అన్వేషించండి

Gayathri Simhadri: కార్తీక దీపం 2 విలన్ రోల్ జ్యోత్స్న.. హోస్ట్, సీరియల్స్.. ఇంకా మరెన్నో!

Gayathri Simhadri: కార్తీక దీపం 2 లో విలన్ రోల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది జ్యోత్స్న అలియాస్ గాయత్రి సింహాద్రి. ఆమె సీరియల్ లైఫ్, రెమ్యూనిరేషన్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కార్తీక దీపం 2 సీరియల్‌లో గాయత్రి సింహాద్రి నటన ఆకట్టుకుంటోంది.
  • గాయత్రి మోడలింగ్‌లో విజయవాడ నుంచి వచ్చి, నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
  • ఆమె 'త్రినయని', 'కార్తీకదీపం 2' సీరియల్‌లలో విలన్‌గా పేరు సంపాదించింది.
  • సోషల్ మీడియాలో గాయత్రి గ్లామర్ ఫోటోషూట్స్, రీల్స్‌తో ఆకట్టుకుంటోంది.

Gayathri Simhadri: తెలుగు రాష్ట్రాల సీరియల్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది కార్తీక దీపం 2. ఈ సీరియల్ రేటింగ్స్ కూడా టాప్ లేపుతున్నాయి. ఈ సీరియల్‍లో లేడీ విలన్ జ్యోత్స్న అలియాస్ గాయత్రి సింహాద్రి తన యాక్టింగ్‍తో దుమ్ములేపుతోంది. కన్నింగ్ నటనతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ పాపులర్ అవుతోంది. ఇన్‍స్టాగ్రామ్‍లో గ్లామర్ షోతో ఫాలోవర్స్ ను రెచ్చగొడుతోంది. కార్తీక దీపం 2 సీరియల్‍లో విలన్ రోల్ చేస్తున్న జ్యోత్స్న అసలు పేరు గాయత్రి సింహాద్రి. ఇప్పటికే పలు సీరియల్స్‌తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి.. యాంకర్‌గానూ బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.  

గాయత్రి సింహాద్రి కెరీర్

గాయత్రి మున్ని సింహాద్రి తెలుగు సీరియల్ నటి, మోడల్. ఈమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‍లోని విజయవాడ. అయితే గాయత్రి విశాఖపట్నంలో పెరిగింది. చదువు తర్వాత, గాయత్రి మోడలింగ్‌లో తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది. మిసెస్ వైజాగ్ వంటి కొన్ని టైటిళ్లను కూడా గెలుచుకుంది. 2022లో తెలుగు ఛానల్‌లో ప్రసారమైన 'త్రినయని' సీరియల్‌తో  బుల్లితెరపై తన నట జీవితాన్ని ప్రారంభించింది. గాయత్రి ఆ తర్వాత పల్లకిలో పెళ్లికూతురు వంటి కొన్ని సీరియల్స్‌లో నటించింది. 

    • త్రినయని: ఈ సీరియల్‌లో గాయత్రి పోషించిన నెగిటివ్ క్యారెక్టర్ మంచి గుర్తింపు తెచ్చింది.  
    • కార్తీకదీపం 2 - నవ వసంతం: బుల్లితెర హిస్టరీలోనే భారీ క్రేజ్ ఉన్న 'కార్తీకదీపం' సీక్వెల్‌లో కీలకమైన 'జోత్స్న' మెయిన్ విలన్ పాత్రలో ఛాన్స్ కొట్టింది. కార్తీక దీపం 1 లో మోనిత (శోభా శెట్టి) ఎలాగైతే కార్తీక్‌ని ప్రేమిస్తూ దీపను ఇబ్బంది పెడుతుందో.. పార్ట్ 2లో అదే రేంజ్‍లో విలనిజాన్ని జోత్స్న పాత్రలో గాయత్రి పండిస్తోంది.   

గాయత్రి సింహాద్రి డైరెక్ట్‌గా సీరియల్స్ లోకి ఎంటర్ అవ్వలేదు. మొదట యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. బుల్లితెరపై ప్రసారమైన 'సూపర్ ఫ్యామిలీ', 'జోష్' వంటి పాపులర్ టెలివిజన్ షోలకు హోస్ట్‌గా పనిచేసింది. ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో సీరియల్స్ వైపు అడుగులు వేసింది. విలన్ పాత్రలతో మంచి పేరు తెచ్చుకుని టాప్ సీరియల్స్ లో నటిస్తోంది. 

Also Read: ఇల్లు ఇల్లాలు పిల్లలు: చితక్కొట్టుకున్న మొగుడుపెళ్లాలు! సారె తీసుకొచ్చిన ప్రసాద్‌రావు! నర్మద రియాక్షన్ ఏంటి?

సోషల్ మీడియాలో యాక్టివ్ 

సీరియల్స్‌లో ఎప్పుడూ చీరలు కట్టుకుని, కోపంగా, కుట్రలు చేసే విలన్‌ రోల్‍లో కనిపించే గాయత్రి.. సోషల్ మీడియాలో మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌(gayathrisimhadrii)లో ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన మోడ్రన్ అవుట్‌ఫిట్స్, ట్రెండీ ఫొటోషూట్స్, రీల్స్‌ను షేర్ చేస్తూ ఉంటుంది.  కార్తీకదీపం 2లో జాయిన్ అయిన తర్వాత ఆమె ఫాలోయింగ్, క్రేజ్ సోషల్ మీడియాలో మరింత పెరిగాయి. షూటింగ్ గ్యాప్‌లో మాత్రం సెట్స్‌లో అందరితో చాలా సరదాగా, ఫ్రెండ్లీగా ఉండే వీడియోలు గాయత్రి సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది. ట్రెడిషనల్ వేర్ మాత్రమే కాకుండా వెస్ట్రన్ అండ్ మోడ్రన్ డ్రెస్సులలో కూడా గాయత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే ఫొటోషూట్‌లు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. 

Also Read: 'గోదావరి' సీరియల్: నువ్వు చచ్చినా నీ శవం చూడటానికి రానురా.. తమ్ముడి కాలర్ పట్టుకొని గెంటేసిన శాంతి..!

రెమ్యూనిరేషన్ 

ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. కార్తీకదీపం 2  లాంటి టాప్ రేటింగ్ సీరియల్‌లో మెయిన్ విలన్ రోల్ చేస్తోన్న గాయత్రి  రోజువారీ కాల్‍షీట్ మంచి రెమ్యూనిరేషన్ అందుకుంటోందని సమాచారం. సీనియారిటీ, సీరియల్ క్రేజ్ బట్టి లీడ్ విలన్లకు రోజుకు రూ. 15,000 నుంచి రూ. 25,000 వరకు ఇండస్ట్రీలో ఇస్తుంటారు. ఆమెకు కూడా అదే రేంజ్‌లో పారితోషకం లభిస్తోందని అంచనా. 

Also Read: బుల్లితెరపై రాణిస్తున్న తెలుగింటి అందం.. అన్షురెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

Frequently Asked Questions

జ్యోత్స్న అసలు పేరు ఏమిటి?

కార్తీక దీపం 2 సీరియల్‌లో లేడీ విలన్ జ్యోత్స్న అసలు పేరు గాయత్రి సింహాద్రి.

గాయత్రి సింహాద్రి ఏ సీరియల్‌తో నట జీవితాన్ని ప్రారంభించింది?

గాయత్రి సింహాద్రి 2022లో 'త్రినయని' సీరియల్‌తో బుల్లితెరపై తన నట జీవితాన్ని ప్రారంభించింది.

గాయత్రి సింహాద్రి సోషల్ మీడియాలో ఎలా కనిపిస్తుంది?

సీరియల్‌లో విలన్‌గా కనిపించే గాయత్రి, సోషల్ మీడియాలో మోడ్రన్ అవుట్‌ఫిట్స్, ట్రెండీ ఫొటోషూట్స్‌తో భిన్నంగా కనిపిస్తుంది.

కార్తీక దీపం 2లో గాయత్రి సింహాద్రి పాత్ర ఏమిటి?

కార్తీకదీపం 2లో గాయత్రి 'జోత్స్న' అనే కీలకమైన మెయిన్ విలన్ పాత్రలో నటిస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Nindu Manasulu Serial Today July 31st: నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
Karthika Deepam 2 Serial Today July 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
Illu Illalu Pillalu Serial Today July 31st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Embed widget