Krishna Mukunda Murari December 6th Episode : కృష్ణ ముకుంద మురారి సీరియల్: కృష్ణ చేతికి మొదటి శుభలేఖ - భర్త పెళ్లి పనులు ప్రారంభించిన డాక్టరమ్మ!
Krishna Mukunda Murari Today Episode మురారి, ముకుందల పెళ్లి మొదటి శుభలేఖను భవాని కృష్ణకు ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది
Krishna Mukunda Murari Telugu Serial Today Episode
భవాని దేవుడు దగ్గర పెట్టిన మొదటి శుభలేఖని తీసుకొని మనం తొలి కార్డు ఇవ్వడానికి ఒక దగ్గరకు వెళ్లాలి.. అందరూ నాతో రండి.. మురారి, ముకుంద మీరు కూడా నాతో రండి.. అంటూ అందర్ని కృష్ణ ఇంటికి తీసుకెళ్తుంది. ఇక కృష్ణ వాళ్లందరి రాక చూసి షాక్ అవుతుంది. వీళ్లేంటి ఇలా వచ్చారు అనుకుంటుంది. ఇక భవాని వాళ్లని పెళ్లికి పిలుస్తుంది. మొదటి శుభలేఖ మీకే ఇస్తున్నాను అని కృష్ణ చేతికి అందిస్తుంది. కార్డు చూస్తూ మురారి వైపు చూస్తూ కృష్ణ ఏడుస్తుంది.
మురారి: ఏంటి నా మనసులో ఏదో తప్పు చేస్తున్నట్లు భావన కలుగుతుంది. ఎందుకు ఏదో జరుగుతుంది. లేదు నేను ఇక్కడే ఉంటే తట్టుకోలేను అని మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు
భవాని: చూడు వేణి మా అబ్బాయిని చూస్తున్నారు అని నీకు మొదటి శుభలేఖ ఇస్తున్నా
కృష్ణ: మీ అబ్బాయి వెళ్లిపోయారు కదా మేడమ్. మీరు మామూలుగా మాట్లాడొచ్చు
భవాని: చూడు ఈ శుభలేఖ ఎందుకు ఇచ్చానో తెలుసా దీన్ని చూసి అయినా నువ్వు ఈ పెళ్లి ఆపాలి అని ప్రయత్నించవని.. నీకు అది గుర్తుండాలి అని..
కృష్ణ: అలాగే మేడం.. మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను మీరు ధైర్యంగా ముకుంద పెళ్లి చేసుకోవచ్చు.
భవాని: తెలివిగా మాట్లాడుతున్నావ్ కదూ.. ఆ శ్రీనివాస్ ఇంట్లో చాలా తెలివిగా మాట్లాడావు. ఈ పెళ్లిని ఆపేయొచ్చు అనుకుంటున్నావ్ కదూ.. పెళ్లి చేస్తున్నది నేను.. వెర్రి వేషాలు వేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండు.
సుమ: అక్క మనకు చాలా పనులు ఉన్నాయి కదా పసుపు కొట్టాలి వెళ్దాం
కృష్ణ: పెద్ద మేడం ఒక్క నిమిషం.. ఎటూ నా మీద మీకు నమ్మకం లేదు. నేను బయటకు వెళ్లి ఏ పరిమళ మేడంతోనో, జైలుకి వెళ్లి మా చిన్నాన్న తోనో ఏ ములాకత్ చేస్తానని మీకు అనుమానం ఉండడంతో తప్పు లేదు. అదే మేడం అందుకే నేను మీకు ఎదురుగా ఉంటాను. ఎటూ వెళ్లను. చిన్న రిక్వెస్ట్.. మీ ఎదురుగా ఉంటాను అని ఎందుకు అన్నానంటే పసుపు కొట్టడానికి నేను వస్తాను మేడం.
ముకుంద: వద్దు అత్తయ్య అక్కడికి వచ్చి ఏదో ఒకటి చేస్తుంది వద్దు
కృష్ణ: ఎందుకు ముకుంద బయపడుతున్నావ్.. నేను అంటే అంత భయమా
భవాని: ముకుంద ఉండు. ఈ పిల్ల కాకికి నా ముందు కుప్పిగంతులు వేసే అంత ధైర్యం ఎక్కడిది సరే రా.
తర్వాత శకుంతల వచ్చి కృష్ణ దగ్గర బాధ పడుతుంది. ఇక తన గదిలో నందూ కృష్ణ, మురారిల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంత మంచి జంటను విడదీస్తున్నా ఏం చేయలేకపోతున్నాం అని గౌతమ్, నందూ తెగ బాధ పడతారు. ఏం చేయలేకపోతున్నాం అని అనుకుంటారు. ఇక మీ అమ్మగారు.. మొదటి శుభలేఖ కృష్ణకు ఇచ్చారు అని గౌతమ్ చెప్తే నందూ షాక్ అవుతుంది. ఆ సీన్ తనకు అస్సలు బాగా అనిపించలేదు అని.. అసలు చూడాలి అనిపించలేదని గౌతమ్ చెప్తాడు. మరోవైపు చేతిలో పసుపుకొమ్ముల పళ్లెం పట్టుకొని రేవతి బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి మధుకర్ వస్తాడు.
మధు: పెద్దమ్మ అసలు ఈ పసుపు కొట్టే కాన్సెప్ట్ ఏంటి.. ఏంటి పెద్దమ్మ ఏం ఆలోచిస్తున్నావ్
రేవతి: పెళ్లయిన కొడుకుకి.. కోడలు ఎదురుగా ఉండగానే ఇంకో పెళ్లికి సిద్ధం చేసిన నన్ను ఎవరైనా అమ్మ అంటారా మధు
మధు: కాదు పెద్దమ్మ .. కానీ నువ్వు మీ అక్క మాట కాదనలేని చెల్లివి మాత్రమే. బాధ పడకు పెద్దమ్మ
రేవతి: బాధ పడకుండా ఎలా ఉండగలను రా.. ఇదంతా పెద్దపల్లి ప్రభాకర్ అన్నయ్య మీదే ఆధారపడి ఉంది. ఆయన నేరం చేయలేను అంటేనే అక్క ఆలోచిస్తుంది. కానీ ఆయన జైలులో ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడంలేదు.
భవాని: రెడీ చేస్తున్నావా రేవతి
రేవతి: రెడీ చేస్తున్నా అక్క.. మీరు వెళ్లలేదా అక్క కార్డులు ఇవ్వడానికి
భవాని: నేను మొదటి శుభలేఖ మాత్రమే ఇస్తాను అన్నాను.. ఇచ్చాను వచ్చాను
రేవతి: ఎవరికి ఇచ్చారు అక్క మొదటిది..
కృష్ణ: అప్పుడే వచ్చి.. నాకే ఇచ్చారు చిన్న మేడం. అవును మేడం మొదటి శుభలేఖ నాకు ఇచ్చి దానితో పాటు వార్నింగ్ కూడా ఇచ్చారు.
నందూ: ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతుంది గౌతమ్.
భవాని: వార్నింగ్ ఇచ్చాను అన్నావ్ కదా గుర్తుంది కదా
రేవతి: ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది అక్క
కృష్ణ: అదేంటి చిన్న మేడం మీరు అలా అంటున్నారు. నేను ఇక్కడే మీ ఎదురుగా లేకపోతే ఈ పెళ్లి ఆపడానికి ఏవో చేస్తాను అనుకుంటారు కదా అందుకే మీ ఎదురుగానే ఉంటా
భవాని: వచ్చావు కదా ఇక్కడే ఈ హాల్‌లోనే ఉండు. వీళ్లకి సాయం చేయ్
మురారి: వేణి గారు మీరు ఇక్కడ
కృష్ణ: పెద్ద మేడం గారు హెల్ప్ చేయడానికి పిలిచారు వచ్చాను సార్.
ముకుంద: ఒకసారి చెప్తే అర్ధం కాదా.. ఎందుకు మళ్లీ మళ్లీ వస్తున్నావ్.. అనవసరంగా అవుట్ హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు నువ్వే అవకాశం ఇస్తున్నావ్ . నీ గొయి నవ్వే తవ్వుకుంటున్నావ్ కృష్ణ
కృష్ణ: నాకు గోతులు తవ్వే అలవాటు లేదు ముకుంద. ఉంటే నీకే ఆ అలవాటు ఉండాలి
ఇక అందరూ పసుపు దంచె కార్యక్రమం చేస్తారు. వేణి గారికి కూడా పసుపు దంచమని నందూ చెప్తుంది. ఇక మధు పసుపు ఎందుకు దంచుతారు అని అడుగుతాడు. దాని అర్థం కృష్ణ చెప్తుంది. మురారి వైపు చూస్తూ కృష్ణ చెప్పడంతో తన వైపు చూస్తూ ఎందుకు చెప్తుంది అని మురారి అనుకుంటాడు. ఇక ముకుంద కూడా పసుపు కొడతా అంటే పెళ్లి కూతురు పసుపు కొట్టకూడదు అని కృష్ణ వద్దు అనేస్తుంది. ఇక ముకుందకు రేవతి పసుపు రాస్తే.. కృష్ణ అందరికీ గంధం రాస్తుంది. మురారికి కూడా గంధం రాయడానికి వెళ్లిక కృష్ణ అలా చూస్తూ ఉండిపోతుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read : ‘బ్రహ్మముడి’ సీరియల్ : అనామిక జాతకం బాగాలేదన్న పంతులు - అప్పును ఇంట్లోకి తీసుకెళ్లిన కళ్యాణ్