Krishna Mukunda Murari August 16th: మురారీకి భార్యగా మారిన ముకుంద- నందు చేసిన ప్రయత్నంతో కృష్ణకి మురారీ ప్రేమ తెలుస్తుందా?
కృష్ణ అత్తింటిని వీడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ఇంట్లో అందరికీ కృష్ణ వీడ్కోలు చెప్తుంది. సక్సెస్ ఫుల్ గా క్యాంప్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేయమని భవానీ కృష్ణతో అనేసరికి మురారీ ఫీల్ అవుతాడు. గౌతమ్ నందు కోసం వెతుకుతాడు. అప్పుడే అందరూ తను లేదనే విషయాన్ని గమనిస్తారు. ఇందాకటి దాకా ఇక్కడే ఉంది కదా ఎక్కడికి వెళ్ళిందని వెతకడానికి గౌతమ్ వెళ్లబోతుంటే మురారీ ట్యాబ్లెట్ తీసుకోవడానికి వెళ్ళిందని అబద్ధం చెప్తాడు. నిన్న అందరం గ్రూప్ ఫోటో తీసుకున్నాం కదా ఇప్పటికీ మనం కానిచ్చేద్దాములే అని కంగారుగా అంటాడు. ఇక అందరూ కలిసి ఒక ఫోటో దిగుతారు. అప్పుడే ఒక వ్యక్తి ఫంక్షన్ ఫోటోస్ తీసుకొచ్చి ఇస్తాడు. అవన్నీ ఆల్బమ్ చేయిస్తున్నా కదా మళ్ళీ సెపరేట్ గా ఎందుకు తీసుకున్నావని భవానీ అడుగుతుంది. మిమ్మల్ని మిస్ అవుతాను కదా అందుకే వీటిని తీసుకున్నానని కవర్ చేస్తుంది. కోడలు వెళ్లిపోతున్నందుకు రేవతి చాలా బాధపడుతుంది. ఇక మురారీ కృష్ణని తీసుకుని బయల్దేరతాడు. ఒక సాడ్ సాంగ్ వేసి సీన్ మంచిగా రక్తికట్టించారు. కృష్ణ ఏడుస్తూ అందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది.
Also Read: కావ్యతో కారులో రాజ్ అంతరాత్మ సరసాలు- ప్రెగ్నెంట్ కాలేకపోయిన ఫ్రస్టేషన్ లో స్వప్న
ముకుంద అద్దం ముందు కూర్చుని కృష్ణ వెళ్లిపోయిందని సంతోషపడుతుంది. మురారీతో కలిసి బెడ్ షేర్ చేసుకున్నట్టు తనతో కలిసి డాన్స్ చేసినట్టు తెగ ఊహించేసుకుంటుంది. మురారీకి అన్నీ తనే దగ్గరుండి సేవలు చేస్తున్నట్టు ఫీలవుతుంది. తన కలలన్నీ నిజం కాబోతున్నాయని సిగ్గుపడుతుంది. మన ప్రేమ పెళ్లి పీటలు ఎక్కబోతుందని అనుకుంటూ మురారీతో డాన్స్ చేస్తుంది. నందు తన చేతులు కట్లు విప్పుకుని డోర్ కొడుతుంది. కృష్ణ ప్రేమలో పడి మురరీ పిచ్చి వాడివి అయిపోతున్నావని అరుస్తుంది. ఎవరైనా వచ్చి డోర్ తీయమని కేకలు పెడుతుంది. నందు డోర్ కొట్టిన సౌండ్ విని భవానీ తలుపు తీస్తుంది. మురారీ వాళ్ళ గదిలో ఉండటం చూసి ఏమైందని కంగారుపడుతుంది. ఎవరు నిన్ను లోపలేసి గడియ పెట్టారని అడుగుతుంది.
గౌతమ్: కృష్ణ వాళ్ళు వెళ్లిపోయారని ఎవరూ లేరని అనుకుని నేనే డోర్ లాక్ చేశాను
భవానీ: గౌతమ్ డోర్ గడి పెడుతుంటే నువ్వు లోపల ఏం చేస్తున్నావ్ నందు
నందు: కృష్ణ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాష్ రూమ్ కి వెళ్ళాను అప్పుడే గౌతమ్ డోర్ లాక్ చేశాడు మమ్మీ
భవానీ: ఇద్దరూ అబద్దం చెప్తున్నారు. ఏదైనా గొడవ పడ్డారా?
నందు: లేదు మమ్మీ కృష్ణ వాళ్ళు ఎక్కడ ఉన్నారు
గౌతమ్: వాళ్ళు క్యాంప్ కి వెళ్లిపోయారు
నందు: కృష్ణ బ్యాగ్ కీ నా దగ్గరే ఉంది వెళ్ళి తనకి ఇచ్చేసి వస్తాను మమ్మీ
Also Read: కీలక మలుపు, తల్లికాబోతున్న వేద- యష్ కి నీలాంబరి సాయం, తప్పించుకున్న మాళవిక
ఇద్దరూ కారులో వెళ్తూ మాట్లాడుకుంటారు. అంతా నీ వల్లే జరిగిందని నందు గౌతమ్ ని తిడుతుంది. ఇక కృష్ణ వాళ్ళు మరొక కారులో వెళ్తూ మరో విరహ గీతం వేసుకుంటారు. అందరికీ బాయ్ చెప్పాను కానీ నందుకి చెప్పలేదని కృష్ణ ఫీలవుతుంది. ఆవేశంలో నందుని గదిలో పెట్టి వచ్చాను ఎంత ఫీలవుతుందో ఏమోనని మురారీ అనుకుంటాడు. గౌతమ్ కృష్ణకి వాయిస్ మెసేజ్ పంపించమని నందుకి ఐడియా ఇస్తాడు. ‘కృష్ణ మురారీకి నువ్వంటే ప్రాణం. వాడు తన ప్రేమని నీకు చెప్పలేక తనలో తాను కుమిలిపోతాడు. నువ్వు లేకుండా వాడు బతకలేడు అర్థం చేసుకో. ఈ విషయం నీకు చెప్పాలని చాలా సార్లు అనుకున్నా కానీ మురారీ చెప్పనివ్వలేదు. కానీ నీ మనసులో వాడి మీద అభిమానం తప్ప ప్రేమ లేదని అనుకుంటున్నాడు. నిజం చెప్పు కృష్ణ మా అన్నయ్య అంటే నీకు ఇష్టం లేదా? నీ సమాధానం ఏదైనా మేము అంగీకరిస్తాం కానీ నిజం చెప్పు’ అని మెసేజ్ పెడుతుంది. కృష్ణ ఏం సమాధానం చెప్తుందోనని ఇద్దరూ కంగారుపడతారు.
కృష్ణ: మన అగ్రిమెంట్ విషయం చెప్పకుండా వెళ్లిపోతున్నందుకు చాలా గిల్టీగా ఉంది. ఇప్పుడు నందు, రేవతి అత్తయ్యకి తప్ప మన అగ్రిమెంట్ గురించి ఎవరికీ తెలియదు. తర్వాత తెలిస్తే నా గురించి ఏమనుకుంటారు. నా అవసరం కోసం మీ ఫ్యామిలీని మోసం చేశానని అనుకుంటారు కదా. నన్ను చెప్పనివ్వలేదు మీరు చెప్పలేదు. అందరిలో నన్ను దోషిని చేశారు