అన్వేషించండి

Premi Viswanath: కార్తీక దీపం వంటలక్క 'ప్రేమి విశ్వనాథ్'.. ఈ కేరళ కుట్టి తెలుగు వాళ్లకు ఎలా దగ్గరైందంటే?

Premi Viswanath: వంటలక్కగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ లాయర్‌గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఆ తర్వాత యాక్టింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుందీ కేరళ కుట్టి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రేమి విశ్వనాథ్ 'కార్తీక దీపం' వంటలక్కగా తెలుగునాట సుపరిచితురాలు.
  • మలయాళం 'కరతముత్తు' రీమేక్ 'కార్తీక దీపం'తో తెలుగులోకి ప్రవేశం.
  • ఆ సీరియల్ రికార్డు టీఆర్పీలతో విశేష ప్రజాదరణ పొందింది.
  • 'కార్తీక దీపం 2'తో పాటు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు.

Premi Viswanath: తెలుగు బుల్లితెరపై 'కార్తీక దీపం' సీరియల్‌లో వంటలక్క పాత్రతో ప్రతి ఇంటా సొంత కుటుంబ సభ్యురాలిగా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రేమి విశ్వనాథ్. కేరళకు చెందిన ఈమె తన అద్భుతమైన నటనతో తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన ఆదరణ, అభిమానాన్ని సొంత చేసుకుంది. ప్రేమి విశ్వనాథ్ సీరియల్ కెరీర్, రియల్ లైఫ్ విషయాల గురించి తెలుసుకుందాం. 

ప్రేమి విశ్వనాథ్ కేరళలోని ఎర్నాకులం (కొచ్చి) లో జన్మించింది. ఆమె విద్యాభ్యాసానికి వస్తే, న్యాయవాద కోర్సు పూర్తి చేసింది.  యాక్టింగ్ స్టార్ట్ చేయకముందు ఆమె కొచ్చిలోని ఒక ప్రైవేట్ సంస్థలో లీగల్ అడ్వైజర్‌గా పనిచేసింది. 

 సీరియల్ కెరీర్  

ప్రేమి విశ్వనాథ్ తన నటనను మోడలింగ్ ద్వారా ప్రారంభించింది. ఆపై మలయాళ బుల్లితెరకు పరిచయమయ్యింది. ఏషియానెట్ ఛానల్‌లో వచ్చిన 'కరతముత్తు' అనే సూపర్ హిట్ సీరియల్ ద్వారా ఆమె నటిగా పేరు తెచ్చుకుంది. ఇందులో నల్లటి రంగు ఉన్న అమ్మాయి ‘కార్తీక’గా ఆమె చేసిన నటనకు కేరళ ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు.  ఈ సీరియల్‌కు గానూ ఆమె బెస్ట్ డెబ్యూ నటిగా అవార్డు కూడా దక్కించుకుంది.  ఆ తర్వాత 'మూనుమణి' అనే మరో మలయాళ సీరియల్‌లో నటించింది.

మరింత మంది సీరియల్ నటులు గురించి ఇక్కడ తెలుసుకోండి

1 నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా..
2 గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఇంటి పెద్ద సత్యం అసలు పేరు
3 బుల్లితెరపై రాణిస్తున్న అన్షురెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
4 గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్ గ్రౌండ్ తెలుసా!
5 ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసి.. కలవారి కోడలు 'కనకమహాలక్ష్మి' రియల్ లైఫ్ విషయాలు

'కరతముత్తు' సీరియల్ తెలుగులో 'కార్తీక దీపం' పేరుతో రీమేక్ చేసినప్పుడు ప్రేమి విశ్వనాథ్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 2017 అక్టోబర్ నుంచి దాదాపు 6 సంవత్సరాల పాటు సాగిన ఈ సీరియల్ తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక టీఆర్‌పీ రికార్డులు సొంత చేసుకుంది. 'డాక్టర్ బాబు-వంటలక్క' జోడి తెలుగు పాప్ కల్చర్‌లో ఒక భాగంగా మారింది. 

'కార్తీక దీపం' మొదటి భాగం ముగిసిన తర్వాత, ప్రేక్షకుల డిమాండ్ మేరకు 'కార్తీక దీపం 2 - ఇది నవ వసంతం' కూడా ప్రేమి విశ్వనాథ్ 'దీప'గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.  

నటనతో పాటు, ఆమెకు బిజినెస్, ప్రొడక్షన్‌పై కూడా మంచి ఆసక్తి ఉంది. పరిశ్రమలో ఉండటం వల్లనే ప్రొడక్షన్ పట్ల ఆసక్తి పెరిగిందని, గతంలో తనకు అలాంటి ఆలోచన లేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.  తాను కేరళలో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటానని తెలిపింది. తన భార్త తనకంటే ఎక్కువ బిజీగా ఉంటారని, ఎప్పుడో ఒకసారి కలుస్తామని చెప్పుకొచ్చింది. 

Also Read: తండ్రిని మరోసారి చంపేసిన పార్లలమ్మ, బెడిసికొట్టిన బాలు ప్లాన్, చింతామణి కొత్త స్కెచ్ - గుండెనిండా గుడిగంటలు జూన్ 02 ఎపిసోడ్

రెమ్యూనిరేషన్  

బుల్లితెరపై ప్రేమి విశ్వనాథ్‌కు ఉన్న క్రేజ్ కారణంగా ఆమె పారితోషికం కూడా భారీగా అందుకుంటుంది.  'కార్తీక దీపం 1' సీజన్ సమయంలో ఒక్కో ఎపిసోడ్‌కు సుమారు రూ.25,000 వరకు తీసుకునేవారని ఇండస్ట్రీ టాక్. ఇక ప్రస్తుతం నడుస్తున్న 'కార్తీక దీపం 2' సీక్వెల్ కోసం ఆమె తన క్రేజ్, డిమాండ్‌ను బట్టి రెమ్యూనిరేషన్‌ను భారీగా పెంచి, ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ.50,000 వరకు తీసుకుంటున్నారని సమాచారం. బుల్లితెర ఫీమేల్ యాక్టర్స్‌లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటుల్లో ప్రేమి ఒకరుగా చెబుతారు.

ఫొటోగ్రఫీ అంటే.. 

ప్రేమి విశ్వనాథ్‌కు నటనతో పాటు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆమె సోదరుడు శివప్రసాద్ కేరళలో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కావడంతో, ఆమె కూడా ఆ ఇష్టంతో కొన్ని పెళ్లిళ్లకు స్వయంగా ఫొటోగ్రఫీ కూడా చేశారు. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. కొచ్చి, తిరువనంతపురంలో ఉన్న 'V Media The Complete Studio' అనే రెండు ఫిల్మ్ స్టూడియోలకు ఆమె మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.  సీరియల్స్‌తో పాటు 'సాల్మన్ 3D' వంటి కొన్ని సినిమాలో కూడా ప్రేమి నటించింది.

Also Read: జ్యూస్‌లో మద్యం కలిపి సిద్ధూతో తాగించిన విజయానంద్‌...ప్రేరణే తాగించిందంటూ నాటకం

సోషల్ మీడియాలో యాక్టివ్ 

ప్రేమి విశ్వనాథ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో (premi_vishwanath) షూటింగ్ లొకేషన్ విశేషాలు, రీల్స్, తన వ్యక్తిగత లైఫ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. సీరియల్‌లో చాలా డల్‌గా, డీగ్లామర్‌గా కనిపించే వంటలక్క.. రియల్ లైఫ్‌లో మాత్రం చాలా మోడ్రన్‌గా, బోల్డ్‌గా ఉంటుంది. 

మరింత మంది సీరియల్ నటులు గురించి ఇక్కడ తెలుసుకోండి

1 'నిండు మనసులు' సీరియల్ సిద్ధు గురించి ఈ విషయాలు తెలుసా?
2 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ చిన్నోడు.. నితిన్ అద్వి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
3 కార్తీక దీపం 2 విలన్ రోల్ జ్యోత్స్న.. హోస్ట్, సీరియల్స్.. ఇంకా మరెన్నో!
4 పెద్దికి 'పొదరిల్లు' సీరియల్‌లో పెళ్లికాలేదు కానీ రియల్ వైఫ్ ఫొటోస్ చూశారా!
5 'పొదరిల్లు' సీరియల్ సూర్యప్రతాప్ ( ఆనంద్) ఏ ఏ సినిమాల్లో నటించారు, రోజుకి ఆయన రెమ్యునరేష్ ఎంతో తెలుసా?

 

Frequently Asked Questions

ప్రేమి విశ్వనాథ్ స్వస్థలం ఏమిటి? ఆమె నటనకు ముందు ఏం చేసేవారు?

ప్రేమి విశ్వనాథ్ కేరళలోని ఎర్నాకులం (కొచ్చి) లో జన్మించారు. ఆమె న్యాయవాద కోర్సు పూర్తి చేసి, నటనకు ముందు లీగల్ అడ్వైజర్‌గా పనిచేశారు.

ప్రేమి విశ్వనాథ్ తెలుగు బుల్లితెరకు ఎలా పరిచయమయ్యారు?

ఆమె మలయాళ సీరియల్ 'కరతముత్తు' తెలుగు రీమేక్ 'కార్తీక దీపం' ద్వారా పరిచయమయ్యారు. ఈ సీరియల్ ద్వారా ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆదరణ పొందారు.

ప్రేమి విశ్వనాథ్ నటన కాకుండా ఇతర ఏ రంగాలలో రాణిస్తున్నారు?

ఆమెకు బిజినెస్, ప్రొడక్షన్, ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. కొచ్చి, తిరువనంతపురంలో 'V Media The Complete Studio'లకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

ప్రేమి విశ్వనాథ్ ప్రస్తుత రెమ్యునరేషన్ ఎంత?

'కార్తీక దీపం 1'లో ఎపిసోడ్‌కు రూ.25,000 తీసుకోగా, 'కార్తీక దీపం 2' కోసం రూ.50,000 వరకు తీసుకుంటున్నారని సమాచారం. ఆమె అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
Gundeninda Gudigantalu August 20th:షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
గుండెనిండా గుడిగంటలు: షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
Brahmamudi Serial Today August 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
Illu Illalu Pillalu Serial Today August 20th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget