Lakshmi Nivasam Serial: జీ తెలుగులో కొత్త సీరియల్... 'లక్ష్మీ నివాసం' కథ నుంచి యాక్టర్స్ వరకు - ఈ డీటెయిల్స్ తెలుసా?
Zee Telugu New Serial Lakshmi Nivasam: జీ తెలుగులో కొత్త సీరియల్ 'లక్ష్మీ నివాసం' ప్రారంభం కానుంది. లేటెస్టుగా ప్రోమో రిలీజ్ చేశారు. ఆ సీరియల్ కథ, టెలికాస్ట్ టైమింగ్, ఆర్టిస్టుల డీటెయిల్స్ తెలుసుకోండి

తెలుగు టీవీ ఆడియన్స్ ఫేవరెట్ ఛానళ్లలో 'జీ తెలుగు' (Zee Telugu TV Serials) ఒకటి. పలు సూపర్ హిట్ సీరియళ్లను వీక్షకులకు అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల అభిమానం సొంతం చేసుకుంటూ ముందుకు వెళుతోంది. ఇప్పుడీ ఛానల్ సరికొత్త ధారావాహికను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఆ సీరియల్ పేరు 'లక్ష్మీ నివాసం' (Lakshmi Nivasam Serial On Zee Telugu). తాజాగా ప్రోమో విడుదల చేశారు.
'లక్ష్మీ నివాసం'లో నటీనటులు ఎవరు? నేపథ్యం ఏమిటి?
Lakshmi Nivasam Zee Telugu Serial Cast And Crew: తెలుగు వెండితెర ప్రేక్షకులకు సుపరిచితులు, బుల్లితెరపై కూడా సందడి చేసిన నటుడు శేఖర్ ఉన్నారు కదా! 'ఛత్రపతి' శేఖర్ (Chatrapathi Sekhar)గా ఎక్కువ మందికి తెలుసు. ఆయన 'లక్ష్మీ నివాసం'లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన భార్యగా తమిళ నటి, కొన్ని తెలుగు సినిమాల్లోనూ కనిపించిన శ్రీ రంజని (Sriranjani) మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
తమిళ సీరియల్ 'సంధ్యా రాగం'లో సిస్టర్స్ ఆధ్య, రామలక్ష్మి క్యారెక్టర్లలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అంతర, భావన లాస్య మరోసారి 'లక్ష్మి నివాసం'లో సిస్టర్స్ కింద సందడి చేయనున్నారు. ఆల్రెడీ 'మల్లి'లో భావన లాస్య నటిస్తూ తెలుగు వీక్షకుల ముందుకు వచ్చారు. ఇంకా ఇందులో 'ఊహలు గుసగుసలాడే' ఫేమ్ శ్రీ రితిక, 'చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి' ఫేమ్ అభిత, 'వదినమ్మ' ఫేమ్ గణేష్ రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.
'లక్ష్మీ నివాసం' సీరియల్ కథ ఏమిటి? ఎవరి రోల్ ఏమిటి?
Lakshmi Nivasam Serial Concept, Story: 'లక్ష్మీ నివాసం'లో శ్రీ రంజని, 'ఛత్రపతి' శేఖర్ భార్య భర్తలుగా నటిస్తున్నారు. భర్త పేరు శ్రీనివాస్. అతను తన భార్యకు సొంత ఇల్లు కట్టిస్తానని 30 ఏళ్ల క్రితం మాట ఇస్తాడు. అది మరిచిపోకూడదని ప్రతి రోజూ గుమ్మంలో ఇంటి ముగ్గు వేయమని చెబుతాడు.
Also Read: జీ తెలుగు సీరియల్స్... మళ్ళీ సేమ్ టైమింగ్స్‌లో... ఏది ఏ టైంలో వస్తుందో తెలుసుకోండి
తనకు వచ్చిన రిటైర్మెంట్ డబ్బుతో సొంత ఇల్లు కట్టాలని అనుకుంటే... తన భార్య ఆఫీసుకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతోందని, అందుకని రెండు లక్షల రూపాయలు పెట్టి కొత్త బండి కొన్నానని, తండ్రి దగ్గర నుంచి రెండు లక్షలు తీసుకుంటాడు చిన్న కొడుకు. చాలా ఏళ్ల క్రితం పెళ్లై అత్తారింటికి వెళ్లిన పెద్దమ్మాయి తన భర్త కట్నం డబ్బు కోసం వేధిస్తున్నాడని, రిటైర్మెంట్ డబ్బులు వచ్చాయి కనుక అందులోవి తీసి తనకు కట్నం ఇవ్వమని కొంత డబ్బు తీసుకుని వెళుతుంది. దాంతో ఏం చేయాలో పాలుపోని శ్రీనివాస్ మిగతా కొంత డబ్బుతో ఆలోచనలో పడతాడు. మరోవైపు ఇంటిలో ఉన్న ఇద్దరు అమ్మాయిల్లో మరొక అమ్మాయికి పెళ్లి చూపులు నిశ్చయం అవుతాయి. తండ్రి పరిస్థితి తెలిసిన అమ్మాయి ఏం చేసింది? తల్లిదండ్రులు ఏం చేశారు? అనేది సీరియల్ చూసి తెలుసుకోవాలి.
'జీ తెలుగు' టీవీలో మార్చి 3వ తేదీ నుంచి రాత్రి 7 గంటలకు 'లక్ష్మీ నివాసం'
Zee Telugu Serial Lakshmi Nivasam Telecast Time: 'జీ తెలుగు' టీవీ ఇంకా 'లక్ష్మీ నివాసం' టెలికాస్ట్ టైమింగ్ ఫిక్స్ చేయలేదు. అయితే, విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం... ప్రైమ్ టైంలో ఈ సీరియల్ టెలికాస్ట్ కానుంది. మార్చి 3వ తేదీ నుంచి సీరియల్ ప్రారంభం కానుందని తెలిసింది. సోమ నుంచి ఆది వారం వరకు ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు టెలికాస్ట్ కానుందని తెలుస్తోంది.
Also Read: పల్లవి గౌడ డబుల్ ధమాకా... జీ తెలుగు సీరియల్ 'నిండు నూరేళ్ళ సావాసం'లో ట్విస్ట్ తెలిసిందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

