Meghasandesam Serial Today June 18th: ‘మేఘసందేశం’ సీరియల్: కేపీ బోణం ఎత్తిన శారద – పామును చూసి భయపడిపోయిన మీరా
Meghasandesam Today Episode: కేపీ కోసం బోణం ఎత్తుకుని కొండమీద అమ్మవారి దగ్గరకు వెళ్తున్న శారద, మీరాకు పాము ఎదురు వస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: ఐసీయూలో ఉన్న కేపీని చూడటానికి శారద వస్తుంది. శారదను చూసిన మీరా కోపంగా తిడుతుంది. ఇక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకేసిన చంపేస్తానని బెదిరిస్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. శారద ఏడుస్తుంది.
చెర్రి: అమ్మా ఈ టైంలో గొడవలు అవసరమా..?
మీరా: నువ్వు నోరు ముయ్యరా..? ఆవిడ మీ అందరికీ ఏం మందు పెట్టిందో తెలియదు. మీరు అందరూ ఈవిడ తరపునే మాట్లాడుతున్నారు. నేను ఇవాళ ఈవిడతో మాట్లాడుతున్నాను. మధ్యలో మీరు ఎవ్వరైనా అడ్డొస్తే బాగుండదు.
భూమి: అత్తయ్యా ఏమైనా ఉంటే ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం. ఇక్కడ గొడవ అవసరమా..?
మీరా: గొడవ కాదు భూమి. ఇది నా జీవన్మరణ సమస్య. అటు మా ఆయన బతుకుతో పోరాడుతుంటే.. ఇక్కడ నేను బతుకు కోసం పోరాడుతున్నాను. ఆయిన నువ్వు ఆ ఇంటికి వెళ్లిపోయే కోడలివే కదా..? ఈ మేనత్త బతుకు ఏమైపోతే నీకేంటి..? అటు వైపే మాట్లాడతావు.
శారద: మీరా అందర్ని నిందించడం ఎందుకు నువ్వు ఏం అడగాలో అడుగు. నేను నీకు సమాధానం చెప్తాను.
మీరా: ఇప్పుడు సరైన ప్రశ్న అడిగావు. చెప్పు నువ్వు మా ఆయనకు పిల్లలకు ఏ మందు పెట్టుకుని నీ వైపు తిప్పుకున్నావో చెప్పు. కుదిరితే నాకు కొంచెం ఇవ్వు నేను నా వైపు తిప్పుకుంటాను.
గగన్: చిన్నమ్మా.. మా అమ్మ మీద లేనిపోని నిందలు వేస్తే నేను చూస్తూ ఊరుకోను.
మీరా: చూడు బాబు గగన్ నువ్వు మా ఇంటికి కాబోతున్న అల్లుడివి నీకు ఇవ్వాల్సిన గౌరవం నీకు ఇస్తాను. కనుక నువ్వ మధ్యలోకి రాకు. ఇక మీ అమ్మ నాకు సవతి అడిగే హక్కు నాకుంది.
గగన్: ఉంది కదా అని ఏది పడితే అది అడిగితే బాగుండదు. మందులు పెట్టి మనసుల మార్చే మనుషులం మేము కాదు.
భూమి: బావ ఫ్లీజ్ కాసేపు సైలెంట్‌గా ఉండండి. మీరైనా అర్థం చేసుకోండి బావ గొడవలు వద్దు.
మీరా: సరే మీ అబ్బాయి చెప్పినట్టే మీరు ఆయనకు మందు పెట్టలేదు. మాకు చెప్పొద్దు. పోనీ నాలో లేనిది నీలో ఆయనేం చూశారో కానీ ఇన్నాళ్లు మమ్మల్ని పట్టించుకోలేదు. ఏం చేసినా మాతో కలిసే ఉన్నారు కదా అని ఏమీ అనలేదు. మరి ఈ మధ్య కొత్తగా ఏం చెప్పావు శారద.
శారద: నేనేం చెప్తాను మీరా.. నేను ఆయనతో మాట్లాడనే లేదు.
మీరా: మాట్లాడలేదు అంటే నమ్మేస్తారు మరి. ఏవండి మీరు ఆ ఇల్లు వదిలేసి మీ ఇంటికి వచ్చేయండి. కొడుకు పెళ్లి అవుతుంది కదా ఆ పెళ్లిలో మీరు నా పక్కన నిలబడండి అని చెప్పి ఉంటావు. అందుకే ఇన్ని సంవత్సరాలు లేనిది ఆయన కొత్తగా ఇవాళ నన్ను విడాకులు అడిగారు. నేను ఇవ్వను అనే సరికి ఇదిగో ఇక్కడ చావు బతుకుల మధ్య ఇక్కడ ఉన్నారు.
గగన్: చాలు చిన్నమ్మా.. చాలు.. ఇంత వరకు మీరు మాట్లాడింది చాలు. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడిస్తే మీరు నమ్మిందే నిజం అనే భ్రమలో పడిపోతారు.
భూమి: బావ ఫ్లీజ్.. ఆగండి..
గగన్: ఆగు భూమి నేను మీ అత్తయ్యతో గొడవ పడటం లేదు. సమాధానం ఇస్తున్నాను. ఏమన్నారు చిన్నమ్మా..? మీ ఆయన మా ఇంటి చుట్టూ తిరిగారనా..? తిరిగారు కానీ ఇదిగో ఇలా అందరి ముందు అవమానాలకు గురిచేసేవారు కాదు. ఇంకా ఏమన్నారు.
అంటూ గగన్ కోపంగా కేపీని తిట్టి శారదే విడాకులు అడిగిందని విడాకులు ఇవ్వమంటే ఇవ్వకుండా మమ్మల్ని ఏడిపించింది మీ ఆయనే అంటూ తిడుతుంటే మీరా కొత్త నాటకాలు ఆడుతున్నారా అంటూ నిలదీస్తుంది. దీంతో గగన్ వెంటనే డైవర్స్ పేపర్స్ తీసుకొచ్చి శారదతో సంతకం చేయిస్తుంటే.. డాక్టర్ వచ్చి కేపీ డేంజర్ లో ఉన్నాడని ఇక మీరు దేవుడి మీదే భారం వేయండి అని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత శారద గుడికి వెళ్తుంది. అక్కడ స్వామిజీ కొండ మీది అమ్మవారికి మొక్కు తీర్చుకుంటే కేపీ బతికే చాన్స్ ఉందని చెప్తాడు. దీంతో శారద, మీరా ఇద్దరూ మొక్కు తీర్చుకోవడానికి బోణం ఎత్తుకుని వెళ్తుంటారు. మధ్యలో పాము వస్తుంది. మీరా బోణం కింద పడిపోతుంది. భూమి వెళ్లి పామును పక్కకు వెళ్లేలా చేస్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















