అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today January 22nd: మురారి, కృష్ణ మాటలు విని ఆదర్శ్‌ ఇంటికి తిరిగి వస్తాడా.. ముకుందని ఇంకా ప్రేమిస్తున్నాడా!

Krishna Mukunda Murari Serial Today Episode: కృష్ణ, మురారిలు ఆదర్శ్‌ని కలిసి ఇంటికి తీసుకెళ్లడానికి ఒప్పించే ప్రయత్నం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Today Episode: మురారి, కృష్ణలు ఆదర్శ్‌ని వెతుక్కుంటూ కశ్మర్ వస్తారు. అక్కడ ఓ వ్యక్తికి ఆదర్శ్ ఫొటో చూపించి అతను తెలుసా అని అడుగుతారు. ఆయన తెలీదు అనడంతో మళ్లీ బయల్దేరుతారు. దారిలో కనిపించిన మరో వ్యక్తికి ఆదర్శ్ ఫొటో చూపించి అడిగితే అతను తెలుసు అని అడ్రస్ చెప్తాడు. మురారి, కృష్ణలు సంతోషంగా అక్కడికి బయల్దేరుతారు. ఆదర్శ్‌ ఓ చోట పిల్లలకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అక్కడికి మురారి, కృష్ణలు చేరుకుంటారు. ఆదర్శ్‌ని చూస్తారు.

ఆదర్శ్‌: ఎవరు మీరు..
కృష్ణ: మురారి. మురారి ముఖం మారిపోయి ఉండడంతో ఆదర్శ్‌ అనుమానంగా చూస్తాడు. దానికి కృష్ణ అసలు ఏం జరిగింది అంటే అని మురారికి యాక్సిడెంట్ అవ్వడం.. తర్వాత ముఖం మార్చడం అన్నీ చెప్తుంది. ఆదర్శ్ షాక్ అయిపోతాడు. 
ఆదర్శ్‌: మురారి.. అని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతాడు. 
మురారి: ఎలా ఉన్నావ్.. 
ఆదర్శ్‌: బాగున్నాను.
మురారి: కృష్ణ డాక్టర్. నా భార్య. తింగరి.. చూడటానికి తింగరే కానీ బాగా ఆలోచిస్తుంది.
ఆదర్శ్‌: మనసులో.. మురారి ముకుందని పెళ్లి చేసుకోలేదా.. ఇద్దరూ ప్రేమించుకున్నారు కదా.. ఆ రోజు రాత్రి ముకుంద మురారికి కాల్ చేసింది కదా.. 
మురారి: ఏంట్రా.. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అవన్నీ నీకు తర్వాత చెప్తా. సరే కానీ ముందు బయల్దేరు అక్కడ అమ్మ నీకోసం ఎదురు చూస్తుంది. చెప్పేది నీకే బయల్దేరు.
కృష్ణ: అవును సార్ మా పెద్దత్తయ్య మీ కోసం ఎదురు చూస్తున్నారు.
ఆదర్శ్‌: పర్లేదు ఆదర్శ్ అని పిలొచ్చు.
కృష్ణ: ఒకే ఆదర్శ్ మీ కోసం అక్కడ పెద్దత్తయ్యే కాదు అందరూ ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ముకుంద.
మురారి: కృష్ణ చెప్పేది నిజమే.. నిన్ను తీసుకొస్తామని ముకుందకు చెప్పే బయల్దేరాం. 

పెళ్లి అయిన రోజు ముకుంద మురారికి కాల్ చేసి నిన్ను మర్చిపోవడం అంటే అది చచ్చిపోవడమే అని చెప్తుంది దాన్ని ఆదర్శ్‌ వింటాడు. ఆ మాటల్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటాడు. 
ముకుంద: నీకు మాటిచ్చిన అంత ఈజీగా నేను ఆదర్శ్‌ని భర్తగా అంగీకరించలేను. నిన్ను మనసులో పెట్టుకొని ఆదర్శ్‌తో జీవితాన్ని నేను పంచుకోలేను. ఆ ఆలోచన వస్తేనే నా ప్రాణం పోతుంది. మురారి ఐ లవ్ యూ మురారి. ఐ లవ్ యూ. 

కృష్ణ: ఆదర్శ్‌ ఇంకేం ఆలోచించకండి వెళ్దాం పదండి..
మురారి: ఇప్పుడు అక్కడి పరిస్థితులు అన్నీ మారాయి. నువ్వు అనుకున్నట్లు ఏం లేవు. అన్ని చక్కదిద్దాలనే మేం ఇక్కడికి వచ్చాం. 
ఆదర్శ్‌: చక్కదిద్దడం అంటే.. చెప్పండి చక్కదిద్దడం అంటే ఏంటి. 
మురారి: సమాధానం నాతో చెప్పించాలి అని చూడకు. ఆ చక్కదిద్దడం అంటే ఏంటో నీకు తెలుసు నాకు తెలుసు. అన్నీ సర్దుకున్నాయి అని చెప్తున్నా కదా బయల్దేరు.
ఆదర్శ్‌: రేయ్ నేను ఏమైనా స్కూల్ పిల్లాడిని అనుకున్నావా. అలిగి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే సర్ది చెప్పి ఇంటికి తీసుకెళ్లడానికి.. నేను ఒక కమాండర్‌ని రా. దేశానికి సర్వీస్ చేసి ఇప్పుడు ఇలా ఏం తెలీని అడవి బిడ్డలకు నా దేశ భక్తిని నేర్పుతూ ఆ పాత జ్ఞాపకాల్ని తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటపడుతున్నాను. మళ్లీ నన్ను ఆ ఊబిలోకి  దించే ప్రయత్నం చేయకండి. వెళ్లిపోండి.
కృష్ణ: అది కాదు ఆదర్శ్‌..
ఆదర్శ్‌: కృష్ణ ప్లీజ్.. నీకు గతం ఏంటో తెలీదు. భర్త చెప్పాడు విని నువ్వు తోడు వచ్చావ్ అంతే.. 
కృష్ణ: నాకు గతం తెలుసు ఆదర్శ్‌.. మీరు అన్నది పొరపాటు నన్ను ఏసీపీ సార్ తీసుకురాలేదు. నేనే ఏసీపీ సార్‌ని ఇక్కడికి తీసుకొచ్చాను. 
ఆదర్శ్‌: అంటే నీకు..
కృష్ణ: తెలుసు అన్ని నిజాలు తెలుసు.. గతాన్ని తెలుసుకొని వర్తమానాన్ని పాడుచేసుకోకుండా సరిచేసుకుంటే భవిష్యత్ బాగుంటుంది. మనుషుల మధ్య ఆపార్థాలు చూపించేది గతం. ఆ గతాన్ని మర్చిపోతే కుటుంబాల మధ్య దేశాల మధ్య కూడా అన్ని గొడవలు ఉండవు. 
ఆదర్శ్‌: మీరు ఎన్ని అయినా చెప్పండి నేను రాను. నాకు ఇక్కడ ప్రశాంతంగా ఉంది.
మురారి: ముకుంద గురించి ఆలోచించవా..
ఆదర్శ్‌: సరే మీ ఇద్దరికీ నేను ఓ చిన్న మాట చెప్పనా.. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఇలా ఒంటరిగా కాకుండా జంటగా కనిపించి ఉంటే ఏం చేసేవాళ్లు. మాట్లాడరే.. నాకు నా భార్యను పక్కన పెట్టి వెళ్లిపోయేవారు కదా ఇప్పుడు అదే చేయండి.
మురారి: నేను ఇప్పుడు సూటిగా ఓ ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తావా.. నీ విషయం నీ ప్రేమ విషయం తెలీక నేను పెళ్లి చేసుకొని ఉంటే అప్పుడు పడే బాధ కంటే ఇదే ఎక్కువా చెప్పు. ఇప్పుడు మీ ఇద్దరికీ పెళ్లి కాలేదు. ఇప్పటికీ నీ మనసులో ముకుంద ఉంది.
ఆదర్శ్‌: లేదు.
మురారి: అబద్ధం.. 
ఆదర్శ్‌: కాదు కాదు.. 
కృష్ణ: అయితే బయల్దేరండి ఆదర్శ్‌ ముకుంద కోసం కాదు మీ అమ్మ కోసం రండి. ఎటూ ముకుంద మీ మనసులో లేదు కదా ఇక మీరు మాతో రావడానికి ఏంటి అభ్యంతరం.. 
మురారి: మాట్లాడవేం కృష్ణ అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు చెప్పలేవ్. ఎందుకు అంటే ముకుంద ఇంకా నీ మనసులో ఉంది కాబట్టి.
ఆదర్శ్: రేయ్ ప్లీజ్ రా ఇంక నా వల్ల కాదు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. 
మురారి: ఆదర్శ్‌ కుటుంబం అనేది దేవుడు ఇచ్చిన వరం అది నన్ను చూస్తే నీకు అర్థం కావడం లేదా.. చూడు ఒక్క మాటలో చెప్పాలి అంటే కృష్ణ లేకపోతే నేను ఉండలేను. నేను లేకపోతే కృష్ణ ఉండలేదు. ఇదేదో నిన్ను మార్చడానికో ఏమార్చడానికో చెప్పడం లేదు. అగ్ని సాక్షిగా నువ్వు కట్టిన తాళికి కట్టుబడి వస్తావు అనుకుంటున్నా.. 
కృష్ణ: ఆదర్శ్ ఎంతమందికి ప్రేమించిన వారిని పెళ్లి చేసుకునే అదృష్టం దక్కుతుంది. ఒక్కసారి ఆలోచించండి అన్నీ మర్చిపోయి మీ ప్రేమను దక్కించుకోండి. ఒక్కసారి మనస్ఫూర్తిగా మీరు ప్రేమించిన ప్రేమిస్తున్న ముకుంద ముఖం చూస్తే ఇవన్నీ మీరు అనుకుంటున్న అన్నీ దూదిలా ఎగిరిపోతాయి. నన్ను నమ్మండి అని కృష్ణ అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: సీతే రాముడి కట్నం సీరియల్ జనవరి 22nd: తన భర్త అక్క కలిసున్న ఆల్బమ్‌ను ముక్కలు ముక్కలు చేసిన సీత!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Embed widget