అన్వేషించండి

Trinayani Today Episode : 'త్రినయని' సీరియల్: పెద్దబొట్టమ్మకు విష భోజనం పెట్టిన సుమన - అన్నంలో పడ్డ కుభసం!

Trinyani Today December 6th Episode : పెద్ద బొట్టమ్మకు సుమన భోజనానికి పిలిచి విషం పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది

Trinayani Telugu Serial Today Episode

విక్రాంత్, సుమన తమ గదిలో గొడవ పడుతుంటారు. సుమన నయని మీద నోరు పారేసుకుంటే విక్రాంత్ తిడతాడు. ఇక సుమన తన దగ్గర మూడు కోట్ల విలువైన నగలు ఉన్నాయని అంటే.. అవి దేనికీ ఉపయోగపడవు అని అన్నింటికంటే ముందు తినడానికి తిండి.. తాగడానికి నీరు ముఖ్యమని వాటిని సంపాదించుకో అని అంటాడు. 

సుమన: కొన్ని అడ్డంకులు తొలగించుకుంటే అందరి కన్నా ముందు స్థాయిలో ఉండొచ్చని అర్థమైంది
విక్రాంత్: అడ్డంకులు అంటే సమస్యలు అనే కదా.. మనుషులే అడ్డు అనుకొని వాళ్లని తొలగించాలి అనే దుర్మార్గమైన పనులు మాత్రం చేయకు.
సుమన: మనసులో.. పెద్ద బొట్టమ్మ మనిషి అయితే కదా.. మీరు బాధ పడిపోడానికి.. దాన్ని తప్పిస్తే ఇక ఉలూచి నన్ను వదిలి ఎక్కడికీ పోదు.. అప్పుడు పాపని అడ్డుపెట్టుకొని ఆస్తి ఎలా సంపాదించాలో నాకు బాగా తెలుసు
విక్రాంత్: హలో చెప్పింది అర్థమైందా.. అయినా పొగరెక్కిన మనిషికి ఇంకాం ఏం అర్థమవుతుంది.

హాల్‌లో సుమన అరటి ఆకు పెట్టి అందులో భోజనం వడ్డిస్తుంది. ఇక అప్పుడే పావనామూర్తి, హాసిని, డమ్మక్క అక్కడికి వస్తారు. ఇక మంచి ఆకలి మీద ఉన్న పావనామూర్తి సుమన తన కోసమే వడ్డించింది అని ఆ ఆకు ముందు కూర్చొంటారు. దీంతో సుమన సీరియస్ అయి ఆయన్ను పావనాను.. భోజనం తినకుండా లేపేస్తుంది. ఇంట్లో అందరూ వద్దు అని చెప్పినా వినదు. 

నయని: సుమన మతి లేని పనులు చేయకు
సుమన: అన్నం పెట్టడం మంచి పనే కదా అక్క
విశాల్: అన్నం ముందు కూర్చొన్నవాళ్లని తినకుండా లేపడం పాపం
విక్రాంత్: ఆ మాత్రం ఇంకితం ఉంటే బాగుండేది బ్రో
వల్లభ: ఓరేయ్ తమ్మి.. ఇవాళ కార్తీక పౌర్ణమి కదా మిగతా ఆడవాళ్లకు రాని ఆలోచన నీ భార్యకు వచ్చిందేమో.. భర్తకు తనే స్వయంగా వచ్చిండి తృప్తిగా తినే వరకు వడ్డించాలి అని అనుకుందేమో
హాసిని: ఆ కోరిక మీది ఏమో కదా
వల్లభ: హా కాదు.. నాకు నువ్వు టిఫెన్ కూడా పెట్టవు అని తెలుసు కదా
విశాల్: ఒక్క నిమిషం ఆగు అన్నయ్య.. సుమన మామయ్యని తిననివ్వలేదు.. విక్రాంత్‌ని కూర్చొమని చెప్పలేదు.. నువ్వా తినడం లేదు.. మరి ఎవరి కోసం ఈ భోజనం
సుమన: పెద్ద బొట్టమ్మ కోసం బావగారు
నయని: ఏంటి నువ్వు పెద్దమ్మకి భోజనం పెట్టాలని అనుకున్నావా..
హాసిని: అది కూడా నీ చేతులతో
పావనా: ఆమెను చూస్తే అరుస్తావ్.. ఆకలి తీరుస్తావా ఎందుకమ్మ అబద్ధం చెప్తావ్
సుమన: మీరు అలాగే అంటూ ఉండండి.. ఓ పెద్ద బొట్టమ్మ రా భోజనం చేద్దువు గాని.. కూర్చొ పెద్దమ్మ.. మనిషి రూపంలో ఉన్నావు కాబట్టి భోజనం చేయగలవు కాబట్టి ఇవన్నీ చేశాను. పాము రూపంలో ఉంటే పాలు మాత్రమే పోసేదాన్ని.. కార్తీకపౌర్ణమి రోజు నిండు ముత్తయిదువు అయిన నీకు భోజనం పెట్టి చీర, గాజులు, తాంబూలం పెట్టాలి అనుకున్నప్పుడు దోసెడు పాలు పోస్తే ఏం బాగుంటుంది చెప్పు అందుకే ఇలా.. తిను పెద్దమ్మ
పెద్దబొట్టమ్మ: పెద్ద బొట్టమ్మ అని ప్రేమగా పిలిచినా.. పెద్దమ్మ అని వరస కలిపి పిలిచినా సంతోషంగా బదులు ఇస్తాను. పున్నమి నాగునైన నాకు కడుపునిండా భోజనం పెట్టి వాయినం ఇస్తా అంటే కాదు అనలేకపోయాను
సుమన: అది కూడా నా బిడ్డ అని నువ్వు పిలిచే ఉలూచి సమక్షంలో తినడం నీకు ఇంకా సంతోషం కదా
పెద్దబొట్టమ్మ: సరే నువ్వు తిను.. నేను చీర తాంబూలం తెస్తాను
నయని: ఒక్క నిమిషం పెద్దమ్మ.. 
వల్లభ: తినడానికి కూర్చొన్న మామయ్యని ఆపితే తప్పు అన్నారు కదా.. ఇప్పుడు తినడానికి సిద్ధమైన పెద్దబొట్టమ్మని ఆపడం నేరం కాదా
హాసిని: చెల్లి ఏమైంది
నయని: నాకు అనుమానంగా ఉంది అక్క.. పెద్ద బొట్టమ్మ తినే భోజనం మీద
సుమన: ఏంటి అక్క అంటే నేను అందులో విషం కలిపి ఉంటాననా.. 
నయని: పెద్దమ్మ నువ్వు తినబోయే తొలి ముద్దని నాకు ఇవ్వు నేను తిన్నాక నువ్వు తిందువు గాని
పెద్దబొట్టమ్మ: ఏంటి నయనమ్మా అలా అడుగుతున్నావ్
నయని: మా చెల్లిలి మీద అనుమానం అని కాదు గాని.. ఎందుకో తొలి ముద్ద నేను తినాలి అనుకుంటున్నాను
విశాల్: నయని రిస్క్ తీసుకోకు
సుమన: మా అక్క అనుమానం కూడా తీరాలి కదా పెట్టండి

పెద్దబొట్టమ్మ మొదటి ముద్దని నయనికి ఇస్తుంది. నయని తింటుంది. ఇక పప్పుతో కూడా తినపించమని సుమన వడ్డిస్తుంది. 
విశాల్: అక్కర్లేదు నయని ఒక్క ముద్ద మాత్రమే అడిగింది
సుమన: మనసులో.. మా అక్క ఇలా చేస్తుంది అని తెలిసే ముందు పప్పు వేయలేదు బావగారు.. ఇప్పుడు పెద్ద బొట్టమ్మకు వేసిన పప్పును అన్నంలో కలుపుకొని తింటుంది. అని అనుకొని తాంబూలం తీసుకురావడానికి వెళ్తుంది. 
నయని: మనసులో..  గాయత్రీ దేవి ఫొటో చూస్తూ.. అమ్మగారు మా చెల్లిలో ఇంత మార్పు వచ్చింది అంటే నమ్మలేకపోతున్నా. మనుషులకు ఆపద వస్తే గ్రహించగలను కానీ సర్ప జాతి అయిన పెద్ద బొట్టమ్మ విషయంలో అనుమానించ గలను కానీ ఆధారం సంపాదించలేను. కీడు అయితే జరగదు కదా.. అను నయని అంటే అప్పుడు పెద్ద గాలి దుమారం రేగుతుంది. దీంతో పెద్ద బొట్టమ్మ తినలేకపోతుంది. మరోవైపు భోజనంలో పాము కుభసం(పాము పొర) పడుతుంది. దీంతో తినకుండా పెద్ద బొట్టమ్మ లేచేస్తుంది. 

సుమన: బల్లి పడినట్లు చెప్తావ్ ఏంటి అక్క.. దాన్ని పక్కకు పడేసి తినేస్తుంది.
పెద్దబొట్టమ్మ: ఏం అనుకోకు సుమన భోజనం చేసేటప్పుడు కుభసం పడితే మేము మరుసటి రోజు వరకు పచ్చి మంచి నీళ్లు కూడా తాగము. 
విశాల్: అరే సుమనకు నీ మీద ఎంత కోపం ఉన్నా కార్తీక పౌర్ణమి రోజు నీకు భోజనం పెట్టాలి అనుకుంది అంటే మంచి పని చేసింది అనుకున్నాం. 
హాసిని: సడెన్‌గా గాలి రావడంతో ఎక్కడో ఉన్న కుభసం అన్నంలో పడడంతో పెద్ద బొట్టమ్మ విరమించేసుకుంది
సుమన: మనసులో.. ఛా.. చస్తుంది అంటే బతికిపోయింది.. అర్జెంట్‌గా దీన్ని ఇక్కడి నుంచి బయటకు పంపేయాలి
డమ్మక్క: సుమన అనుకున్నది ఒకటి అయింది ఒకటి.. ఎవరైనా తిన్నాక తాంబూలం తీసుకుంటారు. నువ్వు తినకముందే తాంబూలం ఇచ్చి పుణ్యం కట్టుకో. 
సుమన: ఇవ్వకుండా ఎలా ఉంటాను తీసుకో పెద్దమ్మ
పెద్దబొట్టమ్మ: ఉలూచి మీ అమ్మ ఇచ్చిన చీర ఈ అమ్మకి నప్పుతుందా.. బాగుందా లేదా చెప్పు.. 
సుమన: నెలల పిల్ల బదులు ఏమిస్తుంది కానీ ఇక బయలుదేరు పెద్దమ్మ
పెద్దబొట్టమ్మ: వెళ్తాను సుమన. ఇలాగే నువ్వు ఆదరిస్తే అంతకన్నా ఆనందం ఉండదు. 
సుమన: సమయం సందర్భం రావాలి.. అది కూడా నేను పిలవాలి. అంతే కానీ ఎప్పుడు పడితే అప్పుడు రావొద్దు. 
నయని: అంత కఠినంగా చెప్పకూడదు చెల్లి
విశాల్: ఆవిడ ఇంకా ఇక్కడే ఉంటే సుమన ముందులా మారిపోతుంది.. పెద్ద బొట్టమ్మ వెళ్లిపోతుంది.

మరోవైపు రాత్రి సమయంలో విశాల్ తమ ఇంటి ఆరు బయట బూతద్దంతో నేలను చూస్తూ ఉంటాడు. ఇంతో నయని అక్కడికి వస్తుంది. ఏమైంది అని అడుగుతుంది. దీంతో చూస్తే నీకు అర్ధమవుతుంది అని విశాల్ బదులిస్తాడు నయని చూస్తుంది. 
నయని: ఇవ్వండి.. పాము పాకినట్లు చారల అచ్చులు కనిపిస్తుంది బాబుగారు
విశాల్: ఉలూచి అయితే కాదు
నయని: నాగయ్య వస్తే నాకు కనిపించేవాడు కదా
విశాల్: పెద్ద బొట్టమ్మనే
నయని: తాంబూలం తీసుకొని వెళ్లి పోయింది కదా బాబుగారు
విశాల్: లేదు నయని.. నా గెస్ కరెక్ట్ అయితే తాను ఇక్కడే ఎక్కడో ఉండాలి
నయని: అవునా.. నాగులా పురం పెట్టెలో ఉన్న గవ్వలు ఈ ఇంట్లో ఉన్నంత వరకు తను మనందరికీ కనిపిస్తుంది అని చెప్పింది కదా. అప్పుడు ఇక్కడే ఉంటే కనిపిస్తుంది కదా
విశాల్: అలా ఎలా కనిపిస్తుంది నయని.. పాము రూపంలో పాకుతూ ఉంటే.. 
నయని: భోజనం పెట్టి వాయినం ఇవ్వాలని సుమన అనుకున్నా అది జరగలేదు.. భోజనంలో కుభసం పడటం కంటే ముందు ఆహారంలో విషం పడింది బాబుగారు.. 
విశాల్: విషమా..
నయని: అవును ఇలా చూడండి(అరటి ఆకు నల్లగా మారింది).. చూశారా సుమన దుర్మార్గం. విష ప్రయోగం జరిగింది అని అర్థం.. దురదృష్టం ఏంటి మనుషులకు వచ్చే ఆపద కనుక్కోగలను కానీ.. సర్పం అయిన పెద్దబొట్టమ్మకు వచ్చే ఆపద గుర్తించలేను. అప్పటికీ అనుమానం వచ్చింది. హాని జరుగుతుంది ఏమో అని పించింది కానీ పూర్తిగా తెలుసుకోలేని పరిస్థితి బాబుగారు. పెద్ద బొట్టమ్మ తినకుండా లేచింది కానీ లేదంటే ఏం జరిగుండేదో. 
విశాల్: తను విష సర్పం అయినా సరే తనని కూడా బలి తీసుకోవాలి అనుకుంది అంటే మీ చెల్లి ఎలాంటి ఆడదో అర్ధమవుతుంది. నయని మీ చెల్లిని ఇలా అన్నందుకు నన్ను క్షమించు. 
నయని: మీ లాంటి మంచి వాళ్లకే తన మీద కోపం వస్తుంది అంటే తన క్యారెక్టర్‌ని ఎంత దిగజార్చుకుందో అర్థమవుతుంది. ఉలూచి పాప కోసం వచ్చిన పెద్దబొట్టమ్మ సుమన దుర్మార్గాన్ని గుర్తించలేదు ఏమో. 
విశాల్: ఏది ఏమైనా సరే నయని .. సుమనతో నువ్వు జాగ్రత్త.. రక్త సంబంధాన్ని అడ్డుపెట్టుకొని ఎంతకైనా తెగించొచ్చు

ఇక ఉదయం కడుపునొప్పితో సుమన చాలా ఇబ్బంది పడుతుంది. విక్రాంత్ వచ్చి సెటైర్లు వేస్తాడు. ఇక పావనామూర్తి, డమ్మక్క అక్కడికి వస్తారు. డమ్మక్క విశాలాక్షి అమ్మవారి దగ్గర ఉంచిన విభూది కలిపిన పాళ్లను సుమనకు ఇస్తుంది. సుమన వాటిని తాగుతుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read : ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : అనామిక జాతకం బాగాలేదన్న పంతులు - అప్పును ఇంట్లోకి తీసుకెళ్లిన కళ్యాణ్

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget