Meghasandesam Serial Today December 7th: ‘మేఘసందేశం’ సీరియల్: శరత్ చంద్ర దగ్గరకు వీడియోతో వెళ్లిన భూమి – నిజం తెలిసి షాకైన అపూర్వ
Meghasandesam serial today episode December 7th: శరత్ చంద్రకు నిజం తెలియాల్సిన టైం వచ్చిందని భూమిని గెస్ట్‌హౌస్‌కు పంపిస్తాడు కేపీ. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: శరత్ చంద్ర ఆత్మహత్య ప్రయత్నం చేశాడని తెలుసుకున్న భూమి. అపూర్వ గురించి నిజం తెలుసుకున్నందుకే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడని నమ్ముతుంది. దీంతో ఏడుస్తూ కేపీ దగ్గరకు వెళ్తుంది భూమి. ఏడుస్తూ వచ్చిన భూమిని చూసి కేపీ షాక్ అవుతాడు.
కేపీ: అమ్మా భూమి ఎందుకు అలా ఏడుస్తున్నావు..ఏమైందమ్మా.. మళ్లీ ఏదైనా ప్రాబ్లమా..?
భూమి: ప్రాబ్లమే మామయ్య.. అయిపోయింది మామయ్య. ఇక జీవితమంతా ఆ అపూర్వ పెట్టే హింసను భరిస్తూ మనం ఏడుస్తూ బతకాల్సిందే మామయ్య.
కేపీ: అసలు ఏమైందమ్మా..? ఎందుకు అంతగా ఏడుస్తున్నావు.. అయినా ముందు ఏడుపు ఆపు భూమి. అసలు ఏమైంది..? చెప్పు భూమి. నువ్వే ఏడ్చేంత కష్టం మల్లీ ఎమొచ్చింది తల్లి. ఊరుకో ఏం జరిగిందో చెప్పు భూమి. అప్పుడే కదా నాకు విషయం అర్థం అవుతుంది.
భూమి: నాన్న ఆత్మహత్య చేసుకోబోయారు. సమయానికి ఇంట్లో వాళ్లు చూడటం వల్లే బతికారు లేదంటే నాన్న మనకు దూరం అయ్యే వారు మామయ్య..
కేపీ: అమ్మా భూమి ఏం చెప్తున్నావు.. అసలు బావగారు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి..? నాకేం అర్తం కావడం లేదు.. ఎందుకు చెప్పు తల్లి ఎందుకు చేసుకోబోయారు..?
భూమి: నాన్న దేనికి ఆత్మహత్య చేసుకోబోయారే తెలిస్తే మీరు షాక్ అవుతారు మామయ్య.
కేపీ: దేనికోసం చెప్పమ్మా..?
భూమి: మా అమ్మను చంపింది ఆ అపూర్వ అని తెలిసిపోయి ఇన్నాళ్లు ఇలాంటి దాన్నా నేను నమ్మింది అని మానసిక క్షోభతో చనిపోవాలనుకున్నారు.
కేపీ: ఏంటి భూమి ఏం మాట్లాడుతున్నావు.. మీ నాన్నకు నిజం తెలియడమేంటి..? అసలు ఎలా తెలిసింది మీ నాన్నకు నిజం..
భూమి: ఇదిగోండి మామయ్య ఆ అపూర్వే మా అమ్మను చంపింది అని చెప్పే కెమెరా ఇది. ఇప్పుడు నేనేం చేయాలి మామయ్య.
కేపీ: భూమి నువ్వు చెప్పేది ఏదీ నమ్మశక్యంగా లేదమ్మా..? ఇదంతా నీకు ఎవరు చెప్పారు.
భూమి: ఆ అపూర్వే చెప్పింది మామయ్య..
కేపీ: ఏం భూమి ఆ రాక్షసి చెబితే నువ్వు నమ్మావా..?
భూమి: ఊరికే చెబితే నేను ఎందుకు నమ్ముతాను మామయ్య. నాన్న ఆత్మహత్య చేసుకునే ముందు ఆయనే స్వయంగా అదంతా చెబుతూ వీడియో తీసుకున్నారు. అది నాకు అపూర్వ చూపించింది మామయ్య.
కేపీ: లేదమ్మా ఎంత బలమైన సాక్ష్యం చూపించినా నువ్వు నమ్ముతావేమో కానీ నేను మాత్రం నమ్మను
అంటూ కేపీ శరత్ చంద్రకు ఫోన్ చేస్తాడు. శరత్ చంద్రను ఎక్కడున్నారని అడుగుతాడు. గెస్ట్‌హౌస్‌లో ఉన్నానని మనఃశాంతి కోసం తాగుతున్నానని చెప్తాడు. ఏం తప్పు చేశారని మనఃశాంతి కోసం తాగుతున్నారని కేపీ అడగ్గానే.. నిన్ను షూట్ చేసిన విషయం మీరాకు తెలిసి నన్ను ఎందుకు షూట్ చేశావని నిలదీస్తే ఏం చెప్పాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది కేపీ అందుకే తాగుతున్నానని చెప్పి కాల్ కట్ చేస్తాడు శరత్ చంద్ర. దీంతో కేపీ, భూమిని ఓదారుస్తూ.. మీ నాన్నకు నిజం తెలియలేదు భూమి. ఆ అపూర్వ కావాలని నిన్ను డైవర్ట్ చేసింది. ఇప్పుడు మీ నాన్నకు నిజం తెలియాల్సిన టైం వచ్చింది వెంటనే ఈ వీడియో తీసుకెళ్లి మీ నాన్నకు చూపించు అని చెప్తాడు. అలాగేనని భూమి గెస్ట్‌హౌస్ కు వెళ్తుంది. కేపీ ఇంటికి వెళ్లి అపూర్వకు భూమి వీడియో తీసుకుని గెస్ట్‌హౌస్‌కు వెళ్లిందని కాసేపట్లో శరత్ చంద్రకు నిజం తెలుస్తుందని చెప్తాడు. దీంతో అపూర్వ షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















