అన్వేషించండి

Premi Vishwanath: నిజంగా ఏడిస్తే యాక్టింగ్ అనుకున్నారు - షూటింగ్ తర్వాత అక్కడికి వెళ్లిపోతా: ‘కార్తీక దీపం 2’ నటి ప్రేమి విశ్వనాథ్

Premi Vishwanath: ‘కార్తీక దీపం’లో దీపగా, వంటలక్కగా ప్రేక్షకులను అలరించారు ప్రేమి విశ్వనాధ్. అసలు తను సీరియల్ నటిగా ఎలా మారారో కొన్నాళ్ల క్రితం ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

Karthika Deepam 2 Actress Premi Vishwanath: సినిమాలతో మాత్రమే కాదు.. సీరియల్స్‌తో కూడా విపరీతంగా పాపులారిటీ సంపాదించుకున్న నటీనటులు ఉన్నారు. ఇక గత కొన్నేళ్లలో ఏ సీరియల్‌కు రానంత పాపులారిటీని సంపాదించుకుంది ‘కార్తీక దీపం’. ఈ సీరియల్‌లో నటించిన నటీనటులకు కూడా బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ లభించింది. ముఖ్యంగా ఇందులో లీడ్ రోల్ చేసిన నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్, శోభా శెట్టి పాత్రలకు ప్రేక్షకులు చాలా దగ్గరయ్యారు. ఇప్పుడు ఈ సీరియల్‌కు సీక్వెల్ వస్తున్న సందర్భంగా ప్రేమి విశ్వనాథ్ ఓ ఇంటర్వ్యూ‌లో మాట్లాడింది. ‘కార్తీక దీపం’ అనుభవాలను పంచుకున్నారు ప్రేమి.

ఛాలెంజ్‌లాగా అనిపించింది..

ప్రేమి విశ్వనాథ్ చదివి కొన్నాళ్లు లీగల్ అడ్వైసర్‌గా పనిచేసి ఆ తర్వాత సీరియల్స్‌లోకి ఎంటర్ అయ్యారు. ముందుగా ‘కార్తీక దీపం’ సీరియల్ మలయాళంలో తెరకెక్కింది. ‘కరుత ముతు’ అనే టైటిల్‌తో మలయాళంలో టెలికాస్ట్ అయ్యింది. అందులో కూడా ప్రేమి విశ్వనాథ్ లీడ్ రోల్‌లో నటించారు. అందుకే తెలుగులో కూడా నటిని మార్చకుండా తననే హీరోయిన్‌గా ఎంపిక చేశారు మేకర్స్. ముందుగా ‘కరుత ముతు’ సీరియల్‌లో బ్లాక్ మేకప్ వేసుకొని నటించడం ఛాలెంజ్‌లాగా అనిపించిందని ప్రేమి చెప్పుకొచ్చారు. నల్లగా ఉండే అమ్మాయిలు కలర్ కోసం కష్టపడుతున్నారని.. కానీ ఈ సీరియల్ చాలామందిలో పాజిటివ్ ఆలోచనను తీసుకొచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. లీగల్ అడ్వైసర్‌గా పనిచేసిన ప్రేమి.. సీరియల్స్‌లోకి ఎంటర్ అవ్వడానికి కారణాన్ని బయటపెట్టారు.

అలా నన్ను సెలక్ట్ చేశారు..

‘‘చాలామంది ‘కరుత ముతు’లో హీరోయిన్‌‌గా నటించేందుకు ఆడిషన్స్‌కు వచ్చారు. కానీ ఎవరూ సెట్ అవ్వలేదు, డైరెక్టర్‌కు నచ్చలేదు. నా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అంకుల్ వచ్చి ఆ రోల్ కోసం నన్ను ప్రయత్నించమన్నారు. వాళ్లకు టెలికాస్ట్ డేట్ దగ్గరకు వచ్చింది, ఇంకా సీరియల్ స్టార్ట్ అవ్వలేదు. ఒకసారి వెళ్లమన్నారు. అప్పుడు కూడా నాకు యాక్టింగ్ రాదు. నేను చేయను మీకోసమే వస్తున్నాను అన్నాను. ఆడిషన్ వరకు మాత్రమే వస్తాను అని చెప్పి వెళ్లాను. వెళ్లగానే క్లీన్ చేయడానికి కర్ర చేతిలో పెట్టారు. తర్వాత బ్లాక్ కలర్ మేకప్ వేశారు. స్క్రీన్ టెస్ట్ చేశారు. అత్త క్యారెక్టర్ తిట్టినందుకు నేను నిజంగానే ఏడ్చాను. అది యాక్టింగ్ అనుకొని అలా నన్ను సెలక్ట్ చేశారు’’ అంటూ తను సీరియల్ యాక్టర్‌గా ఎలా మారారో గుర్తుచేసుకున్నారు ప్రేమి విశ్వనాథ్.

ప్రముఖ జ్యోతిష్యుడు..

ఈ ఇంటర్వ్యూలో తన భర్త ప్రముఖ జ్యోతిష్యుడని బయటపెట్టారు ప్రేమి విశ్వనాథ్. తను కేరళలోని కొచ్చీలో సెటిల్ అయ్యిందని, హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తయ్యక అక్కడికే వెళ్లిపోతానని తెలిపారు. ఇక ‘కార్తీక దీపం’తో పాటు ఒక సినిమాలో లీడ్‌ రోల్ చేశానని చెప్పుకొచ్చారు. అందులో పోలీస్ పాత్రలో కనిపించానన్నారు. నాగచైతన్య హీరోగా నటించిన ‘కస్టడీ’లో కూడా అలా కాసేపు మెరిసారు ప్రేమి విశ్వనాథ్. తనకు ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని సినిమాకు హైప్ తీసుకురావడం కోసమే ప్రేమికి అవకాశం ఇచ్చారని ఈ వంటలక్క ఫ్యాన్స్ అప్పట్లో కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ‘కార్తీకదీపం 2’తో ప్రేక్షకులను మరోసారి ఎంటర్‌టైన్ చేయడానికి వచ్చేశారు దీప అలియాస్ వంటలక్క.

Also Read: సినిమా విడుదలైన 48 గంటల వరకు రివ్యూలు ఇవ్వొద్దు: హైకోర్టు కీలక తీర్పు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget