అన్వేషించండి

Krishna Mukunda Murari December 2nd Episode ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్: రెస్టారెంట్‌లో రచ్చ రచ్చ చేసిన మురారి - టెన్షన్‌లో భవాని, ముకుంద!

Krishna Mukunda Murari Today Episode: రెస్టారెంట్‌కి వెళ్లిన మురారి అక్కడ వేరే కపుల్‌ని చూసి తన గతాన్ని గుర్తుచేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది

Krishna Mukunda Murari serial today Episode: శ్రీనివాస్ ఇంట్లో కృష్ణని భవాని, ముకుంద, మురారి చూసేస్తారు. భవాని కృష్ణకు చీవాట్లు పెడుతుంది. తర్వాత కాఫీ తీసుకురమ్మని చెప్పడంతో కృష్ణ వాళ్లందరికీ కాఫీ తీసుకెళ్తుంది. మరోవైపు రేవతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది.

రేవతి: శ్రీనివాస్ అన్నయ్య వద్దు కృష్ణ జీవితాన్ని పాడుచేయొద్దు అని చెప్తే బాగున్ను. అయినా కన్నతల్లిని నాకే వద్దు అనే చెప్పే ధైర్యం లేక ఇలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నా ఇక శ్రీనివాస్ అన్నయ్య ఏం చెప్తారులే. ఒక రకంగా కూతురి జీవితం బాగుంటుంది అంటే ఈ కన్న తండ్రికి అయినా సంతోషమేగా
శకుంతల: ఏంటి వదినా ఇక్కడ ఒక్కదానివి కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు.
రేవతి: వదిన నేను ఓ మాట అడుగుతా సూటిగా సమాధానం చెప్తావా. ప్రభాకర్ అన్నయ్య ఎందుకు జైలుకి వెళ్లారు. నిజం చెప్పండి వదినా.
శకుంతల: ఇలా అడిగితే ఏం చెప్పగలను. ఎవరైనా కళ్లకు కనిపించిందే నిజం అనుకుంటారు కదా
రేవతి: అయ్యో అదేం లేదు వదినా.. అన్నయ్య తప్పు చేశాడని.. మీ అల్లుడు ఇలా కావడానికి ప్రభాకర్ అన్నయ్యే కారణం అని అక్కయ్య గట్టిగా నమ్ముతోంది. కాదని చెప్పడానికి మా దగ్గర సమాధానం లేక ఇలా మౌనంగా ఉంటున్నాము. అందుకే మిమ్మల్ని అడిగా.
శకుంతల: మీదేం తప్పు లేదు వదినా.. చెప్పాలి అంటే పెద్ద వదినది కూడా ఏం తప్పులేదు. కానీ ఏం చేయాలి.. ఏం తప్పు చేశావని జైలుకి వెళ్తున్నావ్ అని ఆ రోజు అడిగా.. ఇలా చేస్తేనే మన కిట్టమ్మ మొగుడు దగ్గర ఉంటుంది. అందుకే ఇలానే చేస్తా అని జైలుకి పోయాడు. అంతే వదిన నాకు తెలిసింది ఇంతే. అంతకు మించి నాకు ఏమీ తెలీదు. అవసరం అయితే నువ్వు ఎవరి మీద ఒట్టు వేయమన్నా వేస్తా
రేవతి: అయ్యో మిమల్ని నేను నమ్ముతున్నా.. అవును కృష్ణ ఎక్కడ.. భగవంతుడా ఈ చిక్కు ముడి వదలడం ఎలా

ఇంతలో రేవతి దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి శుభలేఖలు మోడల్‌లు తీసుకొచ్చా అని చెప్తాడు. మధు వచ్చి అతన్ని వెయిట్ చేయమని చెప్తాడు. రేవతిని అక్కడి నుంచి తీసుకెళ్లి పోతాడు. ఇక భవాని, ముకుంద, మురారి శ్రీనివాస్ ఇంటి నుంచి బయలుదేరుతారు. 
ముకుంద: అత్తయ్య కృష్ణ కూడా మనతోనే రావాలి అని ట్రై చేస్తుంది. 
భవాని: సరే శ్రీనివాస్ శుభలేఖలు వస్తే మేము మీకు కబురు పంపుతాం. 
శ్రీనివాస్: మనసులో.. సాధ్యమైనంత త్వరగా నీకు గతం గుర్తురావాలని చూస్తున్నాను మురారి
మురారి: వేణిగారు మీరు మాతో పాటే రండి
భవాని: మురారి డ్రైవర్ ఉన్నాడు కదా మళ్లీ మీ ఇద్దరి మధ్య తను ఎందుకు వేణి గారు ఎలా వచ్చారో అలానే వెళ్తారు మీరు వెళ్లండి
శ్రీనివాస్: నన్ను క్షమించమ్మ 
కృష్ణ: అయ్యో బాబాయ్ మీరు నాకు అలా చెప్పడం ఏంటి. కానీ మీరు నాకు ఓ హెల్ప్ చేస్తారా బాబాయ్.. నేను ముకుంద జీవితాన్ని చక్కబెడతాను. చేస్తాను కూడా అది గుర్తు పెట్టుకొని మీరు నాకు ఈ సాయం చేయండి. అని ఓ ప్లాన్ చెప్తుంది. అది బాబాయ్ నెంబరు ఇచ్చాను ఫోన్ చేయండి
శ్రీనివాస్: సరే అమ్మా
మురారి: మనసులో.. ఎంత వద్దు అనుకున్నా ఒక్క నిమిషం ఒక్క సెకన్ కూడా వేణి గారి గురించి నెగిటివ్‌గా ఆలోచించలేకపోతున్నా. లేదు.. పెద్దమ్మ అబద్ధం అయినా చెప్పుండాలి. లేదంటే ముకుంద జీవితం బాగుండాలి అని అయినా ఇదంతా చేస్తుండాలి. 
ముకుంద: మురారి ఏంటి అలా ఆలోచిస్తున్నావ్
మురారి: లేదు ఏం ఆలోచించాలో అదే ఆలోచిస్తున్నా
భవాని: మనసులో.. నేను కృష్ణతో మాట్లాడటం చూసి బాగా డిస్ట్రబ్ అయినట్లున్నాడు. ఏం ఆలోచించాలా అదే బాగా ఆలోచించు నీకే అర్థమవుతుంది
ముకుంద: దేని గురించి అత్తయ్య
భవాని: ఇంకా దేని గురించి ముకుంద ఆ వేణి గురించే కృతజ్ఞత లేని మనిషి. డ్రైవర్ మంచి రెస్టారెంట్ దగ్గర ఆపు

మరోవైపు రేవతి వంట గదిలో ఆకుకూరలు తరుగుతూ అవుట్ హౌస్‌లో కోడల్ని పెట్టుకొని.. నా కొడుకుకు మరో పెళ్లి ఏంటి దేవుడా ఇదంతా.. శకుంతలని అడిగితే అంతే తెలుసు అంటుంది. ఇప్పుడు ఎలా దేవుడా ఇంతలో నందూ అక్కడికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావ్ పిన్ని అడిఅడుగుతుంది. మురారి కృష్ణలను ఆ భగవంతుడు విడదీస్తున్నాడు అని కన్న తల్లి అయినా తను ఏం చేయలేకపోతుంది అని బాధపడుతుంది. శుభలేఖలు కూడా ఆర్డర్ చేశారని చెప్తుంది. ఈ పెళ్లి ఎలా ఆపాలి అని బాధపడుతుంది. ఇక నందూ మనం సైలెంట్‌గా ఉంటే కృష్ణ మాత్రం అలా ఊరుకోదు అని నందూ చెప్తుంది. ధైర్యంగా ఉండమని చెప్తుంది. 

మరోవైపు భవాని, ముకుంద, మురారి రెస్టారెంట్‌కి వస్తారు. ఇంతలో ముకుంద ఏంటి మురారి అంత డల్‌గా ఉన్నావ్. అసలు అత్తయ్య ఇంత వరకు రెస్టారెంట్‌కి రాలేదు తెలుసా. నీకోసం ఈరోజు ఫస్ట్‌ టైం వచ్చారు. డిసప్పాయింట్ చేయకు హ్యాపీగా ఉండు మురారి. కూర్చొ అని అంటుంది. దానికి మురారి అలాంటిది ఏం లేదు ముకుంద అని చెప్తుంది. ఇక భవాని ఫుడ్ ఆర్డర్ చేస్తుంది.

మురారి వాళ్లు కూర్చొన్న టేబుల్ పక్కన ఓ జంట కూర్చొంటారు. అందులో ఆ వ్యక్తి తన భార్య చేతి బిర్యాని తినాలి అంటాడు. అందుకు ఆ భార్య వెయిటర్‌ని వెళ్లిపోమని తను తన భర్తకు బిర్యాని వడ్డిస్తుంది. ఆ సీన్ మురారికి గుర్తొస్తుంది. ఆ మహిళ దగ్గరకు వచ్చి మీరు ఎప్పుడైనా ఇక్కడ తినడానికి వచ్చి నాకు తినిపించారా అని అడుగుతాడు. అందరూ షాక్ అవుతారు. ఆ మహిళ షాక్ అయి మీకు నేను వడ్డించడం ఏంటి? అని అడుగుతుంది. దీంతో మురారి లేదు నువ్వే ఇదే రెస్టారెంట్‌లో మీరే నాకు వడ్డించారు. నాకు బాగా గుర్తొస్తుంది. లేదు పెద్ద లేదు తాను ఇలాగే నాకు వడ్డిస్తుంటే నేను తిన్నాను.

రెస్టారెంట్‌కి కృష్ణ కూడా వస్తుంది. ఆమెను చూసి మురారి.. ‘‘వేణి గారు వచ్చారా’’ అంటాడు. దీంతో వేణి ‘‘సార్ నేను అంతా విన్నాం. వీళ్లు వేరే వాళ్లు అయింటారు. ముందు మీరు వాళ్లకి సారీ చెప్పండి’’ అని చెప్తుంది. దీంతో మురారి ఆ జంటకు సారీ చెప్తాడు. తర్వాత భవాని, ముకుంద, కృష్ణ, మురారి అక్కడి నుంచి వెళ్లిపోతారు.

మరోవైపు రేవతి కృష్ణ ఇంటికి రాలేదు అని మధు మీద చిటపటలాడుతుంది. కార్డుల వరకు సమస్య వచ్చిదంటే మనం ఇంత సైలెంట్‌గా ఎలా ఉంటామని నందూ అంటుంది. అయితే మధు కృష్ణ ఈ పెళ్లి జరగనివ్వదు అంటాడు. ఇంతలో గౌతమ్ అత్తయ్య వాళ్లు వస్తున్నారు అంటే అందరూ సైలెంట్ అయిపోతారు. మురారి రావడం రావడం చిరాకుగా తన గదికి వెళ్లిపోతాడు ఇంతటితో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget