అన్వేషించండి

Brahmamudi December 6th Episode: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : అనామిక జాతకం బాగాలేదన్న పంతులు - అప్పును ఇంట్లోకి తీసుకెళ్లిన కళ్యాణ్

Brahmamudi Serial Today Episode: నిశ్చితార్థం కోసం దుగ్గిరాల ఇంటికి వచ్చిన పంతులు అనామిక జాతకం బాగాలేదని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Telugu Serial Today Episode: వైట్‌ బోర్డు మీద  డాట్స్‌ పెడుతూ అరుణ్‌ ను పట్టుకోవడానికి కావ్య ప్లాన్‌ గీస్తుంటే.. రాజ్‌ చూసి వెటకారంగా మాట్లాడుతుంటే..

కావ్య: నాకొకటి అర్థం అయింది. వాడు కాన్ఫరెన్స్‌కు వెళ్లలేదు. హాస్పిటల్‌కు వెళ్లలేదు, అంటే అర్థం వాడు కావాలనే తప్పించుకున్నాడు. ఎస్కేప్‌ అయ్యాడు. అదృశ్యమయ్యాడు, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఎక్కడో దాక్కున్నాడు.    

రాజ్‌: ఏయ్‌ నీ సీఐడీ ఇన్‌వెస్టిగేషన్‌ వదిలేస్తావా? ఇంట్లో అందరూ వాడి గురించి వదిలేశాకా.. నువ్వు ముగ్గులు, పిల్లి మొగ్గలు వేస్తూ కూర్చోవడంలో మీనింగే లేదు.

అనగానే కావ్య కోపంగా ఏం మాట్లాడుతున్నారు అంటూ రాజ్‌ ను  తిడుతుంది. వాడు ఎంత తెలివిగా తప్పించుకున్నాడో మీకు అర్థం కావడం లేదు అంటుంది. ఈ విషయం ఇంతటితో వదిలేయమని మీ అక్క కూడా ఆ అరుణ్‌ గాని విషయం మర్చిపోయి హ్యాపీగా ఉంది. నువ్వెందుకు ఇంకా ఆదే పట్టుకుని కూర్చున్నావు  అంటూ రాజ్‌ చెప్పడంతో.. నాకు తెలుసు మీరు నిజంగా చాలా మంచివారండి అని మనసులో అనుకుంటుంది కావ్య. కళ్యాణ్‌ తన నిశ్చితార్థం గురించి అప్పుకు చెప్పాలనుకుని అప్పుకు ఫోన్‌ చేస్తాడు అప్పు ఫోన్‌ కట్‌ చేస్తుంది. ఇంతలో అక్కడికి కనకం వస్తుంది. అప్పును తానే రేపు ఇక్కడికి రమ్మని చెప్పాననడంతో కళ్యాణ్‌ హ్యాపీగా లోపలికి వెళ్తాడు. కనకం బెడ్‌రూంలోకి వెళ్లి రుద్రాణి నైటీ వేసుకుని ఉంటుంది. రుద్రాణి లోపలకి వచ్చి చూసి షాక్‌ అవుతుంది.

రుద్రాణి: ఏయ్‌ ఇది నా నైటీలా ఉంది.

కనకం: లాంటి ఏంటి రుద్రాణి గారు మీ నైటీయే..

రుద్రాణి: నీకు ఎంత ధైర్యం ఉంటే నా పర్మిషన్‌ లేకుండా నా నైటీ వేసుకుంటావు.

కనకం: మరేం చేయమంటారు. ఉన్నపళంగా ఉండమన్నారు. నేనింకా బట్టలు తెచ్చుకోలేదు కదా?  ఏం చేద్దామా? అని ఆలోచిస్తుంటే.. కప్‌బోర్డులో ఆ చీరలు కనిపించాయి. ఆ చీరలు మనం కట్టలేం మీ చీరలు నేనెలా కడతాను అందుకే ఈ నైటీ వేసుకున్నాను.

అని కనకం వెటకారంగా చెప్పడంతో.. నువ్వు మాత్రం నా రూంలో ఉండొద్దు అంటూ సీరియస్‌గా రుద్రాణి చెప్తుంది. నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు.. ఈ ఇంట్లో  నీ రూంలో తప్పా నాకు ఎక్కడా చోటు లేదని రుద్రాణి చెప్తుంది.

బామ్మ హాల్లో కూర్చన్న రాజ్‌ను పిలిచి పంతులు గారు వస్తున్నారా? అని అడుగుతుంది. దారిలో ఉన్నాడట బామ్మ ఇందాక ఫోన్‌ చేశాను అని రాజ్‌ చెప్తాడు. కనకం దూరం నుంచి  వింటుంది. ఇంతలో అప్పు ఫోన్‌ చేసి నువ్వు ఉన్న ఇంటి ముందు ఉన్నాను బయటకు వచ్చి నీ బట్టలు తీసుకో అని చెప్తుంది. కనకం బయటకు వచ్చి..

కనకం: ఇదేంటే ఇక్కడే ఆగిపోయావు.. పరాయిదానిలాగా..

అప్పు: పరాయిదాన్ని కాకపోతే ఈ ఇంటికి నేనేం అవుతా.. నేను పోతా ఇది తీసుకో..

దీన్ని ఆపి నిశ్చితార్థం చెడిపోవడం చూసేలా చేద్దామనుకుంటే ఇలా చేస్తుందేంటి? అని మనసులో అనుకుంటుంది కనకం ఇంతలో కళ్యాణ్‌ కనిపించడంతో పిలుస్తుంది కనకం. కళ్యాణ్‌ దగ్గరకు వచ్చి అప్పును చూసి

కళ్యాణ్‌: హాయ్‌ బ్రో ఏంటి సర్‌ప్రైజ్‌.. అసలు ఊహించలేదు.. రాత్రి  ఫోన్‌ చేస్తుంటే అసలు లిఫ్ట్‌ చేయడం లేదేంటి? నువ్వు వస్తావని ఆంటీ చెప్పాక ఫోన్‌ చేయడం ఆపేశాను. పద లోపలికి వెళ్దాం.

అప్పు: లేదు నాకు పనుంది.

కళ్యాణ్‌: పనుందని చెప్పడానికి పని కట్టుకుని వచ్చావా? భలే దానివే ఇవాళ పంక్షన్‌కు నువ్వు లేకపోతే ఎలా?

అప్పు: పంక్షన్‌ ఏంటి?

కళ్యాణ్‌: అదేంటి ఆంటీ రాత్రి మీరు చెప్పానన్నారుగా..

మీ ఫ్రెండుకు మీరు చెప్తేనే బాగుంటుందని చెప్పలేదని కనకం చెప్తుంది. నాకు అనామికకు ముహూర్తం పెట్టుకుంటున్నాం. అని చెప్పగానే అప్పు షాక్‌ అవుతుంది. ఇంతలో కళ్యాణ్‌, అప్పు చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు. కనకం కూడా లోపలికి వెళ్తుంటే పంతులు గారు వస్తారు. కనకం ని చూసి టెన్షన్‌ పడతాడు. ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు.

ఇంట్లో అందరూ హ్యాపీగా కూర్చుని ఉంటారు. కనకం పంతులుగారికి  తన చేతిలో పట్టుకున్న పాయిజన్‌ బాటిల్‌ చూపిస్తుంది. దీంతో పంతులు గారు కంగారు పడుతుంటే.. అందరూ ఎందుకు కంగారుపడుతున్నారని అడుగుతారు. ఏమైనా దోషాలు ఉన్నాయా అని అడుగుతారు. దీంతో అమ్మాయి జాతకం బాగాలేదని పంతులు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ అయిపోతుంది. 

Also Read : 'త్రినయని' సీరియల్: పెద్దబొట్టమ్మకు విష భోజనం పెట్టిన సుమన - అన్నంలో పడ్డ కుభసం!

టాప్ హెడ్ లైన్స్

Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Karthika Deepam 2 Serial Today August 20th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని బాధ పెట్టిన సూరజ్! సూరజ్ ప్రవర్తన చూస్తే ఏదో తేడా కొడుతుందే!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని బాధ పెట్టిన సూరజ్! సూరజ్ ప్రవర్తన చూస్తే ఏదో తేడా కొడుతుందే!
Jagadhatri Serial Today August 19th:విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
జగద్ధాత్రి సీరియల్: విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget