనది అని చెప్తుంది. మరోవైపు భూమి బాధగా శోభా చంద్ర ఫోటో దగ్గరకు వెళ్లి ఎమోషనల్ అవుతుంది.
తర్వాత భూమి పెళ్లి పత్రికలో నక్షత్ర తన ఫోటో పేస్ట్ చేస్తుంది. అదే కార్డును శరత్ చంద్ర తీసుకుంటాడు.
శరత్: కేపీ నా కూతురు భూమి పెళ్లి మొదటి పత్రికను నీకు మా చెల్లికి ఇవ్వాలనుకుంటున్నాను.
సుజాత: అల్లుడు గారు కార్డు ఇచ్చే ముందు దాన్ని ఒకసారి తెరచి ఎలా ఉందో చూడండి
అని చెప్పగానే శరత్ చంద్ర కార్డు ఓపెన్ చేసి చూసి కోపంగా నక్షత్రను పిలుస్తాడు. నక్షత్ర వచ్చి ఏమైంది డాడీ అని అడుగుతుంది. ఏం చేశావో తెలిసి కూడా మళ్లీ ఏమైందని అడుగుతున్నావా..? అంటాడు. దీంతో అందరి ముందు శరత్ చంద్ర నక్షత్రను తిట్టి వెడ్డింగ్ కార్డు అందరికీ చూపిస్తాడు. ఇంతలో చెర్రికి ఇచ్చి నక్షత్రను పెళ్లి చేయాలని చెప్తాడు శరత్ చంద్ర దీంతో నక్షత్ర షాక్ అవుతుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















