Meghasandesam Serial Today January 13th: ‘మేఘసందేశం’ సీరియల్: శివను కట్టేసి చంపబోయిన అపూర్వ – సడెన్ గా వచ్చి సేవ్ చేసిన గగన్
Meghasandesam serial today episode January 13th: బిందు కోసం శరత్ చంద్ర ఇంటికి వెళ్లిన శివ ఇంట్లో వాళ్లకు దొరికిపోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: బిందు ఎగ్జామ్ రాసి వెళ్లిపోతుంటే.. వెనకే శివ కూడా తన పేపర్స్ ఇచ్చేసి పరుగున బిందు వెనకాలే వెళ్తాడు. బిందును పిలుస్తూ వెళ్లినా.. బిందు విననట్టు వెళ్లిపోతుంది. వెంటనే శివ పరుగున బిందు దగ్గరకు వెళ్లాడు.
బిందు: వద్దు శివ నువ్వు నాతో మాట్లాడటానికి ట్రై చేయకు నాకు కాపలాగా మా అత్తయ్యా తన పిన్ని గోరింటాకును పంపించింది. తను చూసింది అంటే నా కొంప మునుగుతుంది.
శివ: అది కాదు బిందు.. నిన్ను మీ ఇంట్లో బంధించేశారు. నిన్ను బయటకు తీసుకొచ్చే ఆ ఒక్క అవకాశం కూడా మిస్ అయిపోయింది. మళ్లీ వస్తే గ్యారంటీగా మీ వాళ్లు నన్ను పట్టేసుకుంటారని నేను రాలేదు. మనం కలిసే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఈ అవకాశాన్ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి. మనం ఇటు నుంచి ఇటే ఎక్కడికైనా వెళ్దాం బిందు.
బిందు: సరే శివ మా గోరింటాకు కూడా ఎక్కడ కనిపించడం లేదు. నువ్వు చెప్పినట్టు ఎక్కడికైనా వెళ్లిపోదాం.. కానీ ఎంత దూరం తీసుకెళ్తావు శివ. నీ జేబులో ఎంత డబ్బులు ఉన్నాయి. మాగ్జిమం మా వాళ్లకు మనం రెండు రోజుల్లో దొరికేస్తాం.. అలా దొరక్కూడదు అంటే మనం ఊరు దాటడం కాదు.. దేశమే దాటాలి. అంత డబ్బు నీ దగ్గర ఉందా..? శివ.. ఏంటి శివ ఏం మాట్లాడవేంటి..?
శివ: అంత డబ్బు అంటే.. అంత డబ్బులు చదువుకునే వయసులో మన దగ్గర ఎక్కడు ఉంటాయి బిందు..
బిందు: ఈ రియాలిటీ.. మా అత్తయ్యా నన్ను నాలుగు రోజులు ఇంట్లో బంధిస్తే కానీ అర్థం కాలేదు. ప్రేమకు అడ్డురాని మనం చదువుకునే వయసు మనం లేచిపోయి బతకడానికి ఎంత అడ్డుగా నిలబడిందో చూడు. నన్ను మర్చిపో శివ నేను వస్తాను.
శివ: ఆగు లాజికల్ గా మహా తెలివిగా మాట్లాడి తప్పించుకుని వెళ్లిపోదాం అనుకున్నావా ఏంటి..? ఏం ఆ లాజిక్ తెలివి నా దగ్గర లేవా..? దేశం దాటిపోతే మీ వాళ్లకు పట్టుకుని తీసుకు రావడం ఈజీ. మనదేశంలో సీసీ కెమెరాలు లేని స్లమ్ ఏరియాలు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్లి ట్యూషన్లు చెప్పుకుని అదీ కాకపోతే కూలి చేసైనా బతకొచ్చు.. ప్రేమ కోసం నువ్వు రిస్క్ చేయలేవా..? ఇప్పుడు నాతో రాలేవా..?
బిందు: రాలేను శివ. దొరికితే మా వాళ్లు నన్ను చంపేస్తారు. నీకోసం నా ప్రాణాన్ని నేను రిస్క్ లో పెట్టలేను.
శివ: ఇంత పిరికిదానివి మరి నన్నెందుకు ప్రేమించావు.. నీ భయంతో నన్ను బాధించడానికేనా..? నీ ప్రేమను నమ్మి ఇంత మోసంపోతాను అనుకోలేదు. నువ్వు నేర్పిన గుణపాఠాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రేమ అనే పదాన్ని ఇక నేను ఎప్పటికీ నమ్మను..
అంటూ చెప్పి వెళ్లిపోతాడు శివ. ఇంతలో వెనక నుంచి వచ్చిన పూరి కోపంగా బిందును తిడుతుంది. శివ నాకు కాబోయే భర్త. త్వరలోనే మా ఇంట్లో ముహూర్తాలు చూడబోతున్నారు అని చెప్పి వెళ్లగానే బిందు ఏడుస్తుంది. ఇంతలో సుజాత వచ్చి బిందును తీసుకుని వెళ్లిపోతుంది. తర్వాత బిందు కోసం అపూర్వ వాళ్ల ఇంటికి వెళ్తాడు శివ. శివను అందరూ చూస్తారు. అపూర్వ, శివను కుర్చీకి కట్టేసి కరెంట్ షాక్ ఇవ్వబోతుంటే.. గగన్ వచ్చి శివను సేవ్ చేస్తాడు. అపూర్వ, శరత్ చంద్రకు గగన్ వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















