అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today January 30th: నీ నోటితోనే శ్రీలక్ష్మీ నా భార్య అని అందిరితో చెప్పించేలా చేస్తానంటూ మ్యాడికి లక్ష్మీ సవాల్‌..

Lakshimi Raave Maa Intiki Serial Today Episode January 30th: నీ నోటితోనే శ్రీలక్ష్మీ నా భార్య అని అందిరితో చెప్పించేలా చేస్తానంటూ మ్యాడికి లక్ష్మీ సవాల్‌..

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: ఇంట్లో ఎవరూ పట్టించుకోకపోవడంతో శ్రీలక్ష్మీ నేరుగా తన భర్త మ్యాడీ రూమ్‌లోకి వెళ్తుంది. నావల్ల మీరు ఎంత బాధపడుతున్నారో అర్థమవుతోందని అంటుంది. ఇదంతా నేను కావాలని చేసింది కాదని...ఆ దేవుడే మనల్ని ఇలా కలిపాడని అంటుంది. ఆ మాటలకు మ్యాడీకి కోపం వస్తుంది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని అంటాడు.నువ్వు నా భార్య కాదు...నేను నీ భర్త కాదు బయటకు పొమ్మంటాడు. దీంతో శ్రీలక్ష్మీకి కోపం వస్తుంది. నువ్వు పొమ్మంటే పోవడానికి నేనేమీ మామూలు అమ్మాయిని కాదని...నీ భార్యను అని అంటుంది. కోడలుగా ఈ ఇంట్లో ఉండే హక్కు ఎలా ఉందో...భార్యగా నీ గదిలో ఉండేహక్కు కూడా నాకు ఉందని అంటుంది. దీంతో మ్యాడీ శ్రీలక్ష్మీని గట్టిగా తిడతాడు. మా తాతయ్యను అడ్డుపెట్టుకుని నన్ను కట్టిపడేయాలని చూస్తే కుదరదంటాడు. నువ్వు ఎప్పటికీ నా భార్య కాదని,,ఎవరు ఎన్ని చెప్పినా నేను నిన్న భార్యగా అంగీకరించనని అంటాడు. నువ్వు పొమ్మంటే తల ఊపుకుని పోతానని అనుకుంటున్నావేమో....అదీ అయ్యేపని కాదని శ్రీలక్ష్మీ కూడా గట్టిగా మ్యాడీకి వార్నింగ్‌ ఇస్తుంది. నీ నోటితోనే నన్ను నీ భార్య అని అందరికి చెప్పేలా చేయకపోతే నా పేరు శ్రీలక్ష్మీ కాదని అంటుంది. 
                       భార్యాభర్తలిద్దరూ గొడవపడుతుంటే గుమ్మంలో నుంచి చూస్తున్న ప్రియంవద లోపలికి వస్తుంది. విలువలేని మనుషులతో మాటలు అనవసరమని మ్యాడీతో అంటుంది.తను ఈ గదిలో ఉండాలనుకుంటే ఉండనివ్వమని...నువ్వు వేరే గదిలోకి వెళ్లమని చెబుతుంది. తను ఈ గదిలో ఒంటరిగా ఎన్నాళ్లు ఉంటుందో చూద్దామని అంటుంది. అప్పుడు అదే పారిపోతుందని మ్యాడీని తీసుకుని  వెళ్లిపోతుంది. ఇక్కడ మార్చాల్సింది మధుబాబును మాత్రమే కాదని....ఇంట్లో అందరినీ మార్చాలని శ్రీలక్ష్మీ అనుకుంటుంది. బయటకు వచ్చిన మ్యాడీని ప్రియంవద అడుగుతుంది. ఈ లక్ష్మీని ఎలా పంపించాలని ఆలోచిస్తున్నావా అని అంటుంది. దీని గురించి అసలు ఆలోచించడం  లేదని...నా బాధ అంతా మా అక్క గురించేనని అంటాడు. కరెక్ట్‌గా తనను తప్పించే సమయానికి తాతయ్య పిలిచి ఈ పెళ్లి చేశాడని అంటాడు. చేయిదాక వచ్చిన ఛాన్స్ మిస్సయ్యిందని బాధపడుతుంటాడు.
                                     సరిగ్గా అప్పుడే మ్యాడీకి సింధూ ఫోన్ చేస్తుంది. నేను విషయం మొత్తం గోపికి చెప్పేశానని చెప్పగానే మ్యాడీతో పాటు అందరూ షాక్‌కు గురవుతారు.అతనే ఆరునెలల తర్వాత విడాకులు ఇచ్చి పంపిస్తానని మాటిచ్చాడని చెబుతుంది. కాబట్టి నా గురించి ఆలోచించొద్దని అంటుంది. ఈ మాటలు వినగానే మ్యాడీ కొంత ఊపిరి పీల్చుకుంటాడు. సింధూ తన సమస్యకు తానే పరిష్కారం చూసుకుందని...కాబట్టి ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది శ్రీలక్ష్మీ గురించని ప్రియంవద అంటుంది. 6 నెలల్లో లక్ష్మీని వాళ్ల ఇంటికి పంపించే పూచీ నాదని ప్రియంవద మ్యాడీతో అంటుంది. తన గదిలో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న శ్రీలక్ష్మీ దగ్గరకు వచ్చి సూర్యానారాయణ,ఇందిర దంపతులు వచ్చి పలకరిస్తారు. మీ ఊరిలో ఇలాగే ఒంటరిగా ఉన్నావా....ఇక్కడ ఎందుకు ఇలా ఉంటున్నావని అడుగుతాడు. ఇక్కడ కొంచెం అలవాటు పడేవరకు సమయం పడుతుందని అంటుంది. అక్కడ అందరూ నాకు తెలిసినవాళ్లు, చుట్టాలు ఉన్నారని ఇక్కడ అలా లేదని అంటుంది. నాతో ఈ ఇంట్లో మీరు తప్ప ఎవరూ మాట్లాడటం లేదని అంటుంది. ఇంతలో ఇందిర కలుగజేసుకుని..ఈ ఇంట్లో వాళ్లను నీవైపు తిప్పుకోగలవన్న నమ్మకం మాకుందని అంటుంది. మ్యాడీ కూడా పైకి అలా కనిపించినా చాలా మంచివాడని అంటుంది. వాడు కొంచెం మొండివాడు కాబట్టి నువ్వే వాడిని మార్చాలని సూర్యనారాయణ కోరతాడు.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget