Krishna Mukunda Murari September 7th: మురారీ తన భర్తని చెప్పకనే చెప్పిన ముకుంద- భవానీ మాటలకు షాకైన శ్రీనివాసరావు
మురారీతో తన ప్రేమ సంగతి ఎలాగైనా భవానీకి తెలియాలని ముకుంద విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
![Krishna Mukunda Murari September 7th: మురారీ తన భర్తని చెప్పకనే చెప్పిన ముకుంద- భవానీ మాటలకు షాకైన శ్రీనివాసరావు Krishna Mukunda Murari Serial September 7th Episode 256 Written Update Today Episode Krishna Mukunda Murari September 7th: మురారీ తన భర్తని చెప్పకనే చెప్పిన ముకుంద- భవానీ మాటలకు షాకైన శ్రీనివాసరావు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/07/2f1c729c92f51a9960e8eb33a2f74e7c1694056615569521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Krishna Mukunda Murari September 7th: ముకుంద తండ్రి దగ్గరకి వచ్చి మురారీతో తన ప్రేమ గురించి భవానీకి చెప్పేయమని లేదంటే చచ్చిపోతానని బెదిరిస్తుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కూతురికి నచ్చజెపుతాడు. చన్నీటితో స్నానం చేసి కృష్ణ వణికిపోతూ ఉంటుంది. భార్య అందాన్ని చూసి మురారీ టెంప్ట్ అయిపోతాడు. వరలక్ష్మీ వ్రతం చేసిన తర్వాత అందరి ముందు ఎలాగైనా మురారీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని, అందరికీ మురారీనే తన భర్త అని తెలియాలని ముకుంద అనుకుంటుంది. మురారీని ప్రేమగా ఏవండీ అని కృష్ణ పిలుస్తుంది. ఆ పిలుపు వినేసరికి మురారీ పొంగిపోతాడు. ఇంట్లో వ్రతం చేసేందుకు అన్నీ ఏర్పాట్లు జరుగుతాయి. శ్రీనివాసరావు రాగానే ముకుంద వెళ్ళి సంతోషంగా కౌగలించుకుంటుంది. అందరూ జంటలుగా ఉండటం చూసి బాధపడతాడు.
శ్రీనివాసరావు: నాకు తెలుసు ఈ ఇంట్లో అందరూ వేరు నువ్వు వేరు అని. అందుకే ఈ చీర తీసుకొచ్చాను కట్టుకో
భవానీ: ఏం మాట్లాడుతున్నారు మీరు
Also Read: కోడలి తుప్పు వదిలించిన భవానీ- మురారీ దక్కకపోతే చచ్చిపోతానన్న ముకుంద
శ్రీనివాసరావు: తప్పుగా అర్థం చేసుకోవద్దు తన భర్త ఇక్కడ లేడు కదా తన మొహంలో దిగులు కనిపించడం లేదా? వీళ్లందరినీ చూడండి నా కూతురు మొహం చూడండి. భవానీ ఏదో ఒక దారి చూపిస్తారు. అతి త్వరలోనే నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉంటావ్ అని కూతురికి ధైర్యం చెప్పేసి వెళ్లిపోతానని అంటాడు.
పూజ అయ్యే వరకు ఉండి వెళ్లమని భవానీ చెప్తుంది. ముకుంద వాళ్ళ నాన్న వచ్చారు కదా ఈరోజు ఎలాగైనా మురారీతో ప్రేమ గురించి ఎలాగైనా తెలిసిపోతుందని అలేఖ్య మధుకర్ తో చెప్తుంది. పూజ అయిన తర్వాత మాట్లాడాలని భవానీ అంటుంది. ముకుంద, మురారీ సంగతి చెప్పేయాలని శ్రీనివాసరావు అనుకుంటాడు. ఇంట్లో ఆడవాళ్ళు అందరూ వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ప్రతి జన్మకి ఏసీపీ సర్ భర్తగా రావాలని కృష్ణ మనసులో అనుకుంటుంది.
తన మనసులో మురారీకి తప్ప ఇంకెవరికీ స్థానం లేదని ముకుంద ఫీల్ అవుతుంది. కృష్ణ మురారీ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ టైమ్ లో ముకుంద కావాలని తన చెవి కమ్మ మురారీ కాళ్ళ దగ్గర పడేలా చేస్తుంది. దాన్ని తీసుకునే వంకతో మురారీ పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకుంటుంది. అది చూసి కృష్ణ షాక్ అవుతుంది. అందరి ముందు తన భర్త మురారీ అని చెప్పకనే చెప్పిందని అలేఖ్య అనుకుంటుంది. ఎంతకు తెగించిందని రేవతి ముకుందని తిట్టుకుంటుంది. ఇక భవానీ శ్రీనివాసరావుతో మాట్లాడుతుంది.
Also Read: కళావతి మీద రాజ్ దొంగ ప్రేమ - స్వప్న, రాహుల్ ఎక్కడికి వెళ్ళినట్టు!
భవానీ: ప్రతిరోజూ మీరు నాకు మెసేజ్ పెట్టడంలో అర్థం ఏంటి? ఆదర్శ్ గురించి గుర్తు చేయడానికా? మీరు చెప్పింది నిజమే శ్రీనివాసరావు ఆదర్శ్ కావాలనే మా ఇంటికి తిరిగి రావడం లేదట. కల్నల్ కాల్ చేసి చెప్పారు. మీరు ఏం చెప్పారో కల్నల్ కూడా అదే చెప్పారు. నాకు షాకింగ్ గా అనిపించింది. మా వాడి గురించి మాకు తెలియని విషయం మీకు ఎలా తెలిసింది
తరువాయి భాగంలో..
మురారీ మన ప్రేమ కథకి క్లైమాక్స్ దగ్గర పడిందని ముకుంద అనుకుంటూ ఉండగా కృష్ణ వచ్చి పలకరించి సోరి చెప్తుంది. ఇంట్లో మేమందరం జంటగా ఉంటే నువ్వు మాత్రం ఒంటరిగా ఉన్నావని కృష్ణ జాలి చూపిస్తుంది. కానీ ముకుంద మాత్రం కోపంగా తనని మాట్లాడొద్దని అరుస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)