Meghasandesam Serial Today June 5th: ‘మేఘసందేశం’ సీరియల్: డాన్స్ అకాడమి పెట్టిస్తానన్న గగన్ - హ్యాపీగా ఫీలయిన భూమి
Meghasandesam Today Episode: భూమిని తీసుకుని రూంలోకి వెళ్లిన గగన్‌తో తనకు అకాడమీ పెట్టించమని అడుగుతుంది. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: మీరా ఇందుకు ఫోన్ చేసి పెళ్లి పనులు మొదలయ్యాయి కదా అత్తయ్యా నిన్ను రమ్మంటుంది అని చెప్తుంది. దీంతో ఇందు తాను రానని చెప్తుంది. దీంతో ఎందుకు రావని అడుగుతుంది మీరా. దీంతో తాను శారద వాళ్ల ఇంటికి వెళ్తున్నానని పెద్దమ్మ నన్ను పిలవకపోయినా నేనే అక్కడికి వెళ్తున్నాను అని కరాకండిగా చెప్తుంది. దీంతో మీరా ఏడుస్తుంది. అపూర్వ లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడమని చెప్తుంది.
మీరా: అమ్మను నేను పిలుస్తున్నా రానంటున్నావు ఏం మందు పెట్టిందే అది నీకు.
ఇందు: అమ్మా అనవసరంగా పెద్దమ్మను అనకు. అవును పెద్దమ్మ మందే పెట్టింది. ఆ మందు పేరు అమ్మప్రేమ. అయినా ఆ ఇల్లు ఈ ఇల్లు ఏంటమ్మా..? గగన్ అన్నయ్య పెళ్లితో రెండు ఇండ్లు ఒక్కటై పోతున్నాయి కదా..?
మీరా: పెళ్లయినా ఆ దేవుడే దిగొచ్చి కలపాలనుకున్నా..? రెండిళ్లు ఒక్కటి కావు. నోరు మూసుకుని ఇక్కడకు రా..?
ఇందు: నేను రానమ్మా..?
అంటూ ఫోన్ కట్ చేస్తుంది.
మీరా: చూశావా వదిన ఆయన లాగే పిల్లలు కూడా చేజారిపోతున్నారు.
అపూర్వ: మీ ఆయన లాగే నీ పిల్లలు కూడా ఈ ఇంటి పరువు తీయాలనుకుంటున్నారు. ఉండు నేను చెప్తాను.
అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది అపూర్వ. ఇందు వెంటనే శారదకు ఫోన్ చేస్తుంది.
శారద: అమ్మా ఇందు ఎలా ఉన్నావు తల్లి..
ఇందు: నేను బాగున్నాను పెద్దమ్మా మీరెలా ఉన్నారు.
శారద: బాగున్నాను అమ్మా..
ఇందు: పెద్దమ్మ పసుపు దంచే కార్యక్రమం మొదలు పెట్టేశారా..?
శారద: ఇంకా లేదు. ముత్తైదువులను పిలిచాను వాళ్లు వస్తున్నారు.
ఇందు: అయితే నేను కూడా వస్తున్నాను.
శారద: నువ్వా.. మీ అమ్మకు తెలిస్తే మళ్లీ గొడవ చేస్తుందేమో..?
ఇందు: ఏమీ అనదులే పెద్దమ్మ.. తనే ఇంటికి రానని ఫోన్ చేసింది. నేను మీ ఇంటికి వస్తున్నానని అమ్మతో చెప్పేశాను. నేను వస్తున్నాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను.
అంటూ ఫోన్ కట్ చేసి వంశీని పిలుస్తూ లోపలికి వెళ్తుంది. ఇంతలో అపూర్వ వస్తుంది. అపూర్వను చూసిన వెంకటేష్ కంగారుగా బయటకు వెళ్లి స్వాగతం పలుకుతాడు. అపూర్వ కోపంగా తిడుతూ లోపలికి ఇందు దగ్గరకు వెళ్తుంది. ఇంటికి వెళ్దాం పదా అంటూ ఇందును పిలుస్తుంది. ఇందు రానని చెప్తుంది. దీంతో అపూర్వ, ఇందు మధ్య గొడవ జరుగుతుంది. ఇద్దరి మధ్య కట్నకానుకల గురించి గొడవ జరగుతుంది. గొడవలో అపూర్వ కోపంగా ఇందును కొడుతుంది. బలవంతంగా ఇందును తీసుకెళ్లబోతుంటే.. వెంకటేష్ అడ్డు పడతాడు. అయినా వినకుండా బలవంతంగా తీసుకెళ్తుంది అపూర్వ. తర్వాత హల్దీ పంక్షన్ జరుగుతుండగా గగన్ వస్తాడు. భూమిని తీసుకుని లోపలికి వెళ్తుంటే.. అందరూ వెనకే వస్తారు.
గగన్: ఒక్క నిమిషం అదేంటి మాకు ప్రైవసీ కావాలని మేము వచ్చాము. మా వెనకే మీరు వస్తున్నట్టు. చిన్నత్తయ్యా పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ ఉంటుంది కదా అది ఏ రూంలో చేస్తారు.
అపూర్వ: పైన రూంలో చేస్తాం..
గగన్: ఆ రూం ఆట్మాస్పియర్ మాకు అలవాటు కావాలి కదా..? రా భూమి అక్కడికి వెళ్లి మాట్లాడుకుందాం. వెళ్లొస్తాం మామయ్యా
అంటూ భూమిని తీసుకుని పైకి వెళ్తాడు గగన్. శరత్, అపూర్వ ఇరిటేటింగ్ గా చూస్తుంటారు. లోపలికి వెళ్లిన భూమి, గగన్‌తో డాన్స్ అకాడమి గురించి మాట్లాడుతుంది. దీంతో మన ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను డాన్స్ అకాడమీ ఏర్పాటు చేయించే బాధ్యత నాది అని మాటిస్తాడు గగన్. భూమి హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















