అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today January 22nd: తన భర్త అక్క కలిసున్న ఆల్బమ్‌ను ముక్కలు ముక్కలు చేసిన సీత!

Seethe Ramudi Katnam Serial Today Episode: రిసెప్షన్ ఆల్బమ్‌లో రామ్ పక్కన మధుమిత ఫొటోలు కట్ చేసి ఉండటం చూసి మహాలక్ష్మి సీరియస్ అవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode: ఆఫీస్‌లో తమ బిజినెస్ పార్టనర్ ఒకరు రామ్, మధుమిత భార్యభర్తలు అనుకొని వాళ్లని లంచ్‌కి పిలుస్తాడు. అతనితో రామ్ నిజం చెప్పాలని ప్రయత్నించగా మహాలక్ష్మి అడ్డుకొని అతన్ని పంపేస్తుంది. ఇక రామ్ సీత తన భార్య అని మధుమిత కాదు అని అతనితో చెప్పాలి అనుకుంటే ఎందుకు అడ్డుకుని అతన్ని పంపించేశారు అని అడుగుతాడు. 

మహాలక్ష్మి: పెళ్లికి ముందు నీకు కాబోయే భార్యగా మధుమిత ఫొటో పేపర్‌లో రావడం.. రిసెప్షన్‌లో నీతోపాటు మధుమిత ఉండటం తింగరి పనులు చేస్తూ ఆ సీత ఎక్కడో నీకు దూరంగా ఉండటం.. ఇవన్నీ నువ్వు మధుమితే జంట అనుకునేలా చేశాయి. ఇక నువ్వు మధుమిత నా భార్య కాదు సీతే నా భార్య అని అందరికి పని కట్టుకొని చెప్పాల్సిన పని లేదు. 
రామ్: అసలు మీరు రిసెప్షన్‌ను ఏర్పాటు చేసిందే అందరికీ సీత నా భార్య అని చెప్పడానికి కదా పిన్ని. ఇప్పుడు సీత నా వైఫ్ అని చెప్పొద్దు అంటారా..
అర్చన: ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నాం రామ్.  
రామ్: అంటే దాన్ని కరెక్ట్‌ చేయొద్దు అంటారా.. ఇది కరెక్ట్ కాదు. అందరూ నా గురించి మధుమిత గురించి తప్పుగా అనుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ విషయం తెలిస్తే తను ఎంత బాధ పడుతుంది. 
మహాలక్ష్మి: అయితే ఏం చేయమంటావ్ రామ్ మళ్లీ మీ రిషెప్షన్‌ చేసి నీ భార్య మధుమిత కాదు సీత అని అందరికీ చెప్పమంటావా. ఆ రిషెప్షన్‌లో పరువు తీసింది నా భార్య అని చెప్తావా.. పోనీ నీ మైండ్‌లో ఏదైనా ఆలోచన ఉంటే చెప్పు మేం ఫాలో అవుతాం.
రామ్: ఏం లేదు పిన్ని. పాపం సీత ఈ విషయం తెలిస్తే ఎంతలా ఫీలవుతుందో..

మహాలక్ష్మి: సిటీ అంతా ఇలాగే ఫీల్ అవ్వాలి. రామ్ భార్య మధుమిత అని ప్రచారం కావాలి. అప్పుడే మధుమిత మన కోడలు అవుతుంది. అందరి ముందు నన్ను చెంప దెబ్బ కొట్టావు కదే సీతా.. నిన్ను నా ఇంటి నుంచి గెంటేసి నీ అక్కనే నా ఇంటి కోడలిగా తీసుకొస్తాను. నీ మీద ప్రతీకారం తీర్చుకునే రోజు త్వరలోనే ఉంది. 

సీత: తనలో తాను.. మహాలక్ష్మి అత్తయ్య వాళ్లు ఎంత తప్పుగా ఆలోచించారు. రిషెప్షన్‌లో కావాలనే నాకు అక్కకి ఒకేలాంటి నగలు, చీరలు ఇచ్చారు. మత్తు మందు కలిపిన జ్యూస్ నాతో తాగించి నన్ను అందరి ముందు పిచ్చిదాన్ని చేశారు. నేను లేని టైంలో అక్కని ఆయన పక్కనుంచి ఫొటోలు తీశారు. ఈ ఫొటోలు బయటకు వెళ్తే అక్క కాపురం ఏం కావాలి. ఈ విషయం నాన్నకి తెలిస్తే మహాలక్ష్మి అత్తయ్య కుట్ర తెలీక తప్పు అంతా అక్కదే అనుకుంటారు. అక్కని ఎన్ని మాటలు అంటారో పాపం అక్క. నువ్వు ఎంత మంచి అక్కవే అక్క నిన్ను తలచుకోగానే నాకు ఫోన్ చేశావు. నా పట్ల నీకున్న ప్రేమ అలాంటిది. అక్క ఇప్పుడే నీ గురించి తలచుకున్నాను. 
మధుమిత: నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి సీత. అత్తలేని కోడలు ఉత్తమురాలు అంటారు. ఉత్తమురాలు అయిన అత్త ఉన్న కోడలు అదృష్టవంతురాలు అని నేను అంటాను. మీ అత్తయ్య గారు ఎంతో మంచివారు. నిన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నువ్వు చేసిన పూజలు వల్లే నీకు అంత మంచి అత్త దొరికారు. నేను ఆవిడ మాట కాదని సూర్యని పెళ్లి చేసుకున్నా నన్ను ఆ ఇంటికి రానిచ్చి.. మర్యాద ఇచ్చి బాగా చూసుకున్నారు. నన్నే అంత బాగా చూసుకున్నారు అంటే నిన్ను ఇంకా ఎంత బాగా చూసుకుంటారో ఊహించుకోగలను. మీ ఇంట్లో అందరూ మంచోళ్లే. నా వల్ల నీ జీవితం నాశనం అయిపోయిందని చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మొదటి సారి నా వల్ల నీకు మంచి జరిగింది. 
సీత: మనసులో.. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలీదు అక్క. తెలిస్తే బాధ పడతావు. 
మధుమిత: నువ్వు ఆ ఇంటి కోడలు అవ్వడం అమ్మానాన్నలకు కూడా గర్వంగా ఉంది సీత. ఏంటి సీత నీ గొంతు అదోలా ఉంది. నువ్వేదో బాధగా మాట్లాడుతున్నావ్. 
సీత: ఇక్కడ చలి అక్క అందుకే గొంతు మారింది. మనసులో.. మా అత్త దేవత కాదు అక్క రాక్షసి నా కాపురంలో నీ కాపురంలో నిప్పులు పోస్తుంది. మా ఆయన పక్కన నువ్వు ఉన్న ఫొటోలు తీసి ఆల్బమ్ చేయించింది ఆ విషయం నీతో ఎలా చెప్పను. పాపం అక్క నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను అనుకుంటుంది. నా గురించి అక్కకు తెలీకపోవడమే మంచిది కనీసం అక్క అయినా అక్కడ సంతోషంగా ఉంటుంది. 

మహాలక్ష్మి వాళ్లు ఇంటికి వస్తారు. ఉషకు ఆల్బమ్ తీసుకొని రమ్మని చెప్తుంది. ఉష తీసుకొని వస్తుంది. సీతకు ఆల్బమ్‌ గురించి  తెలుసా అని మహాలక్ష్మి అడుగుతుంది. సీత చూసిందని మాకు అడిగితే మేం ఇవ్వలేదని ఉష చెప్తుంది. ఇక మహాలక్ష్మి ఆల్బమ్ తెరచి చూస్తే అందులో మధుమిత ఫొటోలు కట్ చేసి ఉంటాయి. అది చూసి మహాలక్ష్మి వాళ్లు షాక్ అవుతారు. 

మహాలక్ష్మి: ఇది ఎలా జరిగింది ఫొటోలను ఎవరు కట్ చేశారు. ఆల్బమ్‌ను జాగ్రత్తగా చూసుకోమని మీతో చెప్పాను కదా.. మీకు తెలీకుండా ఏం జరిగింది. 
ఉష: మీరు ఇచ్చిన ఆల్బమ్‌ను అలాగే జాగ్రత్తగా తీసుకెళ్లి బీరువాలో పెట్టాం. ఇలా ఏలా జరిగిందో మాకు తెలీదు. 
మహాలక్ష్మి: ఇదంతా కచ్చితంగా ఆ పిచ్చి దాని పనే అయి ఉంటుంది. ఎక్కడ ఆ సీత. 
చలపతి: బీరువాలో పెట్టి లాక్ చేసి దాచిన ఆల్బమ్‌ను తీసుకోవడానికి సీత దొంగ కాదు. ఆల్బమ్‌లో ఉన్న ఫొటోలు కత్తిరించడానికి సీత మెజీషియన్ కూడా కాదు. 
అర్చన: ఆ సీత ఏదైనా చేస్తుంది ఎంతకైనా తెగిస్తుంది. 
గిరిధర్: వీధిలో ఉన్న రౌడీలను తెచ్చి నన్ను కొట్టించలేదా.. సీతకు ఏదైనా సాధ్యమే.
మహాలక్ష్మి: ఇది కచ్చితంగా దాని పనే. తాళం వేసిన బీరువాలో నుంచి ఆల్బమ్‌ను ఎలా బయటకు తీసిందో.. ఫొటోలు ఎందుకు కట్ చేసిందో.. దాన్నే అడుగుతాను. దాని సంగతి తేల్చుతాను. అర్చన వెళ్లి దాన్ని తీసుకురా.
చలపతి: మనసులో.. నిజంగా ఇది సీతపనేనా.. సీత ఆ ఫొటోలు ఎందుకు కట్ చేసింది. ఇప్పుడు సీత కిందకి వస్తే ఎంత గొడవ జరుగుతుందేమో..
అర్చన: ఏయ్ సీత ఇక్కడేం చేస్తున్నావ్. రిసెప్షన్ ఆల్బమ్‌ను స్పాయిల్ చేసింది నువ్వే కదా. అడుగుతుంటే ఆన్సర్ చెప్పవేంటే.. పిచ్చితో పాటు చెవుడు వచ్చిందా.. అంటూ సీత కట్ చేసి తన గదిలో అతికించుకున్న తన అక్క ఫొటోలు చూస్తుంది అర్చన. ఏయ్ ఏంటే ఇవన్నీ.. 
సీత: మా అక్క ఫొటోలు.. అవును నేనే అల్బమ్ కట్ చేశా..
అర్చన: ఎందుకే ఇలా చేశావ్.
సీత: నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
అర్చన: ఎంత పొగరే నీకు. అల్బమ్‌ను చెడగొట్టావ్ నిన్ను ఏం చేసినా తప్పు లేదే. నీ సంగతి ఇక్కడ కాదు. నిన్ను మహా పిలుస్తుంది పదవే.. 
సీత: నోరు మూసుకొని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో లేదంటే ఫొటోలు కట్ చేసినట్లు నీ చీరని కట్ చేస్తా. వెళ్తావా కట్ చేయమంటావా..
అర్చన: అమ్మో ఈ పిచ్చిది అన్నంత పని చేసినట్లుంది. 
రామ్: ఏంటి కంటిన్యూగా కుడి కన్ను అదురుతోంది. మళ్లీ ఇంట్లో ఏం గొడవ జరుగుతుందో ఏమో..
సీత: నన్ను కిందకి పిలిచింది అంటే కచ్చితంగా ఈ ఫొటోలు మహాలక్ష్మి పనే అయిఉంటుంది. ఈ విషయాన్ని వెళ్లి తనతోనే తేల్చుకుంటాను. 

మరోవైపు మధులతతో తన తోడికోడలు మధుని రెచ్చగొట్టాలని చూస్తుంది. తన  చెల్లితో ఫోన్‌లో మాట్లాడటం విన్నానని.. రామ్‌ని పెళ్లి చేసుకోకుండా నువ్వు తప్పు చేశావని అంటుంది. నీ అదృష్టం నీ చెల్లికి పట్టింది అని ఇప్పుడు రామ్ గురించి ఒకసారి ఆలోచించు అని అంటుంది. ఇప్పటికీ మహాలక్ష్మికి నువ్వు అంటే ఇష్టమని నువ్వు ఆ ఇంటి కోడలు అయింటే బాగుండేది అని రెచ్చగొడుతుంది. మరోవైపు అర్చన హడావుడిగా వచ్చి జరిగింది అంతా మహావాళ్లకు చెప్తుంది. ఇక సీత కూడా కిందకి వస్తుంది. ఎందుకు ఫొటోలను కట్ చేశావని సీతని మహాలక్ష్మి నిలదీస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: జగధాత్రి సీరియల్ జనవరి 20th: కౌషికిపై కుట్ర చేస్తున్న కుటుంబం.. మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్న నిషిక!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Food Combinations to Avoid : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
Stock Market News: పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద  
Embed widget