Karthika Deepam In Netflix: ఏవండోయ్ ఇది విన్నారా! సినిమాగా 'కార్తీకదీపం' సీరియల్
బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏంటంటే... ఈ సీరియల్ త్వరలో సినిమాగా రాబోతోందట...
Karthika Deepam: ఐదేళ్లుగా కాంతులీనుతోన్న కార్తీకదీపం...నెక్ట్స్ జనరేషన్ మొదలయ్యాక కాస్త కొడిగట్టినా..మళ్లీ వంటలక్క, డాక్టర్ బాబు ఎంట్రీతో మళ్లీ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. బాహుబలి నాన్ బాహుబలి రికార్డ్స్ లా... కార్తీకదీపం -వితౌట్ కార్తీకదీపం రేటింగ్స్ అని మాట్లాడుకునేవారు. అందుకే ఈ సీరియల్ బుల్లితెర బాహుబలిగా స్థిరపడిపోయింది. అయితే ఈ రేంజ్ క్రేజ్ ఉన్న సీరియల్ ని క్యాష్ చేసుకునేందుకు మరో అడుగు ముందుకేస్తున్నారట నిర్వాహకులు. బుల్లితెరపై నుంచి వెండితెరపైకి కార్తీకదీపం షిప్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారని టాక్. అర్థంకాలేదా...అదేనండీ ప్రస్తుతం సీరియల్ గా వెలుగుతోన్న కార్తీదీపంను త్వరలో సినిమాగా తెరకెక్కించబోతున్నారట. ఈ మాట విన్న డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.
Also Read: డాక్టర్ బాబుని తీసుకెళ్లిపోయిన మోనిత, మళ్లీ వంటలక్కకు కష్టాలు మొదలు
ఎన్ని సీరియల్స్ వచ్చినా జాతీయ స్థాయిలో తగ్గేదే లే అన్నట్టు దూసుకుపోతోంది కార్తీకదీపం. త్వరలో సినిమాగా మారి చరిత్ర సృష్టించబోతోంది. కార్తీకదీపం సీరియల్‌లోని కీలక సన్నివేశాలను సినిమా రూపంలో విడుదల చేయబోతున్నారట. అయితే గత ఐదేళ్లుగా స్టార్ మా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో కార్తీకదీపం సీరియల్ ప్రసారం అవుతుండగా.. ‘కార్తీకదీపం’ సినిమా మాత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో ప్రసారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. మొదట థియేటర్స్‌లో విడుదల చేసి.. ఆ తరువాత Netflix వదలబోతున్నారట. అయితే ఈ ఐదేళ్ల ఎపిసోడ్‌లను కలిపి మూడు గంటల నిడివితో సినిమా చేస్తారా? లేదంటే.. ఇదే కథను తీసుకుని కొత్త క్యారెక్టర్లతో సినిమా తీస్తారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే జరిగితే కార్తీకదీపం ట్రెండ్ సెట్ చేసినట్టే..
Also Read: రిషి కోసం ఎంగేజ్మెంట్ రింగ్ చేయించే పనిలో పడిన వసు, తల్లిపై ద్వేషం తగ్గించుకున్న రిషి
కార్తీకదీపం సీరియల్ మొదట మలయాళంలో 'కరుతముత్తు' అనే టెలివిజన్ ధారావాహికగా రూపొందింది. మలయాళంలో అద్భుతమైన విజయం సాధించడంతో ఇతర భాషల నిర్మాతలను విశేషంగా ఆకర్షించింది. ఆ తర్వాత కన్నడలో ముద్దులక్ష్మి, తమిళంలో భారతీ కన్నమ్మ, మరాఠీలో రంగ్ మజా వెగ్లా, హిందీలో కార్తీక్ పూర్ణిమగా తెరకెక్కింది. తెలుగులో కార్తీకదీపంగా విశేష ఆదరణ పొందుతోంది..
ఈ సీరియల్‌లో దీపగా ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల లీడ్ రోల్స్‌లో నటించారు. మౌనితగా శోభా శెట్టి, హిమగా బేబీ సహ్రు, శౌర్యగా బేబీ కార్తీక, సౌందర్యగా అర్చనా అనంత్ అదరగొట్టేస్తున్నారు. సెకెండ్ జనరేషన్ ఎపిసోడ్స్ లో నిరుపమ్ గా మానస్, హిమగా కీర్తి కేశవ్ భట్, శౌర్య గా అమూల్య గౌడ నటిస్తున్నారు. కార్తీకదీపం సినిమాగా వస్తోందని తెలియగానే నెటిజన్ల రియాక్షన్ ఓ రేంజ్ లో ఉంది. ఫన్నీ మీమ్స్ తో నవ్వులు పూయిస్తున్నారు. మరి ఇదే నిజమైతే బుల్లితెర బాహుబలి అనిపించుకున్న కార్తీకదీపం వెండితెరపై ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో...
View this post on Instagram
Also Read: శౌర్యకి వాటర్ బాటిల్ కొనిచ్చిన దీప, ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ బాబు -మోనిత కోసం వెయిటింగ్