అన్వేషించండి

Meghasandesam Serial Today February 21st: ‘మేఘసందేశం’ సీరియల్‌: శివ, పూర్ణిల పెళ్లి ముహూర్తం ఫిక్స్ – బాధలో శివ

Meghasandesam serial today episode February 21st: పెళ్లి కోసం లగ్నపత్రిక రాసుకోవడంతో శివ బాధపడుతుంటాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: గగన్‌ పంతులును పిలిస్తాడు. పంతులు వచ్చి పెళ్లి ముహూర్తాలు చూస్తుంటాడు.  ఇంతలో భూమి పై నుంచి శివను తీసుకుని కిందకు వస్తుంది. శివ డల్లుగా కూర్చుని ఉంటాడు. అది చూసి భూమి ఆశ్చర్యపోతుంది.

శివ: ఒరేయ్‌ ప్రేమించిన అమ్మాయితో పెళ్లి ముహూర్తాలు ఖాయం చేస్తుంటే సిగ్గుతో అలా కూర్చుంటావేంట్రా..? కాస్త నవ్వరా..? అయ్యో ఏమైందిరా నీకు నీ నవ్వు కూడా రావాలా వద్దా అన్నట్టు అంత మొహమాటంగా బయటకు వస్తుంది.

పంతులు: అయ్య గగన్‌ గారు మీ చెల్లెలికి శివ గారికి జతకూర్చే మూడు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. అమ్మగారిని చెల్లెలు గారిని పిలిస్తే ఆ ముహూర్తాలు చెప్తాను.

గగన్‌: అమ్మా అమ్మా పూరిని తీసుకుని వచ్చేయ్..

అని గగన్‌ పిలవగానే.. శారద లోపలి నుంచి ఆ వస్తున్నానురా..? నీకు అన్నింటికి కంగారే.. అంటూ పూర్ణిమను తీసుకుని వస్తుంది. వాళ్లను చూసిన భూమి, గగన్‌ ఆశ్చర్యపోతారు.

భూమి: ఒరేయ్‌ చూడరా..? నీకు కాబోయే శ్రీమతి నీ మతి పోగోట్టేంతగా రెడీ అయింది. (అని చెప్పగానే.. శివ అఇష్టంగానే తిరిగి చూస్తాడు. పూర్ణి స్థానంలో శివకు బిందు కనిపిస్తుంది. దీంతో పట్టలేనంతా ఆనందంగా చూస్తుంటాడు.) కన్ను కూడా కదపడం లేదంటే నిన్ను నువ్వు మర్చిపోయినట్టు ఉన్నావు.

శివ: అవును అక్కా.. బిందు చాలా బాగుంది.

భూమి షాక్‌ అవుతుంది.

భూమి: ఏంటి..? ఏమన్నావు..

శివ: అదే అక్కా.. చాలా బాగుంది అంటున్నాను..

పూర్ణి, శారద కిందకు వస్తారు.

గగన్: అదిగోండి మా ఇంటి బంగారం.. మీరేం చెప్పాలనుకున్నా భూమికి చెప్పండి. అంటే అది భూమి నా భార్య కావొచ్చు కానీ ఈ పెళ్లి విషయానికి వచ్చేసరికి భూమి మగ పెళ్లి వారి తరపున పెద్ద అన్నమాట. మన సాంప్రదాయం ప్రకారం మగపెళ్లివారు ఉండగా అన్ని ఆడపెళ్లి వారికే చెబితే అది మగపెళ్లివారిని అవమానించినట్టు అవుతుంది. అంతే కదా పంతులు గారు.

పంతులు: అంతేనండి భూమి గారు మీ భార్య అయినప్పటికీ ఆడపెళ్లివారు, మగపెళ్లి వారు అన్న సంప్రదాయాన్ని పాటించడం చాలా ఆనందంగా ఉంది. అమ్మా భూమి మొత్తానికి మూడు ముహూర్తాలు కాయం చేశాను. ఒకటైతే మహా స్పీడుగా వచ్చేస్తుంది. వచ్చే శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నలభై అయిదు నిమిషాలకు ఇంత త్వరగా పెళ్లి పనులు చక్కబెట్టుకోవడం కష్టం అనుకుంటే మరొకటి వచ్చే నెల 18వ తేదీన, ఇంకొకటి 30వ తేదీన ఉన్నాయి. ఏది ఖాయం చేస్తారో చెబితే ఆ ముహూర్తానికి లగ్న పత్రిక రాస్తాను.

భూమి: మీరు చెప్పండి బావ. ఏది ఖాయం చేద్దాం అంటారు.

గగన్‌: అరే ఇప్పుడే కదా చెప్పాను. అది మగపెళ్లివారి ఇష్టం నువ్వే ఖాయం చేయ్‌ భూమి. పెళ్లి ముహూర్తాలు పెట్టడం దగ్గర నుంచి శివ పూరి మెడలో తాళి కట్టే వరకు అంతా నీదే బాధ్యత. అన్ని నువ్వే దగ్గర ఉండి చూసుకోవాలి.

భూమి: మీరు ఏంటో మీరు మరీ నా మీద భారం పెట్టేస్తున్నారు బావ. కాకపోతే మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను. పంతులు గారు వచ్చే శుక్రవారం ముహూర్తమే కాయం కానివ్వండి.

శారద: వారం రోజులే ఉంది భూమి. ఈలోగా అన్ని పనులు ఎలా చేస్తాము..

భూమి: ఇందులో సర్దుకోవడానికి ఏముంది అత్తయ్య.. అబ్బాయి, అమ్మాయి మన ఇంటి వారే పెట్టిపోతలు పట్టింపులు అని మన మధ్య ఏముంటాయి. మన ముగ్గురం అనుకున్నామంటే అన్ని ఇలా చిటికెలో అయిపోతయి.

గగన్‌: భూమి చెప్పిందంటే అయిపోతాయి అమ్మ. అంటే భూమి మీద నాకు నమ్మకం ఉందని చెప్తున్నాను.

శారద: నీకు ఉన్న నమ్మకం నాకు లేదా ఏంటి..? సరే అలాగే కానిచ్చేద్దాం. వచ్చే శుక్రవారం పెళ్లి ముహూర్తమే ఖాయం చేద్దాం..

పంతులు: శుభం ఇక అదే మూర్తానికి రాస్తాను ( లగ్న పత్రిక రాస్తాడు.) అమ్మా భూమి ఈ లగ్న పత్రిక తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టమ్మా..?

భూమి: సరే పంతులు గారు..

అంటూ లగ్న పత్రిక తీసుకెళ్లి దేవుడి ముందు పెట్టి మొక్కుతుంది. ఇంతలో అక్కడికి గగన్‌ వెళ్తాడు. హల్లో కూర్చున్న శివ మాత్రం బాధపడుతుంటాడు. పూర్ణి హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget