Meghasandesam Serial Today January 3rd: ‘మేఘసందేశం’ సీరియల్: ఎస్పీ సూర్య సస్పెండ్ - భూమికి వార్నింగ్ ఇచ్చిన సూర్య
Meghasandesam serial today episode January 3rd: డీజీపీ దగ్గరకు వెళ్లి ఎస్పీ సూర్యను సస్పెండ్ చేయిస్తుంది భూమి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: గగన్ ను ఫాలో కమ్మని ఒక వ్యక్తిని పురమాయిస్తుంద భూమి. ఆ వ్యక్తి గగన్ ను ఎస్పీ సూర్య అరెస్ట్ చేయడం చూసి ఒక వీడియో తీసి ఉంటాడు. ఆ వీడియో తీసుకుని భూమికి ఇవ్వడానికి వెళ్తాడు. ఇంటికి వచ్చిన ఆ వ్యక్తిని చూసి భూమి షాక్ అవుతుంది.
భూమి: మిమ్మల్ని ఎప్పుడూ మా ఇంటికి రావొద్దని చెప్పాను కదా..? ఎందుకొచ్చారు..?
వ్యక్తి: మీ వారు ఇంట్లో లేరని తెలిసే వచ్చాను మేడం.
భూమి: అదేంటి మీకు ఎలా తెలిసింది…?
వ్యక్తి: అదేంటి మేడం మీరే కదా మీ వారిని ఫాలో అవ్వమని చెప్పింది. ఆయన్ని ఫాలో అవుతున్న నాకు ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో నాకు తెలియదా..? మేడం.. మీ వారిని బుక్ చేయడానికి ఆ ఎస్పీ సూర్య మాస్టర్ ప్లాన్ వేశాడు మేడం..
అంటూ అమ్మాయి కిడ్నాప్ డ్రామా జరిగినప్పడు తాను చూసింది. తాను వీడియో తీసింది మొత్తం భూమికి చెప్తాడు.
భూమి: అవునా..? చాలా థాంక్స్..
వ్యక్తి: మీ వారిని ఆ ఎస్పీ సూర్య అరెస్ట్ చేసి అత్యంత క్రూరంగా కొట్టాడు మేడం. నా ఊహే నిజమైతే ఆ ఎస్పీ సూర్య ఇప్పటికీ మీ వారిని కొడుతుంటాడు మేడం. కొట్టి కొట్టి చంపేయడం ఆ ఎస్పీ స్కెచ్ అని నేను బలంగా నమ్ముతున్నాను. మీరు అర్జెంట్‌గా మీ వారిని విడిపించుకోవాలి. లేదంటే ఆయన మీకు దక్కకపోవచ్చు మేడం.
అని చెప్పగానే.. భూమి ఆలోచనలో పడిపోతుంది. వెంటనే ఆ వ్యక్తి దగ్గర ఉన్న వీడియో తన ఫోన్ లోకి సెండ్ చేసుకుంటుంది. ఆ వీడియో తీసుకుని కేపీకి ఫోన్ చేసి డీజీపీ ఆఫీసుకు వెళ్తుంది. అక్కడ డీజీపీని కలిసి ఎస్పీ సూర్య మీద కంప్లైంట్ ఇస్తుంది. దీంతో డీజీపీ ఎస్పీ సూర్యను పిలిపిస్తాడు. సూర్య డీజీపీ ఆఫీసుకు వస్తాడు.
డీజీపీ: మిస్టర్ సూర్య నువ్వు శరత్ చంద్ర గారి అల్లుడు గగన్ ను అక్రమంగా అరెస్ట్ చేశావని.. తన భార్య భూమి వాళ్ల నాన్న కృష్ణ ప్రసాద్ గారు అంటున్నారు..? అనడమే కాదు నీ మీద కంప్లైంట్ కూడా చేశారు.
సూర్య: నేను అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటి..? సార్.. ఆ గగన్ తప్పు చేస్తుంటేనే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాను..
భూమి: అసలు మా వారు ఏ తప్పు చేయలేదు సార్. ఈ ఎస్పీ గారే కావాలని మా వారిని కేసులో ఇరికిస్తున్నారు..
సూర్య: లేదు సార్ పట్టపగలే ఆ గగన్ వీణాగాయత్రి అనే అమ్మాయిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడు. అప్పుడే నేను అదే రూట్‌లో వెళ్తున్నాను. నా కళ్లారా నేను చూశాను. అక్కడికి వెళ్లి గగన్‌ను ఆపేశాను. ఆ అమ్మాయి కూడా కంప్లైంట్ ఇచ్చింది సార్. అప్పుడే నేను ఆ గగన్‌ను అరెస్ట్ చేశాను.
భూమి: నమ్మించే సాక్ష్యం ఉంటే అప్పుడు నమ్ముతారా..? సార్
అంటూ భూమి తన ఫోన్ లో ఉన్న వీడియో డీజీపీకి చూపిస్తుంది. అందులో కావాలనే కిడ్నాప్ డ్రామా ఆడి సూర్య, గగన్ ను అరెస్ట్ చేశాడని డీజీపీకి తెలుస్తుంది. దీంతో డీజీపీ కోపంగా వెంటనే ఎస్పీ సూర్యను సస్పెండ్ చేస్తాడు. సస్పెండ్ అయిన సూర్య బయటకు వచ్చి నన్ను ఉద్యోగంలోంచి తీయించేసి మంచి పని చేశావు భూమి.. నా వేట ఎంత కిరాతకంగా ఉంటుందో మీకు తెలుస్తుంది ఇక అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు సూర్య. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















